estimate
-
స్థిరమైన డిమాండ్ ఉండే పరిశ్రమ
ముంబై: లగేజీ ఉత్పత్తుల పరిశ్రమలో (సంఘటిత రంగం) డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థిరంగా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పర్యాటకం, కార్పొరేట్ ప్రయాణాలకు డిమాండ్ కొనసాగుతుండడం ఇందుకు సానుకూలంగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంఘటిత లగేజీ పరిశ్రమ ఆదాయం 8–10 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. 2021–22 నుంచి 2023–24 మధ్య పరిశ్రమ పరిమాణం రెట్టింపు కావడం, అధిక బేస్ ఇందుకు కారణాలుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ‘‘తయారీ దారుల మధ్య పోటీ పెరిగింది. కొత్త సంస్థలు ప్రవేశించాయి. నిల్వలు మోస్తరుగా పెరగడం వంటి అంశాలతో కంపెనీలు విక్రయ ధరలను పోటాపోటీగా మార్చేశాయి. దీంతో నికరంగా విక్రయ ధరలు, ముఖ్యంగా ఎకానమీ (బడ్జెట్) విభాగంలో తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. 2023–24లో నిర్వహణ మార్జిన్లు 1.5 శాతం మేర తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 0.50 శాతం వరకు క్షీణించి 13.5–14 శాతం వద్ద స్థిరపడొచ్చని అంచనా వేసింది. దేశ లగేజీ పరిశ్రమలో కేవలం కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొసాగుతున్నట్టు వివరించింది. ఇవి గత కొన్ని సంవత్సరాల్లో స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు తెలిపింది. మరోవైపు అసంఘటిత లగేజీ పరిశ్రమ ప్రధానంగా చైనా నుంచి దిగుమతులపైనే ఆధారపడినట్టు వివరించింది. స్థానిక తయారీ.. హార్డ్ లగేజీ ఉత్పత్తుల తయారీని స్థానికంగానే చేపడుతుండడం గత ఐదేళ్లలో వీటి దిగుమతులు తగ్గుతూ వస్తున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘హార్డ్ లగేజీకి ప్రాధాన్యం పెరుగుతుండడం, , పోటీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత అన్నవి సంఘటిత రంగంలోని కంపెనీలకు అనుకూలం. ఫలితంగా దేశ లగేజీ పరిశ్రమలో సంఘటిత రంగ కంపెనీల వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 45 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో రిస్‌్కలు సైతం పెరుగుతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు డబుల్ డిజిట్ వృద్ధిని పరిశ్రమ చూసింది. అది ఇప్పుడు క్షీణిస్తోంది. కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ పెరిగింది. ఇది ప్రచారంపై వ్యయాలను పెంచింది. దీంతో మార్జిన్లు మోస్తరు స్థాయికి చేరుకున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ వివరించారు. డిమాండ్ మోస్తరు స్థాయికి దిగి రావడంతో 2024లో లగేజీ నిల్వలు 114రోజులకు (విక్రయాలకు సరిపడా) చేరాయని, ఆర్థిక సంవత్సరం చివరికి 100–105 రోజులకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. కంపెనీల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, పూర్తి సామర్థ్య వినియోగం నేపథ్యంలో సంఘటిత రంగ సంస్థలు హార్డ్ లగేజీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘సామర్థ్యం 25 శాతం మేర పెరగొచ్చు. ఇందుకు రూ.500–550 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్గత వనరుల నుంచే కంపెనీలు సమకూర్చుకోవచ్చు. రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా వడ్డీ కవరేజీ రేషియో, నెట్‌వర్త్ పరంగా కంపెనీలు సౌకర్యంగానే ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రుషబ్ బోర్కార్ తెలిపారు. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
2024లో తగ్గనున్న వడ్డీ రేట్లు! నిపుణుల అంచనా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నాము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్లో తెలిపారు. ఇదీ చదవండి: ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్.. ఎంతకు చేరాయంటే.. 4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యే యంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లేషించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
‘యాస్’ నష్టం రూ.610 కోట్లు: జల దిగ్బంధంలో 500 గ్రామాలు
భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో గురువారం సమీక్షించారు. అధికారులకు అభినందనలు ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. జల దిగ్బంధంలో 500 గ్రామాలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. పంటలపై తుపాను ప్రభావం యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు. ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు. రహదారులు ఛిన్నాభిన్నం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్‌చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు. -
ఓఎన్జీసీ లాభం 8,267 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీ నికర లాభాన్ని సాధించింది. గత క్యూ3లో రూ.5,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 65 శాతం ఎగసి రూ.8,263 కోట్లకు పెరిగిందని ఓఎన్జీసీ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేర్‌కు నికర లాభం రూ.3.91 నుంచి రూ.6.44కు పెరిగిందని పేర్కొంది. చమురు ఉత్పత్తి తగ్గినా, ధరలు అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.22,996 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.27,694 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,605 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. ∙గత క్యూ3లో బ్యారెల్ చమురును 58.42 డాలర్లకు ఈ కంపెనీ విక్రయించింది. ఈ క్యూ3లో ధర 14% ఎగసి 66.38 డాలర్లకు పెరిగింది. గ్యాస్ ధర 163% వృద్ధితో 3.36 డాలర్లకు ఎగిసింది. ∙క్యూ3లో క్రూడ్ ఉత్పత్తి 5% క్షీణించి 6.03 మిలియన్ టన్నులకు తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి 7% ఎగసి 6.7 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. ∙కచ్ తీరంలో, మధ్య ప్రదేశ్‌లోని వింధ్య బేసిన్లో, అస్సామ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను ఈ కంపెనీ కొనుగొన్నది. ∙ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా మొత్తం 11 చోట్ల చమురు,గ్యాస్ నిక్షేపాలను కనుగొనగా, ఈ క్యూ3లో 4 కొత్త అన్వేషణలను కనుగొన్నది. -
దెబ్బతిన్న పంటల పరిశీలన
చిన్నశంకరంపేట(మెదక్) : మండలంలోని గవ్వలపల్లిలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పరుశరామ్ నాయక్ శనివారం పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఏఈఓ శ్రీనివాస్ ఉన్నారు. -
పిక్కల్లేని ఫ్యాక్టరీ రూ.100 కోట్లకు 30కోట్లే మంజూరు
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పూర్తయ్యెదెపుడు.? అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నేతృత్వంలో దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మితం అవుతున్న అత్యాధునిక పామాయిల్ ఫ్యాక్టరీకి నిధుల కొరత వెంటాడుతోందని ఆ శాఖ నుంచి సమాచారం అందుతోంది. ఫ్యాక్టరీకి చెందిన సమాచారం విశ్వసనీయంగా తెలిసింది. 2013లో అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి అదనంగా మరో ఫ్యాక్టరీ నిర్మించాలని త్రిసభ్య కమిటీ సూచించింది.. దీనికి రూ. 36కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అయితే రెండో ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించాలనే విషయంలో జాప్యం జరిగి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ అంచనా విలువ రూ.74కోట్లకు చేరింది. దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఫ్యాక్టరీకి ఆమోదం లభించింది. కొందరి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పామాయిల్ రైతులు చిక్కుల్లో పడనున్నారని లె లుస్తోంది. మంజూరు కాని నిధులు.. ఉన్న ఫ్యాక్టరీని ఆధునికీకరణ, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్సీడీసీ నుంచి సుమారు రూ.100కోట్ల రుణం తీసుకోవాడానికి ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఎన్సీడీసీ బృందం అశ్వారావుపేట ఫ్యాక్టరీని, అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. దీనికి ఫ్యాక్టరీల ఆస్తులను గ్యారంటీగా చూపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక వేళ అప్పును తిరిగి కట్టకుంటే భవిష్యత్ ఏమిటనే యోచనలో కొందరు రైతులున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పటికే అశ్వారావుపేట ఫ్యాక్టరీ మరామ్మతులకు రూ.18కోట్లు ఖర్చు చేయగా.. మరో 18కోట్లకు ప్రతిపాదనలను పంపించనున్నట్లు సమాచారం. అంతేకాక అప్పారావుపేటలో నిర్మిస్తున్న కొత్త ఫ్యాక్టరీ అంచనాను 104కోట్లకు పెంచినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయిల్‌ఫెడ్‌కు కేవలం రూ.30కోట్ల గ్రాంటు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయిల్‌ఫెడ్‌కు రూ.100 కోట్లు రుణం ఇస్తే.. ఏడాదికి రూ.9కోట్ల వడ్డీ చల్లించాలి. దీంతో సంస్థపై అదనపు భారం పడి అప్పు తీర్చలేని స్థితికి వెళుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు కుంభకోణాలు, మూతపడిన నూనె పరిశ్రమలు, కల్తీ ఆయిల్ ముద్రలతో సంస్థకు అప్పిచ్చేందుకు ఎన్సీడీసీ విముఖత చూపుతున్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అప్పారావుపేట ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకోకుంటే ఆయిల్‌ఫెడ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులకు అన్యాయం జరుగుతుంది. పనులు బట్టే నిధులు మంజూరు అవుతాయి.. – ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణ దశను బట్టి పూర్తయిన పనుల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ప్రతివారం నిర్మాణ ప్రగతి నివేదికలను ఎన్సీడీసీకి అందిస్తున్నాం. పనులు జరిగే క్రమాన్ని బట్టి నిధులు విడుదల అవుతాయి. ఇక ఆయిల్‌ఫెడ్ ఆర్థిక వ్యవహారాలు, లాభనష్టాల గురించి తన పరిధిలో లేని అంశం. -
పెరిగిన నష్టం
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టం పెరిగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 1455.77 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు తాజాగా అంచనాలు రూపొం దించారు. ఈ నెల 27వ తేదీ నాటికి 1075.72 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో వాటిల్లిన నష్టం గురించి మంత్రుల బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఆయా శాఖల వారీగా అధికారులు నష్టంపై పున:సమీక్షిం చారు. మొన్నటివరకు ఇళ్లకు జరిగిన నష్టాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో ఇంటికి సరాసరిగా 50వేల రూపాయల చొప్పున అంచనాలు వేశారు. అధికారులు తెలిపిన ప్రకారం 12వేల ఇళ్లకు పైగా ధ్వంసమయ్యాయి. ఒక్క గృహనిర్మాణ శాఖ పరిధిలోనే 60 కోట్ల రూపాయల నష్టం లెక్కల్లోకి వచ్చింది. దీంతోపాటు మిగిలిన శాఖల వారీగా మరింత నిశితంగా లెక్కలు గట్టారు. ఈ నేపథ్యలో నష్టం అంచనా పెరిగిందని అధికారులు వివరించారు. -
భారీ వర్షం: ప్రాథమిక నష్టం అంచనా.. 770 కోట్ల పైనే
ఒంగోలు, న్యూస్‌లైన్ : భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. ప్రాథమికంగా నష్టం అంచనా రూ.770 కోట్లకుపైమాటేనని అధికారులు తేల్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనం మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. వేలాది నివాస గృహాలు, పదుల సంఖ్యలో కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ముంపు గ్రామాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్, రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిలు శనివారం జిల్లాకు వస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. కూలీలు సురక్షితం గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. యర్రగొండపాలెంలో పశువులమేత కోసం వెళ్లి దాదాపు 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. తీగలేరు, దొంగలవాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపి సమీపంలోని ముసి వాగు అవతల చిక్కుకున్న 300 మంది రాజమండ్రికి చెందిన కూలీలు, మరో 100 మంది కొండపికి చెందిన కూలీలను అధికారులు మరబోట్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. దీని కోసం పాకల సముద్ర తీరం నుంచి బోట్లు తెప్పించారు. జరుగుమల్లి మండలం సాదువారిపాలెం శుక్రవారం రాత్రికి కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. చీరాలలో 5 వేల చేనేత గృహాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 150 ఇళ్లు కూలిపోయాయి, 14 గేదెలు, 15 గొర్రెలు చనిపోయాయి. చీరాల ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్కు గండిపడటంతో సమీపంలోని సవరపాలెం బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. కొత్తపట్నం మార్గంలో ఉప్పువాగు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కందుకూరు ప్రాంతంలో కాలనీల్లో చేరిన నీటిని బయటకు పంపలేదు. ఒంగోలులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచే ఉంది. పర్చూరు ప్రాంతంలో కాలనీల్లో చిక్కుకున్న నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. దేవరపాలెం క్రాస్‌రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో 14 వేల ఎకరాలు నీటమునిగాయి. కాకర్ల డ్యామ్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ఆర్టీసీ అధికారులు శుక్రవారం దాదాపు 30 సర్వీసులను తిప్పలేదు. ప్రధానంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు విపరీతంగా వస్తుండటంతో 9 గేట్లు తెరిచారు. ప్రాథమిక నష్టం అంచనా వివరాలు.. జిల్లాకు మంత్రులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక అంచనాలను తయారు చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు రూ. 770 కోట్లకుగాపైగా జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీకి చెందిన 30.106 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, దానికోసం రూ. 97.15 కోట్లు అవసరమవుతాయని నివేదించనున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో మరమ్మతులకు రూ. 229.21 కోట్లు అవసరమవుతాయని తేల్చారు.