రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంపు చర్య ఈ సంవత్సరం విరామంతో కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2024 ప్రారంభంలో రేట్లు తగ్గించే అవకాశం ఉందని వారు అంచనావేస్తున్నారు. ‘‘ఆర్‌బీఐ 2023 మిగిలిన సంవత్సరంలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని అలాగే మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో పాలసీ రేట్లను 0.25 శాతం తగ్గింస్తుందని మేము భావిస్తున్నాము‘ అని విదేశీ బ్రోకరేజ్ హెచ్‌ఎస్‌బీసీ ఆర్థికవేత్తలు ఒక నోట్‌లో తెలిపారు.
ఇదీ చదవండి: ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్.. ఎంతకు చేరాయంటే..
4 శాతం ద్రవ్యోల్బణం లక్ష్యం సమీప భవిష్యత్తులో కనుచూపు మేరలో లేదని వారు పేర్కొంటూ, ద్రవ్యోల్బణం 4 శాతానికి తీసుకురావాలన్న ధ్యే యంతో వృద్ధి రేటును త్యాగం చేయాలని ఆర్‌బీఐ భావించబోదన్నది తమ అభిప్రాయమని కూడా వారు విశ్లేషించారు. జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నోమురా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, అక్టోబర్ నుంచి 0.75 శాతం మేర రేటు తగ్గింపు అవకాశాలు లేకపోలేదని అంచనా వేసింది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment