బెంగళూరు: వినోదరంగంలోని వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి రూ.78.63 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది 81.34 శాతం ఎక్కువని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నులు మినహాయించి వచ్చిన లాభం రూ.6.54 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.14.51 కోట్లకు చేరి 122 శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బెంగళూరు, హైదరాబాద్ వండర్‌లా పార్కుల్లో సందర్శకుల సంఖ్య వరుసగా 23 శాతం, 12 శాతం పెరిగిందని సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జోసెఫ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment