
వరి పంటను పరిశీలిస్తున్న పరుశరామ్‌నాయక్
చిన్నశంకరంపేట(మెదక్) : మండలంలోని గవ్వలపల్లిలో వడగండ్ల వర్షంతో నష్టపోయిన వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పరుశరామ్ నాయక్ శనివారం పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఏఈఓ శ్రీనివాస్ ఉన్నారు.