
సింగం లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న ఆర్. కృష్ణయ్య
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభను త్వరలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఏడు శాసనసభ స్థానాలు కేటాయించేలా ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీలందరినీ ఐక్యం చేసి పార్లమెంట్‌లో, శాసన సభలో 50 శాతం రిజర్వేషన్‌లు అమలు చేసేలా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేద్దామన్నారు. అనంతరం బీసీ సంఘం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న బీసీ యువజన సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేశ్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment