Nalagonda
-
నల్లగొండ మున్సిపాలిటి వద్ద ఉద్రిక్తత
నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటి(nalgonda municipality) వద్ద బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకులు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కార్యకర్తలు బైఠాయించడంతో.. కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌ెడ్డి మండిపడ్డారు.అదే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తరలించారు.అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతాం..నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కాంగ్రెస్(Congress) నేతలు మండిపడుతున్నారు. అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వ్యతిరేకంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రస్తకే లేదన్నారు. ‘పోలీసులపై కంచర్ల భూపాల్ రెడ్డి దుర్భాషలాడారు. కంచర్ల భూపాల్ రెడ్డి పదేపదే అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాం ఇకపై ఉరికిచ్చి కొడతాం.కంచర్ల భూపాల్ రెడ్డి ఒక మెంటల్ కృష్ణ’అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల, అనుచరుల దాడితెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
కానిస్టేబుల్ తో ఎస్సై వివాహేతర సంబంధం.. న్యాయం కావాలంటూ భార్య ఆందోళన
-
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ– ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో 72.44% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78. 59% నమోదైంది. అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 67.62% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జర గ్గా, 12 జిల్లాల పరిధిలోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ గట్టి బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది పోటీలో ఉన్నా రు. ప్రధాన పోటీ 3 పార్టీల అభ్యర్థుల మధ్య నే కొనసాగగా, జూన్ 5న వీరి భవితవ్యం తేలనుంది.స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత..నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పల పల్లిలో గిడ్డంగుల సంస్థ గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రత ఉంది. చుట్టుపక్కల 144 సెక్షన్ విధించడంతోపాటు పోలీసులు 24 గంటలపాటు సాయుధ రక్షణలో పహారా కాస్తూ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లోని బ్యాలెట్ బాక్సులను మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాహుల్ బొజ్జా, రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ
-
బీఆర్ఎస్కు వీఆర్ఎస్
2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా కుటుంబ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ పార్టీ రెండు తరాల 2జీ.. ఓవైసీ పార్టీ మూడు తరాల 3జీ. కాంగ్రెస్ పార్టీ 4జీ.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, ఇప్పుడు రాహుల్‌గాంధీ. ఈ 2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. చందమామపైకి చంద్రయాన్‌ను తీసుకెళ్లిన మోదీకి అవకాశం ఇవ్వాలి. అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతాం బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అక్రమాలు, ఆక్రమణలు, కుంభకోణాల రాష్ట్రంగా తయారు చేసింది. బీఆర్ఎస్ అంటేనే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి. మియాపూర్ భూముల్లో రూ.4 వేల కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డులో రూ.3,300 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.40 వేల కోట్ల అవినీతి జరిగింది. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపి జైలుకు పంపడం ఖాయం. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, వరంగల్: తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని.. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి.. వాటిని బీసీ, ఎస్టీ, ఎస్సీలకు పంచుతామని ప్రకటించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శనివారం ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నల్లగొండ జిల్లా కేంద్రం, వరంగల్‌లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్ అబద్ధాలతో ప్రపంచ రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా.. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేదు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు రూ.3 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారింది. దళితబంధు పథకం పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలా, కేసీఆర్ మోసపూరిత అబద్ధాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించాలి. కమలం గుర్తుపై బటన్ నొక్కి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం తెలంగాణలో 52 శాతం ఓబీసీలే. 135 బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ వ్యతిరేక పార్టీలు. అవి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశాయి. బీసీల గురించి ఆలోచించే బీజేపీ ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో తన కుమారుడిని సీఎం చేయాలని కేసీఆర్ చూస్తుంటే.. కేంద్రంలో తన కుమారుడిని ప్రధానిని చేయాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు. అదే బీజేపీ అధికారంలోకి వస్తే మా బిడ్డలో, కొడుకులో, బంధువులో సీఎం, ప్రధాని కారు. ప్రధాని మోదీ ప్రకటించినట్టుగా తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం చేస్తాం. తెలంగాణ బడ్జెట్లో బీఆర్ఎస్ సర్కారు ఎంబీసీల కోసం రూ.3,300 కోట్లు కేటాయించి.. రూ.77 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేంద్రంలోని ప్రధాని మోదీ కేబినెట్లో 27మంది బీసీ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ కూడా బీసీయే. ఈ ఘనత బీజేపీకే దక్కుతుంది. జాతీయ బీసీ కమిషన్‌కు సర్వాధికారాలు ఇచ్చాం. సవరణ చేయడానికి రాష్ట్రాలకు హక్కు కల్పించాం. జాతీయ స్థాయిలో జరిగే ఎంబీబీఎస్ పరీక్షల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్ ఇచి్చన ఘనత బీజేపీదే. పేపర్ లీకేజీలతో యువత జీవితాలు నాశనం బీఆర్ఎస్ సర్కారు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలతో యువత జీవితాలను నాశనం చేసింది. పేపర్ లీకేజీల వల్ల ప్రవళిక, రహ్మత్ల ఆత్మహత్య చేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో పారదర్శకంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం కాంగ్రెస్ 70 ఏళ్లుగా అయోధ్య రామమందిర నిర్మాణ విషయాన్ని వివాదాస్పదం చేసింది. కానీ మోదీ రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. వచ్చే ఏడాది జనవరి 22న మందిరాన్ని ప్రారంభిస్తాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా రామమందిర దర్శనం చేయిస్తాం..’’ అని అమిత్‌షా ప్రకటించారు. ఈ సభల్లో సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్ కాళీప్రసాద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పాలి: డీకే అరుణ ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ.. ప్రపంచ దేశాల్లో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప నాయకుడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం అన్ని వర్గాలను మోసం చేసి, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు గుణపాఠం చెబితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. కారు స్టీరింగ్ ఒవైసీల చేతుల్లో.. నిజాం పాలన నుంచి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణకు స్వేచ్ఛ ప్రసాదిస్తే.. సీఎం కేసీఆర్ ఒవైíసీకి లొంగిపోయి విమోచన దినోత్సవం చేయడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినాన్ని రాష్ట్ర అవతరణ దినంగా నిర్వహిస్తాం. బీఆర్ఎస్ గుర్తు కారు అయినా.. దాని స్టీరింగ్ ఒవైసి చేతుల్లో ఉంది. ముస్లింలను సంతోషపెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. భద్రాచలంలో రాములవారికి సీఎం పట్టువ్రస్తాలు సమర్పించే ఆనవాయితీని మరిచిపోయారు. రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. బీజేపీ వస్తే వాటిని రద్దు చేసి ఓబీసీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. వాల్మికుల సమస్యలను కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకురాలేదు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే వారి సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణ అభివృద్ధికి ఐదు లక్షల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ సర్కారు ఉమ్మడి ఏపీకి రూ.2లక్షల కోట్లు ఇస్తే.. తర్వాతి తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది. తెలంగాణలో హైవేల అభివృద్ధికి, సమ్మక్క–సారలమ్మ జాతర, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు, వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్లలతోపాటు ఇతర అభివృద్ధి పనులు కలిపితే రూ.ఐదు లక్షల కోట్లు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోయిన ఘటనలు జరగడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంజీఎంలో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. -
అమరుల కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు..?
నల్లగొండ: తెలంగాణ కోసం 1,200 మంది అమరులైతే ఆ కుటుంబాలందరికీ కేసీఆర్ ఎందుకు ఉద్యోగం కల్పించలేదని నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన నాడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ సోనియా గాంధీ కాళ్లు మొక్కారని, నేడు ఆమెను బలి దేవత అంటున్నాడని, 1,200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాతనే తెలంగాణ ఇచ్చిందనడం దురదృష్టకరమన్నారు. మంగళవారం ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి ఎలాంటి పదవి ఇవ్వలేదని విమర్శించారు. నిధులు, నీరు, నియామకాలు పేరిట ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ చేస్తారనుకుంటే బాధల తెలంగాణ చేశాడని, ఒకటో తేదీ జీతాలు రావడం లేదని, కట్టిన ప్రాజెక్టులు నాణ్యత లేక కూలిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీ స్కీమ్‌లను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్, అదే రోజు కేసీఆర్ రాజీనామా చేస్తాడని చెప్పారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటించిన రోజే కాదు.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా. అదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తోంది. ప్రతి హామీని నెరవేరుస్తుంది’అని చెప్పారు. ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది.. ‘ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం అవుతాడు. మీకున్న తొందర నాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకు సీఎం కావల్సిన అవసరం లేదు’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభలో ప్రజలంతా సీఎం.. సీఎం అని నినాదాలు చేయగా కోమటిరెడ్డి పైవిధంగా స్పందించారు. ‘నా చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టిచ్చి నా తక్కువే. 20 ఏళ్లుగా నన్ను ఎంతో పెద్ద నాయకుడిని చేసి గుర్తింపు తెచ్చారు. ఒక్క పిలుపుతోనే నా నామినే షన్‌కు వేలాదిగా తరలి వచ్చారు. నా జన్మ ధన్యమైంది. మీ కోసం ఏ త్యాగాల కైనా సిద్ధమే’అని కోమటిరెడ్డి భావోద్యేగానికి గురైయ్యారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
43 ఏళ్లకి వచ్చావా సత్యంరెడ్డి..! చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనం
మిర్యాలగూడ: ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 43 ఏళ్ల పాటు సొంతింటికి దూరంగా ఉన్న ఓ మావోయిస్టు నేత ఇన్నేళ్లకి చేరుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గజ్జల సత్యంరెడ్డి అలియాస్ గోపన్న పీపుల్స్‌వార్ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేశారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1980లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీ విస్తరణకు కీలకంగా పని చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించిన సత్యంరెడ్డి 26 ఏళ్లు అడవిలో ఉండి.. 17 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీసులు మోపిన అన్ని కేసులనూ కోర్టులు కొట్టివేయడంతో ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తమ్ముడితో కలిసి సొంత ఊరైన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సత్యంరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అజ్ఞాతంలో ఉండగానే సత్యంరెడ్డి తోటి పార్టీ సభ్యురాలిని వివాహం చేసుకోగా ఆమె ఎన్కౌంటర్లో మరణించింది. అనంతరం ద్వితీయ వివాహం చేసుకున్నప్పటికీ ఆమె వివరాలు తెలియరాలేదు. సత్యంరెడ్డి తాను పుట్టి పెరిగిన ఊరిని సందర్శించి.. చిన్నప్పుడు తాను తిరిగిన ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి గుర్తుచేసుకున్నారు. తాను జైళ్లో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులు మరణించడంతో వారిని కడసారి చూసుకోలేకపోయానని ఆవేదన చెందారు. అయితే తన అన్నను, తమ్ముడిని, వారి కుటుంబసభ్యులను తిరిగి కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కలుసుకున్న వేళ భావోద్వేగపూరిత వాతావరణంలో కంటతడిపెట్టారు. ఇక మీదట తన జనజీవన స్రవంతిలోనే కొనసాగుతానని, తిరిగి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లేది లేదని సత్యంరెడ్డి చెప్పారు. -
రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం
‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం. సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి. వైద్యరంగంలో బలోపేతమయ్యాం.. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్ మార్కెట్ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి.. నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్ఎస్ స్కాన్ , కేన్సర్ యూనిట్కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. ⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం. ⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. ⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్నగర్ రింగ్ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్నగర్ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. ⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అండతో రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ⇒ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య : ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా. ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లో కోల్డ్స్టోరీజే ఏర్పాటు చేయిస్తా. ⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
భోజనం పెట్టేలా చూడండయ్యా...
సాక్షి. చౌటుప్పల్(మునుగోడు) : కుమారులు పట్టించుకోవడం లేదని రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆర్డీఓ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు పాలెం సత్తయ్య(80), అండాలు(70)లకు కుమారులు, కోడళ్లు ఉన్నారు. అయినా బుక్కెడు బువ్వకు నోచుకోవడం లేదు. నడవలేని స్థితిలో ఉన్న వారికి కుటుంబ సభ్యులు కనీస సేవలు సైతం చేయడం లేదు. నోరు తెరిచి అడిగినా పట్టించుకోకపోగా చీదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పరిస్థితిలో మార్పు వస్తుందని ఎంతో కాలంగా ఎదురుచూసినా మార్పు రాకపోవడంతో చట్ట ప్రకారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన మోర గోపాల్, మోర వెంకటేశ్‌ల సహాయంతో ఆటోలో స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉండడంతో అధికారులే ఆటో వద్దకు వచ్చి దంపతుల వివరాలను సేకరించారు. సత్తయ్య–అండాలు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు బాలయ్య మృతిచెందగా కోడలు యశోధ గ్రామంలోనే ఉంటుంది. రెండో కుమారుడు అంజయ్య–యాదమ్మ, మూడో కుమారుడు స్వామి–శోభ ఉన్నారు. రెండో కుమారుడు చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో పని చేస్తుండగా, మూడో కుమారుడు స్థానికంగా కారోబార్‌గా పని చేస్తున్నాడు. వృద్ధ దంపతులకు 1.06 ఎకరాల ప్రభుత్వ భూమి, నివాస గృహం ఉంది. ఆస్తుల పంపిణీ జరిగింది. చిన్నకుమారుడి వాటా ఇంట్లో కేటాయించిన గదిలో వృద్ధులు ఉంటున్నారు. వృద్దులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుత్తా వెంకట్‌రెడ్డి వృద్ధులు కూర్చున్న ఆటో వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కుమారులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా కోడళ్లు నిరాకరిస్తున్నారని వృద్ధులు బోరున విలపించారు. గతంలో ఇద్దరు కుమారులు నెలకు 500రూపాయల చొప్పున ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ ద్వారా వచ్చే రూ.2000తోనే పూటవెళ్లదీసుకుంటున్నామని తెలిపారు. జీవిత చరమాంకంలో ఉన్న తమకు భోజనం పెట్టించడంతో పాటు సేవలు అందించేలా చూడాలని వేడుకున్నారు. ఈ ప్రకారంగా కుమారులు, కోడళ్లకు ఆదేశాలు చేసి తమకు మేలు చేయాలని కోరారు. కాగా కుమారులకు నోటీసులు జారీ చేస్తామని గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపారు. -
ప్రేమించకుంటే..చంపేస్తా..?
సాక్షి, కనగల్(నల్గొండ) : ప్రేమించకుంటే చంపేస్తానని ఓ అమ్మాయిని బెరిరించిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కనగల్ మండలం పొనుగోడుకు చెందిన మేరుగు మైబూల్ తన కూతురును ఎంసెట్ కోచింగ్ ఇప్పించేందుకు ఐదు నెలల క్రితం హైదరాబాద్‌లో చేర్పించాడు. ఎంసెట్ ర్యాంకు రాకపోవడంతో అక్కడే ఓ డిగ్రీ కాలేజీలో చేర్పించారు. 20 ఏళ్ల క్రితం పొనుగోడు నుంచి చాడ పర్వతాలు కుటుంబం హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పర్వతాలుకు కుమారుడు లోకేష్ ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మైబూల్‌కు ఐదు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిన సమయంలో లోకేష్ తారసపడ్డాడు. ఒకటే ఊరు కావడం.. తనకు కుమారుడి వరుస (అమ్మాయికి అన్న వరుస) కావడంతో మైబూల్ తన కూతురును లోకేష్‌కు పరిచయం చేశాడు. ఇదే అదునుగా భావించిన లోకేష్ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుని మెల్లమెల్లగా ప్రేమించాలని వేధించడం మొదలు పెట్టాడు. ‘నన్ను ప్రేమించాలని, లేదంటే నిన్ను, మీ అమ్మానాన్నలను చంపేస్తా’ అని బెదిరించడంతో మైబూల్ తన కూతురు చదువు మాన్పించాడు. ఈ క్రమంలో ఆదివారం చాడ లోకేష్ హైదరాబాద్ నుంచి పొనుగోడుకు వచ్చి అమ్మాయిని బెదిరించి సైకోలా వ్యవహరించాడు. దీంతో అమ్మాయి బంధువులు కనగల్ పోలీసులకు తెలపడంతో సదరు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పీసీసీ చీఫ్ రేసులో ఉన్నా: ఎంపీ కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ: త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగవచ్చని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుని రేస్‌లో తను ఉన్నానని తెలిపారు. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు అభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే తన ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాభివృద్ధి కంటే కమీషన్లపైనే మక్కువ ఎక్కువని విమర్శించారు. ఐదేళ్లుగా నిధులివ్వకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీఎం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.చిన్న చిన్న పనులకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఎంపీగా పార్లమెంటులో జిల్లా సమస్యలను ప్రస్తావించానని తెలిపారు. -
హాజీపూర్: ఈ కారణం వల్లే వారు బలయ్యారు!
సాక్షి, యాదాద్రి: ‘బేటీ బచావో బేటీ పడావో’నినాదంతో బాలికల రక్షణ, చదువు కోసం ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో చదువు కోసం వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు ఓ కిరాతకుడి చేతిలో బలయ్యారు. సరైన రవాణా వసతి లేకున్నా.. తమ కుమార్తెలను చదువు కోసం పొరుగున ఉన్న గ్రామాలకు పంపించాయి ఆ పేద కుటుంబాలు. కానీ లిఫ్ట్ ఇచ్చే పేరుతో ఓ రాక్షసుడు ఆ బాలికలపై ఘోరానికి ఒడిగట్టాడు. హాజీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరో బాలికపై హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన విషయంలో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. రాజధానికి శివారునే ఉన్న బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు గ్రామాల మీదుగా భువనగిరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ముగ్గురు బాలికలు బలైపోయారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. స్పెషల్ క్లాసులకు వెళ్లి.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణి దంపతుల కుమార్తె(14) మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని సెరినిటీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆమె గతేడాది ఏప్రిల్ నెల 25న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లి సాయంత్రం 3 గంటలు దాటినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 2019 మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన హాజీపూర్ గ్రామానికే చెందిన మరో బాలిక(18) మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని కేఎల్ఆర్ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో 2019 మార్చిలో శివరాత్రి పర్వదినం అనంతరం 6వ తేదీన కాలేజీకి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఇద్దరు బాలికలనూ హాజీపూర్‌కే చెందిన శ్రీనివాస్‌రెడ్డి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి అత్యాచారం, హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. సాక్షి కథనంతో తెరపైకి మరో మిస్సింగ్ కేసు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న బాలిక (11) 2015లో అదృశ్యమైంది. ఈ మిస్సింగ్ కేసులో పోలీసులు నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. 2019 ఏప్రిల్ 29న ‘సాక్షి’దినపత్రికలో ఆ బాలిక మిస్సింగ్‌పై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన పోలీసు లు కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా, ఆ బా లికనూ తానే పొట్టన పెట్టుకున్నట్లు ఒప్పుకొన్నాడు. ఉద్యోగానికి పంపుదామంటే ఊపిరి తీసిండు: పేద కుటుంబానికి చెందిన నేను కూతురిని చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొద్దామంటే సైకో శ్రీనివాస్‌రెడ్డి తన కూతురు ఊపిరి తీసి నా ఆశలు ఆవిరి చేసిండు. శ్రీనివాస్‌రెడ్డికి బతికే హక్కు లేదు. కోర్టు తీర్పుతో పానం నిమ్మలమైంది. వాయిదాలు లేకుండా తొందరగా ఉరి తీసి మా పిల్లల పానాలు తీసిన బావిలోనే సైకోను పాతి పెట్టాలి. అప్పుడే పోకిరీలకు కనువిప్పు కలుగుతుంది. – తిప్రబోయిన మల్లేశ్, బాలిక తండ్రి -
దారుణం: మాటు వేసి వేటకొడవళ్లతో..
సాక్షి, హాలియా (నాగార్జునసాగర్) : గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హాలియా మున్సిపాలిటీ పరిధి హజారిగూడెం సేజి సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణానికి చెందిన శిర్సనగండ్ల శ్రీనివాస్ స్కూల్ బస్సు డ్రైవర్‌గా ఇతడి భార్య ఇందిరమ్మ పాలవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శిర్సనగండ్ల రేవంత్‌కుమార్(23) పాల వ్యాపారంలో తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రోజువారీగా తెల్లవారుజామున 4గంటల సమయంలో నాయుడుపాలెం గ్రామానికి పాలుపట్టడానికి రేవంత్‌కుమార్ బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలోని హజారిగూడెం గ్రామ సమీపంలో అప్పటికే మాటువేసిన దుండగులు రేవంత్‌కుమార్‌పై రాయితో దాడిచేశారు. దీంతో అతను బైక్‌పైనుంచి కిందపడగానే వారి Ðð వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో అతికిరాతకంగా దాడిచేసి పరారయ్యారు. తల్లిదుండ్రుల కళ్లెదుటే.. తల్లిదండ్రుల కంటే అర్ధగంట ముందు రేవంత్‌కుమార్ పాలు పట్టడానికి బయల్దేరాడు. కాసేపటికే అతడి తల్లిదండ్రులు కూడా పాలుపట్టడానికి ఆదారిగుండానే వెళ్తున్నారు. ఈ క్రమంలో తన కుమారిడి బైక్ కిందపడి ఉండటాన్ని చేసి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించారు. చుట్టు పక్కల వెతగ్గా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించారు. అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా రేవంత్‌కుమార్ తల్లిదండ్రుల ముందే తుది శ్వాస విడిశాడు. తెల్లవారు జామున కావడంతో వాకింగ్‌కు వచ్చిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వీరరాఘవులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన ఘర్షణలే కారణమా? రేవంత్‌కుమార్ హజరిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన హరి, సత్యనారాయణలతో రేవంత్కుమార్కు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాత గొడవలే హత్యకు కారణాలని పోలీసులు భావిస్తున్నారు. హరి, సత్యనారాయణలే తమ కుమారుడిని పొట్టన బెట్టుకున్నారని రేవంత్‌కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం హాలియాలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. డాగ్స్వా్కట్ బృందం వేలిముద్రలను సేకరించి మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
స్వాతంత్య్ర సమరయోధుడికి కన్నీటి వీడ్కోలు..
సాక్షి, మిర్యాలగూడ: స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరునగరు గంగాధర్‌కు ఆయన బంధువులు, స్నేహితులు, రాజకీయ ప్రముఖులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన 15 రోజులుగా సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నుంచి పట్టణంలోని షాబునగర్‌లో ఉన్న తన నివాసానికి పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. గంగాధర్ మృతితో మిర్యాలగూడలో విషాద చాయలు అలుముకున్నాయి. కడసారిగా చూసేందుకు పట్టణ ప్రజలు భా రీగా తరలివచ్చారు. ప్రజానాయకుడు అయిన గంగాధర్ మృతితో పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. గంగాధర్ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖులు.. రాజకీయ కురువృద్ధుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరునగరు గంగాధర్ మృతి విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మిర్యాలగూడ, కోదాడ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, వేనేపల్లి చందర్రావు అక్కడకు చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. గంగాధర్ కుమారుడు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తోపాటు గంగాధర్ భార్య కన్నీటి పర్వతం కా వడంతో మంత్రి స్వయంగా దగ్గరకు వెళ్లి కు టుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారని, సైనికుడిగా దే శానికి సేవలను అందించారని అన్నారు. గంగా ధర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గంగాధర్ సతీమణిని ఓదార్చుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత తిరునగరు గంగాధర్ పార్థివదేహాన్ని సందర్శనకుగాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంట సేపు ఉంచారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు గంగాధర్‌ను కడసారిగా చూసేందుకు తరలివచ్చారు. అనంతరం పట్టణ సమీపంలోని వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెంలో తన వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్లారు. కాగా అంతిమయాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ భూమి వరకు సాగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అంతమయాత్రలో పాల్గొన్నారు. గంగాధర్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మిర్యాలగూడ జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీని వాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు చీమ వెంకన్న, సత్యబాబు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు పి. సుబ్బారావు, పీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నా యక్, వివిధ పార్టీల నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, వస్కుల మ ట్టయ్య, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, చిట్టిబాబు నాయక్, స్కైలాబ్‌నాయక్, తాళ్లపల్లి రవిలతో పాటు వివిధ రా జకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్ర జాప్రతినిధులు, అధికారులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు. -
వీటితో చర్మ, జలుబు సమస్యలు దూరం
సాక్షి, చింతలపాలెం(హుజూర్నగర్) : చలికాలంలో పిల్లలు తరుచూ జబ్బుల బారిన పడుతుంటారు. దీనికి కారణం పిల్లల్లో వాతావరణ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం. దీనికితోడు తినే పదార్థాలు ఇవి ఇష్టంలేదు.. అవి ఇష్టం లేదు అంటూ తినకుండా మొండికేస్తుండడం అందరి ఇళ్లలో చూస్తుంటాం. దీంతో కలిగే చెడుప్రభావాన్ని కూడా శరీరంతోపాటు చర్మం కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చలికాలంలో చర్మానికి కాంతిని, ఆరోగ్యాన్ని అందించే విటమన్ ‘సి’ ఉన్న పళ్లను ఇతర పదార్థాలను తీసుకుంటే మంచిది. ఈ కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించగల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగించుకుని చలి కాలంలో వచ్చే రుగ్మతలను దూరం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తాగాలి అన్నింటికంటే ముందుగా చలికాలంలో నీటిని ఎక్కువగా తాగే అలవాటు చేసుకోవాలి. వేసవికాలంలో ఎంత నీరు తాగుతామో చలికాలంలో అందులో 20 శాతం నీటిని కూడా తాగం. ఈ కాలంలో వాతావరణంలో తేమ కూడా ఉండదు. దీని దుష్ప్రభావం శరీర ఆరోగ్యంపై చూపుతుంది. అంతే కాకుండా చర్మం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అల్లం: చలికాలంలో ఎక్కువగా అల్లం టీని ఇష్టపడతారు. ఈకాలంలో గొంతుకు ఉపశమనం కలిగించే అద్భుతమైన మందు అల్లం. పిల్లలు దగ్గు, శ్లేషంతో బాధపడుతుంటే వాళ్లకు అల్లం టీ తాగించాలి. దీని ప్రభావంతో రక్త ప్రసరణ కొంత మెరుగుపడుతుంది. చలి కారణంగా జీవ క్రియ మందగించడం లాంటి శారీరక క్రియల్లోనూ కూడా వేగం పుంజుకుంటుంది. బెల్లం: చలికాలంలో బెల్లం తినాలి. బెల్లం తింటే శరీరంలో వేడి పుట్టి అవసరమైన ఉష్ణం నిలిచి ఉంటుంది. బెల్లంలో ప్రొటీన్, మెగ్నీషియం, మినరల్స్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్ మొదలైనవి తగినంత మోతాదులో ఉంటాయి. చల్లదనంతో మందగించిన రక్త ప్రసరణకు ఇది చురుకుదనం కలిగిస్తుంది. జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. సాధారణంగా పిల్లలు బెల్లం తినడానికి ఇష్ట పడరు. కాబట్టి వారికి బెల్లం హల్వా ఇతర వంటకాలను చేసి తినిపించాలి. సూప్.. చలికాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడే పానీయం సూప్. మీరు కూడా రకరకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా అందరూ ఎక్కువగా ఇష్టపడేది టమాట సూప్. ఇంట్లో తయారు చేసుకునే టమాటా సూప్ చర్మానికి ఆరోగ్యానికి ఆశ్చర్యకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ పిల్లల కోసం దీనిని మీరు తయారు చేసేటప్పుడు అందులో వెన్న మిరియాలు తప్పనిసరిగా కలపాలి. మిరియాలు జీర్ణ శక్తికి, దగ్గుకు బాగా పనిచేస్తాయి. టమాటా సూప్‌తో పాటు బఠాణీలు, పప్పులు, మొక్కజొన్న పిండి, కూరగాయల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. ఉసిరి రసం: ఉసిరిలో విటమిన్ ‘సి’ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. స్వభావ రీత్యా విటమిన్ ‘సి’ ని వేడిచేస్తే అది నశించిపోతుంది. కాని ఉసిరిలో ఉండే విటమిన్ ‘సి’ వేడిచేసినా మరే విధంగా నశించిపోదు. ఉసిరితో పచ్చడి చేసో, మురబ్బా చేసో పిల్లలకు తినిపించవచ్చు. దీంతో పిల్లలకు జీర్ణ శక్తి బాగు పడుతుంది. చర్మం, శిరోజాలలో కూడా నిగారింపు వస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా. బత్తాయి: చలికాలంలో దొరికే అద్బుతమైన పండ్లలో బత్తాయి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ‘సి’ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని చలికాలంలో వాడితే చర్మ, జలుబు లాంటి సమస్యలు దూరమవుతాయి. ఈపండుకు చలువ చేసే స్వభావం ఉంటుంది. రాత్రి, ఉదయం లాంటి చల్లని వాతావరణంలో కాకుండా ఎండలో దీన్ని తినడం మంచిది. మీరు రోజుకు రెండు బత్తాయి పండ్లు తినగలిగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మ ‘టీ’: చలికాలంలో టీ వాడకం ఎక్కువగా ఉంటుంది. చలి కాలంలో మీరు నిమ్మ టీ తాగి చూడండి. శక్తి లభిస్తుంది. నిమ్మ కారణంగా లభించే విటమిన్ ‘సి’ తో చాలా లాభం కలుగుతుంది. పిల్లలకు ఇచ్చే సలాడ్లలో కూడా నిమ్మ రసం కలిపి సర్వ్ చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆహారం ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి చలి కాలంలో చిన్న పిల్లల ఆహారం ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. చలి కాలంలో గోరు వెచ్చని నీరు తాగాలి. స్వెట్టర్లు, మఫ్లర్లు, మాస్క్‌లు ధరించాలి. చలి గాలిలో తిరగవద్దు. ఎంపిక చేసిన ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి మంచిది. ఆకు కూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అవసరానికి తగినట్లు తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని అందజేస్తాయి. – డాక్టర్ ప్రేమ్‌సింగ్, మండల వైద్యాధికారి -
సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్
సాక్షి, భువనగిరి(నల్గొండ) : సినీ హీరో కావాలనే లక్ష్యంతో ఓ యువకుడు విభిన్న పాత్రలు పోషిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని లఘుచిత్రాల్లో సైడ్హీరోగా నటించి అనంతరం హీరోగా నటించాడు. ప్రస్తుతం టీవీ సీరియల్లో విభిన్నపాత్రలు పోషిస్తున్నాడు. భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన సుర్పంగ రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే సంకల్పంతో ఆదిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఎప్పటికైనా సినిమాలో హీరోగా నటించాలనే కోరిక అతడిలో కలిగింది. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. ఈక్రమంలోనే యాదగిరిగుట్టకు చెందిన లఘుచిత్ర దర్శకుడు రాజు గణేష్‌లో ఉన్న నటన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్రాంతి లేకుండా లఘుచిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం టీవీ సీరియల్లో సైతం నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో.. గణేష్ ప్రారంభంలో రియల్ లవ్ నెవర్ డై, ల్యాజిక్ ఆఫ్ లైవ్ డిషిసన్, రెండు లఘు చిత్రాల్లో నటించాడు. ఈచిత్రా లు 2013లో విడుదలయ్యాయి. వీటితోపాటు బర్త్‌డే బాయ్ చిత్రం కూడా నటించాడు. ఆ తర్వాత వదిలేసి వెళ్తున్నా, సైలెంట్ లవ్ స్టోరీ, కాలేజీ పొరగాళ్లు, శాంతాభాయ్, నాకు నీనే తోపు తురుము, తను క్లాస్మెంట్ వంటి చిన్న సినిమాల్లో విభిన్న పాత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఇందిరానో కంప్రమైజ్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితోపాటు బంగారు పంజారం, మనస్సు మమత వంటి టీవీ సీరియల్లలో నటించాడు. సినీ హీరో కావాలన్నదే నా కోరిక అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. లఘుచిత్రంతో ప్రారంభమైన నా చిన్న సినిమాల వరకు తీసుకువచ్చాను. ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే తప్పనిసరిగా నటిస్తా. జీవితంలో హీరోగా ఒక సినిమాలో నటించాలని నా కోరిక. – గణేష్, నటుడు -
ప్రమాదాలకు నిలయంగా సాగర్ ఎడమకాల్వ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల గుండా పారుతూ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎక్కడికక్కడ రెయిలింగ్‌లు విరిగిపోవడం, రక్షణ గోడలు లేక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అదే విధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొందరి అవగాహనా రాహిత్యంతో కాలువలోకి దిగుతూ నీటి ఉధృతికి గల్లంతవుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో పదిమంది జలసమాధి కావడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు చోట్ల ప్రమాదకరంగా ఉంది. కాలువపై బ్రిడ్జిలు ఉన్నచోట రెయిలింగ్, రక్షణ గోడలు లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ రద్దీగా ఉండే అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై వేములపల్లి మండల కేంద్రం సమీపంలో కాలువ ప్రమాదకరంగా ఉంది. అదే విధంగా భీమారం– సూర్యాపేట రహదారిపై శెట్టిపాలెం సమీపంలో ఉన్న బ్రిడ్జి మరింత ప్రమాదకరంగా ఉంది. ఎదురుగా ఒక వాహనం వస్తుంటే మరో వాహనం పక్కకు నిలుపుకోవల్సిన పరిస్థితి ఉంది. నిత్యం రద్దీగా ఉండే భీమారం – సూర్యాపేట రోడ్డుపై ఉన్న వంతెన వెడల్పు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా కాలువ కట్టపైనుంచి వెళ్లేవారు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారు కాలువకట్టపై వెళ్లక తప్పడం లేదు. ఎడమ కాలువకు యూటీలు ఉన్న చోట రెయిలింగ్‌లు విరిగిపోవడం వల్ల పశువులు, వాహనాలు పడుతున్నాయి. వేములపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న అన్నపురెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన, తిమ్మారెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన యూటీ వల్ల కాలువ నిర్మాణ సమయంలో రెయిలింగ్ ఉండగా అవి ప్రస్తుతం విరిగిపోయాయి. కానీ కొత్తగా రెయిలింగ్‌లు కూడా నిర్మించడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు కోదాడ: నియోజకవర్గ పరిధిలో సాగర్ కాలువ వద్ద మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, అవగాహనలోపం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలోని చిలుకూరు, మునగాల, నడిగూడెం మండలాల పరిధిలో ఉన్న సాగర్ కాలువపై రెండు చోట్ల అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొన్ని నెలల్లో మునగాల హెడ్‌రెగ్యులేటరీ వద్ద 15 మంది ప్రాణాలు కోల్పోగా నడిగూడెం మం డలం చాకిరాల వద్ద ఈ నెల 18న ఆరుగురు యువకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా కరువు... 65వ నంబర్ జాతీయరహదారిపై మునగాల సమీపంలో సాగర్ ఎడమకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రహదారిపై వెళ్లేవారు ఈత కోసం సరదాగా కాలువలోకి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పాలేరు వైపు వెళ్లే కాలువలో సుడిగుండాలు ఉంటాయి. దీనివల్ల ఈత వచ్చినçప్పటికీ కొత్త వారు ఇక్కడ నీటిలోకి దిగితే ప్రమాదం తప్పదు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఇక్కడ ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం కార్తీకమాసంలో కారు కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు మృతిచెందారు. కార్తీకమాసం, అయ్యప్పల దీక్షా సమయంలో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్ఎస్పీ అధికారులు, పోలీసులు, పంచాయితీ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలులేవు. చాకిరాల వద్ద అతి ప్రమాదకరం... నడిగూడెం మండలం చాకిరాల వద్ద ఉన్న సాగర్‌కాలువ అతిప్రమాదకరంగా ఉంది. ఇక్కడకు కొత్తవారు వస్తే ప్రమాదానికి గురవడం ఖా యం. మండలం మధ్య నుంచి ఈ కాలువ వెళుతోంది. మండల పరిధిలోని ఆరుగ్రామాల వారు ప్రతి రోజు ఈ కాలువ దాటి ప్రయాణిం చాలి. కొత్తవారు మాత్రం ఏమాత్రం అదమరిచి నా ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ రక్షణగొడ కట్టాలని స్థానికులు కోరుతున్నారు. రక్షణ గోడలు, ప్రమాద సూచిక బోర్డులేవీ..? చింతలపాలెం (హుజూర్నగర్) : సాగర్ ఎడమ కాల్వ గరిడేపల్లి మండలంలోని మర్రికుంట నుంచి వెలిదండ వరకు ప్రవహిస్తోంది. అయితే ఈ కాల్వపై ప్రయాణించే వారికి అవగాహన లేకపోవడం, ప్రమాద సూచికలు లేక నీటిలో గలంతై ప్రాణాలు కొల్పోతున్నారు. పొనుగోడు సమీపంలో మెయిన్ కెనాల్‌కు రిజర్వాయర్ ఉండడంతో చాలా మంది ఈ కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడి కొందరు, ఈత కొడుతూ మరికొందరు ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ధరావత్ వీరన్న, పద్మల కుమార్తె శిరీష (8) కాల్వవద్ద స్నేహితులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెందింది. రక్షణ చర్యలు శూన్యం.. హాలియా (నాగార్జునసాగర్) : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, 14వ మైలురాయి, నిడమనూరు మండలంలోని వేంపాడు, ముప్పారం ప్రాం తాల వద్ద ఉన్న సాగర్ ఎడమ కాల్వ ప్ర మాదాలకు నిలయంగా మారింది. హాలి యా పట్టణానికి సమీపంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. దీంతో స్నానం చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు, చేపలు పట్టేందుకు వెళ్తున్న వారు ప్రమాదవశాత్తు కాలు జారీ కాల్వలో కొట్టుకుపోతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలోనే ఆంజనేయస్వామి, పోతులూరి వీరబ్రహేంద్రస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు వచ్చే భక్తులతో పాటు వివిధ మాలధారణలు వేసుకున్న స్వాములు కూడా ఎడమ కాల్వలో స్నానాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాలు జారీ గల్లంతవుతున్నారు. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాల్వ వెంట రక్షణ గోడలు నిర్మించాలి. కాల్వ వెంట నిత్యం ఎన్ఎస్పీ, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నెల వ్యవధిలో చోటు చేసుకున్న ప్రమాదాలు ⇔ అక్టోబర్ 6న హాలియా పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న పెద్దవూర మండలం శిరసనగండ్ల గ్రామానికి దోరేపల్లి వినయ్‌కుమార్(25) ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. శుభ్రం చేసుకునేందుకు కాల్వలోకి దిగే క్రమంలో కాలు జారి మృత్యువాతపడ్డాడు. ⇔ అక్టోబర్ 12న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి కుమార వెంకటసాయి వర్మ(21) నిడమనూరు మండలంలోని వేపాండు వద్ద ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాల్వలోకి దిగే క్రమంలో కాలుజారి గల్లంతై మృతిచెందాడు. ⇔ అక్టోబర్ 20న హాలియా పట్టణానికి చెందిన కామిశెట్టి రాంబాబు(30) నీరు పెట్టేందుకు తండ్రి వెంకటేశ్వర్లు కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రాంబాబు బహిర్భూమి కోసం ఎడమ కాల్వ వద్ద వెళ్లి అందులోకి దిగే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయాడు. ⇔ 29న వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సకినాల అంజయ్య (24) సమీపంలోని కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాలు జారీ ఎడమ కాలువలో పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేక గల్లంతయ్యాడు. ⇔ హైదరాబాద్‌కు చెందిన జమ్మికుంట్ల నాగేశ్వరరావు (36), వంగపల్లి పవన్ కుమార్ (23), బోనికట్ల సంతోష్ (24), అబ్దుల్ అజీద్ (34), జాన్సన్ జార్జి, తిప్పని రాజేష్ (29) ఈ నెల 18న స్కార్పియో వాహనంలో నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:45 గంటలకు ఆ వాహనం అదుపుతప్పి 125 కిలోమీటరు వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతిచెందారు. రెయిలింగ్ ఏర్పాటు చేయాలి సాగర్ ఎడమకాల్వపై యూటీలు ఉన్న చోట బ్రిడ్జిల వద్ద రెయిలింగ్‌లను విరిగి పోవడంతో ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. సమీప గ్రామాల రైతులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై కాలువ కట్టపై నిత్యం ప్రయాణించాల్సి ఉంటుంది. బ్రిడ్జి సమీపానికి రాగానే రక్షణ గోడ లేకపోవడంతో ఎడమకాల్వలో దూ సుకెళ్తామని భయాందోళన కు గురి కావాల్సి వస్తోంది. ఒక్కోసారి కాల్వలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. – ప్రసాద్‌రెడ్డి, తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి రక్షణ గోడలు నిర్మించాలి హాలియా సమీపంలో ఉన్న ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతవుతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలో పలు ఆలయాలు ఉండడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎడమ కాల్వలో స్నానాలు చేసేందుకు కొందరు, దుస్తులు ఉతికేందుకు వెళ్లే వారు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎడమ కాల్వ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు కాల్వకు ఇరువైపులా రక్షణ గోడల ఏర్పాటు చేయాలి. –ఆకారపు నరేష్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, హాలియా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి సాగర్ ప్రధాన ఎడ మ కాల్వ వెంట ప్రమాద సూచికలు లేవు. దీంతో చాలామంది కాల్వలో పడిన మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మర్రికుంట వద్ద చిన్నారి శిరీష అవగాహన లేక కాలు జారీ కొట్టుకుని పోయి చనిపోయింది. ఈతకు వచ్చిన వారు కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక ప్రాణాలు పొగొట్టుకున్నారు. కాల్వ వెంట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. –రామినేని అశోక్, మర్రికుంట -
నాగార్జున సాగర్ గేట్లు మూసివేత
సాక్షి, నల్గొండ: వరద నీరు తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. డ్యామ్‌లో ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 48,990 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా కొనసాగుతోంది. సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లు ఎత్తివేత.. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో,ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 కాగా, ప్రస్తుతం 7.24 టీఎంసీలుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 10,296 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 కాగా, ప్రస్తుతం 18.563 టీఎంసీలుగా ఉంది. శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ప్లో 84,738 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 634 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగులుగా కొనసాగుతోంది. -
ప్రధాని మోదీ చరిష్మాపై ఆశలు!
సాక్షి, నల్లగొండ : ఇప్పటికి రెండుసార్లు ఊరించి ఉసూరుమనిపించిన విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ 1996, 2004 ఎన్నికల్లో రెండో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. కానీ, ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా విజయ తీరాలకు చేరాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తమను గట్టెక్కిస్తుందన్న భావనలో కమలనాథులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అవే అంశాలను ప్రచారస్త్రాలుగా వాడుకుంటోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన గార్లపాటి జితేంద్రకుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలిసే పనిలో ఉన్నారు. అభ్యర్థి గెలుపు కోసం ముఖ్య నాయకులను నియోజకవర్గంలో ప్రచారానికి తీసుకురానున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఇప్పటికే ఖరారు అయ్యింది. ఏప్రిల్ ఆరో తేదీన ఉగాది రోజే అమిత్ షా నల్లగొండలో రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ నాయకత్వం చెబుతోంది. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నల్లగొండ పర్యటనకు రాగా, జాతీయ అధ్యక్షుడి పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. రెండు సార్లు తప్పిపోయిన విజయం జిల్లాలో తమకు పట్టుందని, దేశం మొత్తం నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావాలనుకుంటోందని, ఈ కారణంగానే ఈసారి బీజేపీకి అవకాశం ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇదివరకు రెండు పర్యాయాలు నల్లగొండ ఎంపీ స్థానంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ రెండు పర్యాయాలూ సీపీఐ చేతిలోనే ఓటమి పాలైంది. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్.ఇంద్రసేనారెడ్డి బరిలోకి దిగగా, సీపీఐ నుంచి బొమ్మగాని ధర్మబిక్షం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 71,761 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే మాదిరిగా 2004 ఎన్నికల్లో సైతం బీజేపీ నుంచి ఎన్.ఇంద్రసేనారెడ్డి రెండోసారి పోటీ పడగా, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కూడా సీపీఐ విజయం సాధించగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 56,151 ఓట్ల తేడాతో అవకాశం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తమకున్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఎన్నికల్లో అంచనాలు వేస్తోంది. దేశభద్రత, సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ప్రధానిగా మోదీ పనితీరు, పుల్వామా సంఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వంటిì అంశాలను తమకు అనుకూలంగా భావిస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకు పోలిక ఉండదని, అక్కడ ఎవరు ప్రధాని అవుతారు..? ఎవరి చేతిలో దేశ భద్రత భద్రంగా ఉంటుందన్న అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలు, వాటి పరిష్కారం బీజేపీ ఎంపీలతోనే ఎలా సాధ్యమో ప్రచారం చేస్తోంది. మొత్తంగా అమిత్ షా పర్యటనతోపాటు, యువతలో మోదీకి ఉన్న చరిష్మా వంటి అంశాలతో తమ అభ్యర్థి గట్టెక్కుతారన్న విశ్వాసాన్ని బీజేపీ నాయకత్వం వ్యక్తపరుస్తోంది. -
అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్
నల్లగొండ రూరల్ : కాంగ్రెస్ పార్టీ మిగులు తెలంగాణగా ఇస్తే కేసీఆర్ నాలుగేళ్లలో రెండు లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మహాకూటమి నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌కు ఆహంకారం పెరిగిందని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని చెప్పారు. తాను చెప్పిన వారికే రాహుల్ గాంధీ టికెట్లు ఇచ్చారని తెలిపారు. తాను ఇతర జిల్లాలో ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందని, ఐక్యంగా ఉండి ఐదోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. టీడీపీ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్ పార్టీ వేరైనప్పటికి మంచినాయకుడని ప్రశంసించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బాగుపడిందన్నారు. 50వేల మెజార్టీతో కోమటి రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ సమావేశంలో జనసమితి నాయకులు పి.గోపాల్ రెడ్డి, పందుల సైదులు గౌడ్, సుంకరి వెంకన్నగౌడ్, పట్టణ అధ్యక్షుడు ఆకునూరి సత్యనారాయణ, రియాజ్, ఎల్వీ యాదవ్, మిర్యాల యాదగిరి, మధుసూదన్ రెడ్డి, రవి, రఫి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, సైదులు, సుభాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభ
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభను త్వరలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఏడు శాసనసభ స్థానాలు కేటాయించేలా ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీలందరినీ ఐక్యం చేసి పార్లమెంట్లో, శాసన సభలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేద్దామన్నారు. అనంతరం బీసీ సంఘం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న బీసీ యువజన సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేశ్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, అశోక్ పాల్గొన్నారు. -
కాన్పుకెళితే.. కోతే..!
► సుఖప్రసవానికి అవకాశం ఉన్నా.. ఆపరేషన్లు ► ప్రైవేట్ హాస్పిటళ్లలో పెరుగుతున్న డెలివరీలు ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుముఖం ► అరకొర వసతులు, సర్కారు వైద్యుల నిర్లక్ష్యమే కారణం నల్లగొండ టౌన్ : కాన్పుల్లో 69 శాతం సిజేరియన్ ఆపరేషన్లు చేస్తూ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. సుఖ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా.. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసి కాన్పులు చేయడం పరిపాటిగా మారింది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి గర్భిణిæ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించేలా చూడాలి.. తల్లీబిడ్డకు అవసరమైన వైద్య పరీక్షలు, సేవలను ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని , వ్యాధి నిరోధక టీకాలను అందించడం ద్వారా మాతాశిశు మరణాల సంఖ్యను పూర్తిగా తగ్గించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. గర్భిణుల కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలన్నది లక్ష్యం. కానీ.. ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తుంది. అదే స్థాయిలో రోజురోజుకూ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతులతోపాటు వైద్యులు, సిబ్బంది ప్రదర్శించే అలసత్యం కారణంగా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. కాన్పులు కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పోతే వైద్యులు సరిగ్గా పట్టించుకోరనే భావన వారిలో నెలకొనడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఎక్కువ శాతం మహిళలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం చేరుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రసవాల కోసం వచ్చే వారి నుంచి వేలాది రూపాయలను వసూళ్లు చేస్తున్నారు. బీద, బిక్కి అనే తేడా లేకుండా వివిధ రకాల పరీక్షలు, స్కానింగ్‌ల పేరుతోపాటు సుఖప్రసవం జరిగే అవకాశం ఉన్పప్పటికీ.. డబ్బులకు కక్కుర్తి పడి ఆపరేషన్లకు పూనుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోదాడ , మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ, భువనగిరి, హుజూర్నగర్ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల దందా జోరుగా సాగుతోంది. ఆపరేషన్‌తో పాటు ఇతర పరీక్షలు, రూము అద్దె ఇతర ఖర్చుల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 20 వేల నుంచి రూ.30 వేల వరకు వారివారి స్థాయిని బట్టి దండుకుంటున్నాయి. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తే చర్యలు.. సిజేరియన్ ఆపరేషన్లు అవసరం లేకున్నా చేస్తే ఆ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నా యి. ఆ మేరకు మాత్రమే.. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి. ఐఎంఏ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో ఇదివరకే సమావేశం నిర్వహించి.. వివరించాం. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు ఆశాకార్యకర్తలు, ఏఎన్ఎంలతో అవగాహన కల్పిస్తున్నాం. సిజేరియన్లలో జిల్లా నాలుగో స్థానం ఉండడం ఆందోళన కలిగించే అం«శం. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటాం– డాక్టర్ భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్ఓ, నల్లగొండ -
డీఎస్పీల బదిలీ
నల్లగొండ క్రైం : పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాలకు కొత్త డీఎస్పీ పోస్టింగ్‌లను కేటాయించారు. భువనగిరికి ట్రాఫిక్ ఏసీపీని నియమించారు. దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్‌ను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు.