న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఓఎన్‌జీసీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీ నికర లాభాన్ని సాధించింది. గత క్యూ3లో రూ.5,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 65 శాతం ఎగసి రూ.8,263 కోట్లకు పెరిగిందని ఓఎన్‌జీసీ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేర్‌కు నికర లాభం రూ.3.91 నుంచి రూ.6.44కు పెరిగిందని పేర్కొంది. చమురు ఉత్పత్తి తగ్గినా, ధరలు అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.22,996 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.27,694 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,605 కోట్లుగా ఉంటాయని పేర్కొంది.
∙గత క్యూ3లో బ్యారెల్ చమురును 58.42 డాలర్లకు ఈ కంపెనీ విక్రయించింది. ఈ క్యూ3లో ధర 14% ఎగసి 66.38 డాలర్లకు పెరిగింది. గ్యాస్ ధర 163% వృద్ధితో 3.36 డాలర్లకు ఎగిసింది.
∙క్యూ3లో క్రూడ్ ఉత్పత్తి 5% క్షీణించి 6.03 మిలియన్ టన్నులకు తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి 7% ఎగసి 6.7 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది.
∙కచ్ తీరంలో, మధ్య ప్రదేశ్‌లోని వింధ్య బేసిన్‌లో, అస్సామ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను ఈ కంపెనీ కొనుగొన్నది.
∙ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా మొత్తం 11 చోట్ల చమురు,గ్యాస్ నిక్షేపాలను కనుగొనగా, ఈ క్యూ3లో 4 కొత్త అన్వేషణలను కనుగొన్నది.
ఓఎన్‌జీసీ లాభం 8,267 కోట్లు
Published Fri, Feb 15 2019 12:58 AM | Last Updated on Fri, Feb 15 2019 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment