
సాక్షి, నల్గొండ: త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగవచ్చని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుని రేస్‌లో తను ఉన్నానని తెలిపారు. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయనకు అభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే తన ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ ఎక్కువని విమర్శించారు. ఐదేళ్లుగా నిధులివ్వకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.చిన్న చిన్న పనులకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎంపీగా పార్లమెంటులో జిల్లా సమస్యలను ప్రస్తావించానని తెలిపారు.