పిక్కల్లేని ఫ్యాక్టరీ రూ.100 కోట్లకు 30కోట్లే మంజూరు | peakalleni Factory estimate rs 100cro, relese rs30 cros | Sakshi
Sakshi News home page

పిక్కల్లేని ఫ్యాక్టరీ రూ.100 కోట్లకు 30కోట్లే మంజూరు

Published Tue, Aug 16 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

నిర్మాణ దశలో ఉన్న అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ

నిర్మాణ దశలో ఉన్న అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ

  • అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ పూర్తయ్యెదెపుడు.?
  • అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ నేతృత్వంలో దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మితం అవుతున్న అత్యాధునిక పామాయిల్‌ ఫ్యాక్టరీకి నిధుల కొరత వెంటాడుతోందని ఆ శాఖ నుంచి సమాచారం అందుతోంది. ఫ్యాక్టరీకి చెందిన సమాచారం విశ్వసనీయంగా తెలిసింది. 2013లో అశ్వారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీకి అదనంగా మరో ఫ్యాక్టరీ నిర్మించాలని త్రిసభ్య కమిటీ సూచించింది.. దీనికి రూ. 36కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అయితే రెండో ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించాలనే విషయంలో జాప్యం జరిగి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ అంచనా విలువ రూ.74కోట్లకు చేరింది. దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఫ్యాక్టరీకి ఆమోదం లభించింది. కొందరి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పామాయిల్‌ రైతులు చిక్కుల్లో పడనున్నారని లె లుస్తోంది.
    మంజూరు కాని నిధులు..
    ఉన్న ఫ్యాక్టరీని ఆధునికీకరణ, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్‌సీడీసీ నుంచి సుమారు రూ.100కోట్ల రుణం తీసుకోవాడానికి ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. ఎన్‌సీడీసీ బృందం అశ్వారావుపేట ఫ్యాక్టరీని, అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. దీనికి ఫ్యాక్టరీల ఆస్తులను గ్యారంటీగా చూపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక వేళ అప్పును తిరిగి కట్టకుంటే భవిష్యత్‌ ఏమిటనే యోచనలో కొందరు రైతులున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పటికే అశ్వారావుపేట ఫ్యాక్టరీ మరామ్మతులకు రూ.18కోట్లు ఖర్చు చేయగా.. మరో 18కోట్లకు ప్రతిపాదనలను పంపించనున్నట్లు సమాచారం. అంతేకాక అప్పారావుపేటలో నిర్మిస్తున్న కొత్త ఫ్యాక్టరీ అంచనాను 104కోట్లకు పెంచినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయిల్‌ఫెడ్‌కు కేవలం రూ.30కోట్ల గ్రాంటు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయిల్‌ఫెడ్‌కు రూ.100 కోట్లు రుణం ఇస్తే.. ఏడాదికి రూ.9కోట్ల వడ్డీ చల్లించాలి. దీంతో సంస్థపై అదనపు భారం పడి అప్పు తీర్చలేని స్థితికి వెళుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు కుంభకోణాలు, మూతపడిన నూనె పరిశ్రమలు, కల్తీ ఆయిల్‌ ముద్రలతో సంస్థకు అప్పిచ్చేందుకు ఎన్‌సీడీసీ విముఖత చూపుతున్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అప్పారావుపేట ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకోకుంటే ఆయిల్‌ఫెడ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులకు అన్యాయం జరుగుతుంది.

    • పనులు బట్టే నిధులు మంజూరు అవుతాయి..
    • – ఆయిల్‌ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి

    ఫ్యాక్టరీ నిర్మాణ దశను బట్టి పూర్తయిన పనుల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ప్రతివారం నిర్మాణ ప్రగతి నివేదికలను ఎన్‌సీడీసీకి అందిస్తున్నాం. పనులు జరిగే క్రమాన్ని బట్టి నిధులు విడుదల అవుతాయి. ఇక ఆయిల్‌ఫెడ్‌ ఆర్థిక వ్యవహారాలు, లాభనష్టాల గురించి తన పరిధిలో లేని అంశం.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement