సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆగస్టు 15వ తేదీలోపే తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది పెద్ద జోక్ అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ..‘భువనగిరి, ఆలేరు ప్రజలకు ఇన్నాళ్లు తాగడానికి నీరు కూడా లేక మూసీ నీరు తాగుతున్నారు. నాలుగు నెలల్లోనే మూసీ నదిని శుద్ధి చేస్తాం. ఆగష్టు 15వ తేదీలోపే రైతులకు రుణమాఫీ చేస్తాం. హైదరాబాద్-విజయవాడ హైవేని ఆరు లైన్లుగా మారుస్తాం.
తెలంగాణలో కేసీఆర్ పదిహేనేళ్లు అధికారంలో ఉంటామనేది ఓ పెద్ద జోక్. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఏడు చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను పట్టించుకోవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment