హైదరాబాద్,సాక్షి : ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం నిన్న తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. చివరికి అరెస్ట్‌లకు దారితీసింది.
ఈ తరుణంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని అని అరికెపూడి గాంధీ చెప్పారు. సచ్చి పోయిన పార్టీని బ్రతికించడం కోసం నాటకాలు అడుతున్నారా? సర్పంచ్‌కి పనికి రాని కౌశిక్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు.ఆంధ్రప్రాంత ప్రజల్ని తిట్టడం బీఆర్‌ఎస్ విధానామా ’ అని ప్రశ్నించారు.
వాళ్లు లేకుంటే బీఆర్‌ఎస్‌కు ఇన్ని సీట్లు వచ్చేవా? జీహెచ్‌ఎంసీలో ఎలా ఎలా గెలిచారు? అని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీయాలనేది వాల్ల ఉద్దేశం.కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు.
ఇదీ చదవండి : ఈ తండ్రంటే కూతురికి అసహ్యం
Comments
Please login to add a commentAdd a comment