సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. శాసనసభలోని కమిటీ హాల్ నంబర్– 1లో నేటి (శుక్రవారం) ఉదయం 9 గంటలకు ప్రారంభైమన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగింది. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించగా.. అందులో 108 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన మూడు రాజ్యసభ స్థానాల్లోనూ తమదే విజయమని అధికార టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్ బరిలో దిగిన విషయం తెలిసిందే.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటింగ్‌ను ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ సీపీఎం ఎమ్మెల్యే బహిష్కరించారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం ఇటీవల రద్దయింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఏజెంట్‌కు పోలింగ్ పేపర్ చూపించిన కారణంగా ఆ ఓటును రద్దు చేయాలని ఎన్నికల అధికారిని కలిసి టీఆర్ఎస్ నేతలు కోరారు.
నేడు దేశ వ్యాప్తంగా 7 రాష్టాల్లో 26 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment