సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టం పెరిగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1455.77 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు తాజాగా అంచనాలు రూపొం దించారు. ఈ నెల 27వ తేదీ నాటికి 1075.72 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో వాటిల్లిన నష్టం గురించి మంత్రుల బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఆయా శాఖల వారీగా అధికారులు నష్టంపై పున:సమీక్షిం చారు.
మొన్నటివరకు ఇళ్లకు జరిగిన నష్టాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో ఇంటికి సరాసరిగా 50వేల రూపాయల చొప్పున అంచనాలు వేశారు. అధికారులు తెలిపిన ప్రకారం 12వేల ఇళ్లకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్క గృహనిర్మాణ శాఖ పరిధిలోనే 60 కోట్ల రూపాయల నష్టం లెక్కల్లోకి వచ్చింది. దీంతోపాటు మిగిలిన శాఖల వారీగా మరింత నిశితంగా లెక్కలు గట్టారు. ఈ నేపథ్యలో నష్టం అంచనా పెరిగిందని అధికారులు వివరించారు.
పెరిగిన నష్టం
Published Tue, Oct 29 2013 7:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement