Profit Results
-
భారీగా తగ్గిన జీవీకే పవర్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది. -
ఆటో, బ్యాంకు షేర్లు పడేశాయ్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి. ‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు. ► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది. ► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్డీఎఫ్సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది. -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్‌ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్‌ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
స్వల్ప లాభాలతో సరి
స్టాక్ మార్కెట్ బుధవారం ఆరంభ లాభాలన్నింటినీ కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కింది. కరోనా వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా ఆరంభంలో భారీగా లాభపడింది. మధ్యాహ్నం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇంట్రాడేలో 777 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ చివరకు 19 పాయింట్ల లాభంతో 36,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 10,618 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి 75.15కు చేరడం ఒకింత సానుకూల ప్రభావం చూపినా, కరోనా కేసులు పెరుగుతుండటం.. ప్రతికూల ప్రభావం చూపింది. ► ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,978ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 4 శాతం నష్టంతో రూ.1,846 వద్ద ముగిసింది. ఈ కంపెనీ 43వ ఏజీఎమ్ ఆరంభం వరకూ లాభపడిన ఈషేర్‌లో ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఏజీఎమ్ నిర్ణయాలు ఉండటమే దీనికి కారణం. సెన్సెక్స్ లాభాలను కోల్పోవడానికి ఈ షేరే కారణం. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో విప్రో షేర్ 17 శాతం ఎగసి రూ.263 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాలు ఐటీ షేర్లు కూడా లాభపడ్డాయి. మూడు ఐటీ షేర్లు–ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. -
వైరస్ పడగ.. మార్కెట్ ర్యాలీ!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా బుధవారం భారీగా లాభపడింది. మన దగ్గర కూడా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదని, ఆర్బీఐ 60 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇంట్రాడేలో 2,116 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 517 పాయింట్లు పెరిగి 8,318 పాయింట్ల వద్దకు చేరాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.98 శాతం, నిఫ్టీ 6.62 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇది గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కాగా గుడిపడ్వ పర్వదినం కారణంగా ఫారెక్స్ మార్కెట్ బుధవారం పనిచేయలేదు. నష్టాల్లోంచి... భారీ లాభాల్లోకి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్ నష్టాల్లోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 174 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 11 తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీలు ట్రేడింగ్ చివరి వరకూ లాభాల జోరును కొనసాగించాయి. ఒక దశలో 314 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 2,116 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,430 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 562కు, మరణాలు 10కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కేసులు 4.34 లక్షలకు, మరణాలు 19,600కు, రికవరీలు లక్షకు చేరాయి. మరిన్ని విశేషాలు..... ► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్ మార్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ, 800కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అల్ట్రాటెక్ ఇండియా, జిల్లెట్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఐఆర్సీటీసీ షేర్ వరుసగా ఎనిమిదో రోజూ 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ.816కు పడిపోయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఒక్క నెలలోనే ఈ షేర్ 58 శాతం పతనమైంది. లాభాలు ఎందుకంటే... ► అమెరికా భారీ ప్యాకేజీ... కోవిడ్–19 వైరస్‌తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ఇవ్వనున్నది. ఈ 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క అమెరికన్ ఖాతాలో 1,200 డాలర్లు జమ చేస్తారని అంచనా. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 2–8% రేంజ్లో లాభపడగా, యూరప్ మార్కెట్లు భారీ లాభాల తో మొదలై, 1–4% రేంజ్ లాభాల్లో ముగిశాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు.... మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్నాయి. ఈ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో జోరుగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. ► లాక్‌డౌన్‌ను మెచ్చిన మార్కెట్ మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా భారత జీడీపీలో రూ. 5 లక్షల కోట్ల మేర గండి పడుతుందని అంచనా. ఇంత భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ కోవిడ్–19 వైరస్‌ను ఎదుర్కొనడానికి భారత్ గట్టి చర్యలు తీసుకుంటోందన్న భరోసా స్టాక్ మార్కెట్‌కు లభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఉద్దీపన చర్యలపై ఆశలు... దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కుదేలయ్యే ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే (సుమారు 1.5 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు నెలకొన్నాయి. ► రేట్ల కోత అంచనాలు: ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమావేశంలో కీలక రేట్లను ఆర్బీఐ 50–100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలదన్న ఆశలతో వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ► హెవీ వెయిట్స్ ర్యాలీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 9–15 శాతం రేంజ్లో దూసుకెళ్లాయి.సెన్సెక్స్ లాభాల్లో ఈ మూడు షేర్ల వాటాయే దాదాపు సగంగా ఉంది. సెన్సెక్స్ మొత్తం 1,862 పాయింట్ల లాభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 416 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 363 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ వాటా 232 పాయింట్లుగా ఉన్నాయి. రిలయన్స్‌కు ‘ఫేస్బుక్’ కిక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం, రిలయన్స్ జియోలో 10% వాటాను ఫేస్బుక్ కొను గోలు చేయనుందన్న వార్తలతో రిలయన్స్ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 22% లాభంతో రూ. 1,152ను తాకిన ఈ షేర్ చివరకు 15 శాతం లాభంతో రూ.1,081 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. 11 ఏళ్లలో ఈ షేర్ ఇంత గా లాభపడటం ఇదే తొలిసారి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 87,577 కోట్లు పెరిగి రూ.6,85,433 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువగల కంపెనీ ట్యాగ్ ను మళ్లీ టీసీఎస్ నుంచి చేజిక్కించుకుంది. రూ. 4.7 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.7 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.7 లక్షల కోట్లు పెరిగి రూ.108.41 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్ పతన జోరు ఒకింత తగ్గవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో పరిమిత శ్రేణిలోనే సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ తరువాతి దశ (పెరగడం లేదా తగ్గడం)లోకి ప్రవేశించే ముందు ఇదే రేంజ్లో కొంత కాలం కొనసాగవచ్చు. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లకు, యావరేజ్ చేయాలనుకునేవాళ్లకు ఇది మంచి అవకాశమే. –సహజ్ అగర్వాల్, కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్స్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, ఉద్దీపన చర్యల ఆశలతో మార్కెట్ లాభపడింది. కోవిడ్–19 వైరస్ కట్టడికి సంబంధించిన శుభవార్తలు వస్తేనే స్టాక్ మార్కెట్లో నిలకడైన ర్యాలీ నెలకొంటుంది. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు కొనసాగుతాయి. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని ప్రభావవంతంగా అరికట్టగలిగే విష యంపైననే స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉంటుంది. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ -
మార్కెట్‌కు ప్యాకేజీ జోష్..
మందగమనంలో ఉన్న వృద్ధికి జోష్‌నివ్వడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య తాజాగా చర్చలు ప్రారంభం కానున్నాయన్న వార్తలు మధ్యాహ్నం తర్వాత వెలువడ్డాయి. దీంతో కొనుగోళ్లు మరింత జోరుగా సాగాయి. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్లపైకి ఎగబాకాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 11,058 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పెరగడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు 3 శాతం మేర పతనమైనా, మన స్టాక్ సూచీలు 2 శాతం మేర లాభపడటం విశేషం. భారీ లాభాలతో బోణి... మందగమనం నుంచి మరింత వృద్ధి దిశకు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ చర్యలే కాకుండా సరైన సమయంలో మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆమె అభయం ఇచ్చారు. ఇక అమెరికా–చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్న నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా, ప్యాకేజీ జోష్‌తో మన మార్కెట్ మాత్రం భారీ లాభాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వెంటనే సెన్సెక్స్ 843 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్ల లాభాలను తాకాయి. కానీ ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా ఈ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 208 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయన్న వార్తలతో స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్1,051 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోగా, యూరప్ మార్కె ట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.... ► యస్ బ్యాంక్ షేర్ 6.3 శాతం పెరిగి రూ.63 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. బాటా ఇండియా, ఫోర్స్ మోటార్స్, జీఎస్కే కన్సూమర్ ఈ జాబితాలో ఉన్నాయి. మరో వైపు అలోక్ ఇండస్ట్రీస్, అబన్ ఆఫ్‌షోర్, డీబీ రియల్టీ, సీజీ పవర్, ఈక్లర్క్స్ సర్వీసెస్, ఖదిమ్ ఇండియా వంటి 180కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్, హెచ్ఎఫ్సీ షేర్ల జోరు మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదుకోవడానికి తాజాగా రూ.70,000 కోట్ల మూలధన నిధులందించగలమని కేంద్రం ఆభయం ఇవ్వడంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. ఈ నిధుల కారణంగా రూ.5 లక్షల కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఫలితంగా మరిన్ని రుణాలు అందుబాటులోకి వచ్చి, వ్యవస్థలో లిక్విడిటీ సమస్య ఒకింత తీరగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, అలహాబాద్ బ్యాంక్ 8 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.6 శాతం, ఎస్బీఐ 3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3..4 శాతం, కెనరా బ్యాంక్ 3.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్ షేర్లతో పాటు హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. హెచ్ఎఫ్సీలకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) రూ.20,000 కోట్ల మేర నిధులు అందజేయనున్నది. ఈ నిర్ణయం కారణంగా హెచ్ఎఫ్సీలు లాభపడ్డాయి. ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5 శాతం, హెచ్డీఎఫ్సీ 4 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్3 శాతం మేర ఎగిశాయి. లాభాలు ఎందుకంటే... ► ఎట్టకేలకు ఉద్దీపన ప్యాకేజీ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధించిన సూపర్ రిచ్ సర్‌చార్జీని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. అంతేకాకుండా వాహన రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలను, బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధుల అందించడం, తదితర నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► మళ్లీ అమెరికా–చైనాల చర్చలు.... అమెరికా–చైనాలు తాజాగా పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం మళ్లీ చర్చలు ఆరంభం కాగలవని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేయడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► చల్లబడ్డ చమురు ధరలు... చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్, నైమెక్స్ ముడి చమురు ధరలు దాదాపు 1 శాతం మేర తగ్గాయి. ► ఆర్బీఐ బోర్డ్ సమావేశం... ఆర్బీఐ మిగులు నిధులపై అధ్యయనం చేసిన బిమల్ జలాన్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించడానికి సోమవారం ఆర్బీఐ బోర్డ్ సమావేశమైంది. మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినప్పటికీ, సానుకూల నిర్ణయం ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌కు కలసివచ్చాయి. ► పెరిగిన రేటింగ్ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, నొముర.. భారత్ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంపవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో భారత్ రేటింగ్‌ను నొముర అప్‌గ్రేడ్ చేసింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 40,500 పాయింట్లకు చేరగలదని మరో బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా వెల్లడించడం కూడా సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్న నేపథ్యంలో సానుకూల ప్యాకేజీ కారణంగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని నిపుణులంటున్నారు. ఆ మూడు షేర్ల వల్లే భారీ లాభాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మూడు షేర్లు 4–5 శాతం రేంజ్లో లాభపడ్డాయి. సెన్సెక్స్ మొత్తం లాభంలో ఈ మూడు షేర్ల వాటాయే 61 శాతంగా ఉండటం విశేషం. మొత్తం 793 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో హెచ్డీఎఫ్సీ వాటా 195 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 180 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 102 పాయింట్లుగా ఉన్నాయి. వెరసి ఈ 3 షేర్ల వాటా 477 పాయింట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల సంపద 2.41 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.41 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.41 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,33,462 కోట్లకు పెరిగింది. -
విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. -
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్బీఐ ప్రాయోజిత 16 ఆర్ఆర్బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల విలీనంపై... రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్ఆర్బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి. స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు. మాతృ బ్యాంకులో విలీనం ఉండదు ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి. 2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి. -
క్యూ4 ఫలితాలతో దిశానిర్దేశం
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న (మంగళవారం) 3వ దశ పోలింగ్ జరగనుంది. కొనసాగుతున్న సాధారణ ఎన్నికల వేడి, కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 (జనవరి–మార్చి) ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ఎర్నింగ్స్ సీజన్లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శుక్రవారం ఫలితాలను ప్రకటించగా.. ఆరోజు గుడ్‌ఫ్రైడే కారణంగా మార్కెట్‌కు సెలవు అయినందున ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై స్పష్టంగా కనిపించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాల్లో బలహీనంగా ఉన్నప్పటికీ.. రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా ఆర్ఐఎల్ రికార్డ్ స్థాయి లాభాలను ఆర్జించగా.. గత ఏడాది క్యూ4తో పోలిస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాల్లో 22.63 శాతం వృద్ధి కనబర్చింది. ఈ దిగ్గజాల ఫలితాల ప్రభావంతో పాటు.. ఇక నుంచి వెల్లడికానున్న ఎర్నింగ్స్ ప్రస్తుత వారంలో మార్కెట్‌కు కీలకంకానున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ‘స్వల్పకాలానికి ఇన్వెస్టర్లు క్యూ4 ఫలితాలపై దృష్టిసారించారు. నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం మేర వృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకింగ్ రంగ లోబేస్ కారణంగా ఈ అంచనాను తీసుకున్నాం. ఇక ఈవారంలో కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాన్ని కలుపుకుని ఇండెక్స్ హెవీవెయిట్స్ ఫలితాల సీజన్ ట్రెండ్‌కు అద్దంపట్టనున్నాయి.’ అని విశ్లేషించారు. ఎన్నికల వేడి నేపథ్యంలో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందన్నారు. ఆర్థిక సేవల రంగంపై దృష్టి అధిక శాతం ఆర్థిక సేవల కంపెనీలు ఈవారంలోనే నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (సోమవారం).. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ (బుధవారం) ఫలితాలను వెల్లడించనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ (గురువారం).. యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. వాహన దిగ్గజాల్లో మారుతీ(గురువారం), హీరో మోటోకార్ప్(శుక్రవారం) ఫలితాలను ప్రకటించనుండగా.. ఇతర రంగాల దిగ్గజాల్లో ఏసీసీ (మంగళవారం), ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్(బుధవారం) టాటా స్టీల్ (గురువారం) వెల్లడించనున్నాయి. అమెరికా–చైనా వాణిజ్య చర్చలు సైతం సూచీలకు సంకేతాలను ఇవ్వనున్నాయని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ఏప్రిల్ ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈవారంలోనే ఉన్నందున లార్జ్‌క్యాప్ షేర్ల కదలికలు ఈ అంశంపైనే ఆధారపడి ఉన్నట్లు ఎడిల్వీస్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ముడిచమురు ధరల ప్రభావం.. గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మరింత పెరిగి 72 డాలర్ల స్థాయికి చేరింది. శుక్రవారం 71.95 వద్ద ముగిసింది. ఈ ప్రధాన అంశం ఆధారంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.90–69.80 శ్రేణిలో కదలాడవచ్చని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. మరోవైపు ఏప్రిల్ 19తో అంతమయ్యే వారానికి విదేశీ మారక నిల్వల డేటాతో పాటు ఏప్రిల్ 12 నాటికి డిపాజిట్లు, బ్యాంకు రుణ పెరుగుదల గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ దేశీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు ఏప్రిల్‌లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నారు. గడిచిన రెండు నెలల్లో నికర కొనుగోలుదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1–16 కాలంలో) నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో మొత్తంగా రూ.14,300 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు.. డెట్ మార్కెట్ నుంచి రూ.3,288 కోట్లను ఉపసంహరించుకున్నారు. నికరంగా రూ.11,012 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు నమోదైంది. సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన దృక్పథంమారడం, అంతర్జాతీయంగా ద్రవ్య లభ్యత మెరుగుదలతో ఫిబ్రవరి నుంచి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుందన్న సానుకూలత కారణంగా పెట్టుబడులు కొనసాగుతున్నాయి’ అని గ్రో సీఈఓ హర్‡్ష జైన్ అన్నారు. ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోల్చితే భారత్ మరింత ఆకర్షణీయంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతున్నాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమంషు శ్రీవాత్సవ వివరించారు. -
లాభనష్టాల... ఊగిసలాట
ఆద్యంతం లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్ సూచీలు గురువారం చివరకు అక్కడక్కడే ముగిశాయి. ఐటీ, ఇంధన, వాహన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నప్పటికీ, ఆర్థిక, విద్యుత్, ఫార్మా రంగ షేర్లు ఆదుకోవడంతో స్టాక్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్లు పెరిగి 37,755 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 11,343 పాయింట్ల వద్దకు చేరాయి. స్టాక్ సూచీలు స్వల్పంగానే లాభపడినప్పటికీ, కీలకమైన స్థాయిలపైననే ముగియగలిగాయి. ఒక దశలో 156 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 58 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 214 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బ్యాంక్ షేర్లు భళా.... ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరుగుతున్నాయి. డాలర్–రూపీ స్వాప్ యాక్షన్ మార్గంలో మూడేళ్లలో 500 కోట్ల డాలర్ల నిధులను ఆర్బీఐ అందించనుండటంతో రుణ వృద్ది మరింతగా మెరుగుపడుతుందనే భావనతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ ఆల్‌టైమ్ హై రికార్డ్‌లు గురువారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 29,070 పాయింట్లను తాకిన బ్యాంక్ నిఫ్టీ చివరకు 0.1 శాతం లాభంతో 28,923 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ విలువ దిగువకు ఆర్‌కామ్.... యాక్సిస్ ట్రస్టీస్ సర్వీసెస్ తన వద్ద తనఖాగా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి చెందిన 4.34 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. దీంతో ఆర్‌కామ్ షేర్ ముఖ విలువ (రూ.5) కంటే తక్కువకు, రూ.4.65కు పడిపోయింది. ఆర్‌కామ్‌తో పాటు అనిల్ అంబానీకి చెందిన ఇతర కంపెనీ షేర్లు–రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ షేర్లు 2–7 శాతం రేంజ్లో పడిపోయాయి. -
ఓఎన్జీసీ లాభం 8,267 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీ నికర లాభాన్ని సాధించింది. గత క్యూ3లో రూ.5,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 65 శాతం ఎగసి రూ.8,263 కోట్లకు పెరిగిందని ఓఎన్జీసీ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేర్‌కు నికర లాభం రూ.3.91 నుంచి రూ.6.44కు పెరిగిందని పేర్కొంది. చమురు ఉత్పత్తి తగ్గినా, ధరలు అధికంగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.22,996 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.27,694 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.5.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,605 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. ∙గత క్యూ3లో బ్యారెల్ చమురును 58.42 డాలర్లకు ఈ కంపెనీ విక్రయించింది. ఈ క్యూ3లో ధర 14% ఎగసి 66.38 డాలర్లకు పెరిగింది. గ్యాస్ ధర 163% వృద్ధితో 3.36 డాలర్లకు ఎగిసింది. ∙క్యూ3లో క్రూడ్ ఉత్పత్తి 5% క్షీణించి 6.03 మిలియన్ టన్నులకు తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి 7% ఎగసి 6.7 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. ∙కచ్ తీరంలో, మధ్య ప్రదేశ్‌లోని వింధ్య బేసిన్లో, అస్సామ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలను ఈ కంపెనీ కొనుగొన్నది. ∙ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా మొత్తం 11 చోట్ల చమురు,గ్యాస్ నిక్షేపాలను కనుగొనగా, ఈ క్యూ3లో 4 కొత్త అన్వేషణలను కనుగొన్నది. -
మార్కెట్ అక్కడక్కడే
అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ వైఖరి మారడం, అనూహ్యూంగా రేట్ల కోత చోటు చేసుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ట్రేడై, మిశ్రమంగా ముగిసింది. ఇంట్రాడేలో 197 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ చివరకు 4 పాయింట్లు నష్టపోయి 36,971 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి 11,069 వద్ద ముగిశాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు ఒడుదుడుకులకు గురై మిశ్రమంగా ముగిశాయి. వాహన షేర్లు లాభపడగా, బ్యాంక్, రియల్టీ షేర్లలో షేర్లు కొన్ని లాభాల్లో, కొన్ని నష్టాల్లో ముగిశాయి. రెపో తగ్గింపువల్ల ఈ ప్రభావితమైన వాహన షేర్లు లాభపడ్డాయి. 273 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆర్బీఐ పాలసీ వెలువడక ముందు వరకూ పరిమిత లాభాల్లో ట్రేడైన స్టాక్ సూచీలు ఆ తర్వాత హెచ్చుతగ్గులకు గురయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించాయి. గత ఐదు రోజుల్లో స్టాక్ మార్కెట్ లాభపడినందున లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. చివరి అరగంటలో అమ్మకాలు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 197 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 76 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 273 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా అనిల్ కంపెనీల షేర్ల క్షీణత కొనసాగింది. ఛాలెట్ లిస్టింగ్...స్వల్ప లాభం ఛాలెట్ హోటల్స్ షేర్ స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లో లిస్టయింది. బీఎస్ఈలో ఈ షేర్ ఇష్యూ ధర, రూ.280తో పోలిస్తే 3.9 శాతం లాభంతో రూ.291 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 5.4 శాతం లాభంతో రూ.292 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 3.7 శాతం లాభంతో రూ.290 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 9.45 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 94 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,954 కోట్లుగా నమోదైంది. మెట్రో నగరాల్లో లగ్జరీ హోటళ్లు నిర్వహించే ఈ కంపెనీ గత నెల 29–31 మధ్య ఐపీఓకు వచ్చింది. -
పీఎన్బీ .. మళ్లీ లాభాల్లోకి!!
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 230 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం అధికం. తాజాగా మొండిబాకీలకు కేటాయింపులు తగ్గటం ఇందుకు తోడ్పడింది. ఆదాయం సుమారు 3 శాతం క్షీణించి రూ. 15,257 కోట్ల నుంచి రూ. 14,854 కోట్లకు తగ్గింది. వరుసగా మూడు త్రైమాసికాలుగా నష్టాలు ప్రకటిస్తూ వస్తున్న పీఎన్బీ తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తారుమారు చేశాయి. మూడో త్రైమాసికంలో పీఎన్బీ దాదాపు రూ. 1,063 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ‘మా బాధ్యతలన్నీ నిర్వర్తించాం. (నీరవ్ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి) పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేశాము‘ అని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మూడో క్వార్టర్లో దాదాపు రూ. 16,000 కోట్ల మేర మొండిబాకీలు రికవర్ కావడం కూడా పనితీరు మెరుగుపడటానికి తోడ్పడిందని ఆయన వివరించారు. ఎన్పీఏలు తగ్గుముఖం... గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ3లో ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 12.11 శాతం నుంచి 16.33 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 8.90 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఆదాయ పన్ను కాకుండా మొత్తం ప్రొవిజనింగ్ రూ. 4,467 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. ఇందులో మొండిబాకీలకు చేసిన కేటాయింపులు రూ. 2,566 కోట్లు (ఈ మొత్తంలో నీరవ్ మోదీ ఫ్రాడ్ ప్రొవిజనింగ్ సుమారు రూ. 2,014 కోట్లు). గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 2,996 కోట్లుగా ఉంది. మొండిబాకీలకు కేటాయింపులు సీక్వెన్షియల్‌గా చూస్తే 67 శాతం క్షీణించి రూ. 7,733 కోట్ల నుంచి రూ. 2,566 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో పీఎన్బీ షేరు అరశాతం పెరిగి రూ. 73.55 వద్ద క్లోజయ్యింది. -
క్యూ3లో వండర్లా లాభం పైపైకి
బెంగళూరు: వినోదరంగంలోని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి రూ.78.63 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81.34 శాతం ఎక్కువని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నులు మినహాయించి వచ్చిన లాభం రూ.6.54 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.14.51 కోట్లకు చేరి 122 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బెంగళూరు, హైదరాబాద్ వండర్లా పార్కుల్లో సందర్శకుల సంఖ్య వరుసగా 23 శాతం, 12 శాతం పెరిగిందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జోసెఫ్ వెల్లడించారు. -
టాటా స్టీల్ లాభం1,036 కోట్లు
ముంబై: టాటా స్టీల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అమ్మకాలు పుంజుకోవడం, దేశీయంగా మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో కంపెనీ రూ.6,529 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఆదాయం 22%పైగా ఎగసి రూ.42,428 కోట్లను తాకింది. యూరోపియన్ కార్యకలాపాలు పుంజుకోవడంతో నిర్వహణ మార్జిన్లు 2.57% మేర మెరుగుపడినట్లు గ్రూప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కౌశిక్ చటర్జీ పేర్కొన్నారు. కాగా, పూర్తిఏడాదికి(2013-14) కంపెనీ రూ. 3,595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతంలో రూ. 7,058 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. ఈ కాలంలో నికర అమ్మకాలు రూ. 1,33,538 కోట్ల నుంచి రూ. 1,47,347 కోట్లకు పెరిగాయి.