R krishnaaiah
-
రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ:రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ స్రెటేరియట్ మంగళవారం(సెప్టెంబర్24) నోటిఫై చేసింది. బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై కృష్ణయ్య స్పందించలేదు. -
బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..
-
ఏర్పేడులో ఆర్. కృష్ణయ్యపై రాయితో దాడి
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్‌ను అభినందించాల్సిందే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య. కాగా, కృష్ణయ్య బుధవారం బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల్లో తొలిసారి బీసీలకు న్యాయం జరిగింది. రోడ్లమీద కాదు పార్లమెంట్లో బీసీల కోసం పోరాడండి అని సీఎం జగన్ చెప్పారు. అందుకే నన్ను పార్లమెంట్‌కు పంపించారు. 50 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో నన్ను పోరాడమని చెప్పారు. సామాజిక న్యాయం చేయడానికి దమ్ముకావాలి. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీఎం జగన్ మాదిరి బీసీలకు మంత్రి పదవులివ్వలేదు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతిపక్షాలు అభినందించాలి. అమ్మఒడి వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రతీ పథకంలోనూ బీసీలకు ఎంతో మేలు జరుగుతోంది. మనకు సీఎం జగన్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏపీలో 60% పదవులు బీసీలకు దక్కడం మనకు గర్వకారణం. గతంలో ఎవరైనా బీసీలకు మేలు చేశారా?. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా?. మనకు రాజ్యాధికారం కల్పించిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్ -
దద్దరిల్లిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేశ్, రాజ్‌కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్ అన్నారు. -
రాజ్యసభకు నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖరారు
-
ఏపీ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు. -
సామాజిక న్యాయంలో ఓ విప్లవం!
ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించడం చరిత్రాత్మకం. ఇది అత్యంత ధైర్యసాహసాలతో కూడిన చర్య. ఇది దేశ చరిత్రలో తొలి రికార్డు. 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాలకు 50 శాతం మించి ఇవ్వలేదు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలలో కూడా 50 శాతం మంత్రి పదవులు ఇచ్చే ధైర్యం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వీరోచితంగా ఈ వర్గాలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం కల్పించి, సామాజిక న్యాయానికి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన 25 మంది మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి అవకాశం కల్పించారు. ఇందులో బీసీలు 10 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీ, మైనారిటీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘట్టంతో బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ ఆప్తుడయ్యారు. దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఆయన పట్ల తిరుగులేని అభిమానం, మద్దతు పెరిగింది. ఇతర రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప చిత్తశుద్ధితో ఈ వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి పాటుపడలేదని బీసీలు గుర్తించారు. అందుకే మెజారిటీ ప్రజలైన బహుజనులలో రోజు రోజుకూ జగన్‌పై క్రేజ్ పెరుగుతోంది. గత ఎన్నికలలో 50 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఈ దఫా 60 శాతం ఓట్లతో 170 సీట్లకు పైగా గెలుస్తుంది అనడంలో అనుమానం లేదు. మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైఎస్సార్సీపీ రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు పార్లమెంటులో బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, అప్నాదళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా ఈ బిల్లు పెట్టలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. అంతేగాక 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో పోస్టులు మొత్తం 100 శాతం బీసీలకు కేటాయిం చారు.193 కార్పొరేషన్లలో బీసీలకు 109 చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగింది. దీని మూలంగా బీసీ కులాల నాయకత్వం పెరిగింది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే, దానికి పార్టీ పరంగా అదనంగా మరో 20 శాతం చేర్చి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే, ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 12 పదవులను అంటే 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలు అధికార పార్టీకి దక్కితే వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేద కులాలు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, వృత్తి విద్యల వరకు ఉచితంగా చదువుకోవాలనే మహత్తర ఆశయంతో అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికీ 15 వేలు, కాలేజీ కోర్సులు చదివే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి కాలేజీ విద్యార్థికి సంవత్సరానికి 20 వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ పథకాల వలన కూలీ నాలీ చేసుకొనేవారు ఉన్నత విద్య చదివే అవకాశం లభించింది. దీని వల్ల సమాజంలో సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆశ్చర్యపరిచారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే లోటు బడ్జెట్‌తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీల సంక్షేమానికి రూ.30వేల కోట్లు కేటాయించడం చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోయారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా బీసీలకు రూ.6 వేల కోట్లకు మించి కేటాయించలేదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి ‘బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటుచేసి, అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చారు. బలహీన వర్గాలను పరిశ్రమల అధిపతులుగా చేయాలని, పెద్ద కాంట్రాక్టర్లుగా చేయాలనే చిత్తశుద్ధితో పారిశ్రామిక పాలసీ రూపొందించారు. రాష్ట్రంలో 196 మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 బీసీలకు ఇచ్చారు. 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే, అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే! వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో నాలుగు స్థానాలు దక్కితే, అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. మన దేశంలో మంత్రి పదవి, చైర్మన్ పదవి, ఇతర రాజకీయ పదవులు అంటే ఒక హోదా, ఒక సామాజిక గౌరవం అని ప్రజలు నమ్ముతారు. ఈ హోదాను, పదవిని, అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందించడానికే రిజర్వేషన్లు లేదా కోటా ఇవ్వాలి. తద్వారా దేశ పరిపాలనలో తాము కూడా భాగం అవుతున్నామన్న అభిప్రాయం ఈ వర్గాల్లో కలుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేనో, మంత్రో, చైర్మనో అయితే ఆ జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఆ కులస్థులు ‘మావాడు మంత్రి అయ్యాడు, చైర్మన్ అయ్యా’డనే భావంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ భావన జాతి ఐక్యతకు, దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది. బలమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలంటే పటిష్ఠమైన, సమగ్రమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి. భారతదేశంలో పటిష్ఠ మైన వ్యవస్థ నిర్మాణాన్ని కుల వివక్ష దెబ్బ కొడుతోంది. జాతి పరస్పరం సంఘర్షించుకొని వేలాది కులాలుగా చీలిపోయింది. ఇది జాతి ఐక్యత, సామాజిక సామరస్యం, మానవ వికాసానికి అవరోధంగా తయారైంది. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఈ కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగం, పాలన రంగంలో ఈ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం చారిత్రక అవసరం. దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా రూపొందదు. ఈ చారిత్రక అన్యాయాన్ని గుర్తించి వై.ఎస్.జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. - ఆర్. కృష్ణయ్య ధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. మొబైల్: 90000 09164 . -
‘కేంద్ర’ ఉద్యోగాల భర్తీపై స్పష్టత: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారుల ప్రాథమిక గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు తెలిసిందన్నారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో మరో 6.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవ ఖాళీల సం ఖ్యను బహిర్గతం చేసి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమ ర్శించారు. ప్రస్తుత ఖాళీలను పక్కాగా ప్రక టించి వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి అవకాశాలు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రధాని మోదీకి ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. -
భిక్ష కాదు... వాటా కావాలి!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 28 ఏళ్ల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా తీర్మానం చేశాయి. ప్రజాస్వామ్యం సుస్థిరంగా కొనసాగాలంటే అన్ని సామాజిక వర్గాలకూ, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. బీసీలకు కావలసింది భిక్ష కాదు... రాజ్యాంగబద్ధంగా వాటా! త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన కూడా చేయా లనీ, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. జనాభా గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి. కుల గణన చేస్తే అదనంగా ఇంకొక కాలమ్ మాత్రమే చేరుతుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు. ఒక్క కాలమ్ పెట్టడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుంది? జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తే బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నట్లుంది. అలాగే కొత్తగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాలవారీ జనగణనకు వెనకాడుతోం దని రాజకీయ పరిశీలకుల భావన. ఇది నిజమే కావచ్చు. కానీ అంత మాత్రాన బీసీ కులాలకు ఇవ్వవలసిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వ కుండా ఎన్ని రోజులు దాటవేస్తారు? స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయిం పులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మేరకు, ఈ దేశంలోని 2,648 బీసీ కులాలలో దాదాపు 1,800 కులాలు చాలా పేదరికంలో, దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్యం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం లోని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాకా కలేల్కర్ కమిషన్‌ను నియమించారు. కానీ దాని సిఫార్సులను అమలు చేయకుండా తొక్కి పెట్టారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ 1978లో మండల్ కమిషన్‌ను నియమించి; ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులఫై అధ్యయనం చేశారు. బీసీ కులాల అభివృద్ధికి మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం మూడు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 37 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రదేశంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? బీజేపీ కలలుగనే అఖండ భారత్‌లో బీసీలు భాగం కారా? రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వడం లేదు. ఇంతవరకు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెటు కేటా యింపులు లేవు. కనీసం ఐఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చదివే వారికి స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు స్కీమూ లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో జనాభా ప్రకారం ప్రజాస్వామిక వాటా దక్కడం లేదు. దీనికోసం రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన సమయం ఆసన్నమైనది. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. చట్ట సభ లలో, అసెంబ్లీ – పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 1996లో, 2008లో, 2010లో బీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేశారు. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలూ వీటిపై తీర్మానం చేశాయి. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు కల్పించ లేదు. దేశంలో 2,642 బీసీ కులాలు ఉంటే 2,560 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెడితే తప్ప వారికి ప్రజాస్వామిక వాటా లభించదని తేలుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వే షన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లకు ఒక్కసారైనా రాజ్యాంగాన్ని సవరించిందా? పాలనారంగంలో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 15 శాతం దాటడం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలతో కలిసి బీసీల శాతం 15 మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపు తున్నాయి. కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం 7 లక్షల 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మండల్ కమిషన్ సిఫా ర్సుల ప్రకారం 28 సంవత్సరాల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరగదనేది ఇన్నేళ్ల అనుభవం ద్వారా కనిపిస్తున్న నిజం. అలాగే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవల సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని 16(4)ఎ ఆర్టికల్ ప్రకారం జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాల్లో కోర్టులూ తీర్పులు చెప్పాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కేంద్రస్థాయిలో బీసీల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అనేక చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు వస్తున్నాయి. అనేక స్కీములను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది. కేంద్ర బడ్జెట్ 34 లక్షల కోట్లు కాగా, 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ఈ దేశంలో బీసీలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్‌తో బీసీలకు బిస్కెట్లు కూడా సరిపోవు. ఇక బీసీల అర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది? కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఫీజుల మంజూరు, పోటీ పరీక్షలకు కోచింగ్ లాంటి అనేక ఇతర స్కీములు పెట్టవలసిన అవసరం ఉంది. బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించి బడ్జెటులో కేటాయింపులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వవలసిన అవసరం ఉంది. స్కాలర్షిప్ మంజూరు, పూర్తి ఫీజుల మంజూరు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠ శాలల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ల కింద సీట్లు పొందినవారు ఫీజులు కట్టే ఆర్థిక స్థోమత లేని వారు. కాగా ఐఐటీ, ఐఐఎం లాంటి కోర్సుల ఫీజులు సంవత్సరానికి రూ. 90 వేల నుండి 1,70,000 వరకు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఫీజులను పేద కులాలైన బీసీలు కట్టే పరిస్థితి లేదు. ఇందుకు ఏటా లక్ష కోట్ల రూపా యలను కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శి స్తోంది. ప్రజాస్వామ్యం సుస్థిరంగా, శాంతియుతంగా కొనసాగా లంటే అన్ని సామాజిక వర్గాలకు, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్. పీడిత ప్రజానీకం ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరిత్రను చూస్తున్నాం. సమన్యాయం పాటించకపోతే ఇక్కడా అదే జరుగుతుంది! ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్: 90000 09164 -
బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్(గన్‌పార్క్): కేంద్రం ఓబీసీ కుల గణన చేపట్టేలా అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని ప్రకటించింనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే పక్క రాష్ట్రాలలైన తమిళనాడు, కేరళ బీసీ జనగణన చేపడుతున్నాయని ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ జన గణన జరిగేలా చూడాలంటూ... కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీ ప్రభత్వానిదేనంటూ ప్రశంసించారు. (చదవండి: తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్ అరెస్టు) అంతేకాదు బీసీ కమిషన్లు, సుప్రీం కోర్టు జన గణన చేపట్టాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు కృష్ణయ్య. అయితే జన గణనలో కుల గణన వచ్చినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన దేశంలో వెనుకబడిన కులాలు 46 లక్షల కులాలున్నాయి అని కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. అంతేకాదు వెనుకబడిన కులాలు 6 వేల వున్నాయని, అందులో బీసీలు 2 వేల కులాలే ఉన్నాయని చెప్పారు. అంతేకాదు గతంలో 2014లో సకల జనుల సమగ్ర కుటుంబ సర్వే.. చేయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పైగా దానికి చట్టబద్ధత లేదంటూ చెబుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు చట్టబద్ధత వున్న సంస్థలతో సర్వే చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. (చదవండి: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా) -
స్కాం చేయలేదని చట్టప్రకారం నిరూపించుకోవాలి
-
బీసీ ద్రోహి చంద్రబాబు
సాక్షి, కోరుకొండ (రాజానగరం): ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కోరుకొండలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాధికారంలో వాటా కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందటే పార్లమెంట్లో బిల్లు పెట్టిందన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 41, లోక్‌సభలో 7 సీట్లు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు. వడ్డెర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వాల్మీకి, కురుబ, మత్స్యకారుల్లాంటి అత్యంత వెనుకబడిన కులాలకు జగన్ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు జగన్ ప్రకటించారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడడం జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపు లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలందరూ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి రాజాను, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌లను సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ కృష్ణయ్యను కలిసిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు
-
తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్ : ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు మంగళవారం కలిశారు. ఆర్ కృష్ణయ్యను ఈనెల 17న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ బీసీ గర్జనకు ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. '40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఏపీకి ఆహ్వానిస్తున్నాం. మా నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనకు ఆహ్వానించాం. ఫీజు రీయింబర్స్ విషయంలో వైఎస్సార్‌తో అనేక సార్లు సమీక్షించి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాన్ని రూపొందించారు. అనేక హాస్టళ్లు, గురుకులాల ఏర్పాటుకు కృషిచేయటమే కాకుండా, ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్ షిప్‌లు అమలుకు కృష్ణయ్య కృషిచేశారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది' అని అన్నారు. బీసీలకు వైఎస్సార్ చేసిన మేలు అంతా ఇంతా కాదని ఆర్ కృష్ణయ్య అన్నారు. 'బీసీలు ఏం కోరితే అది కాదనకుండా ఇచ్చారు. ఎంత ఫీజు ఉంటే అంత రీయింబర్స్మెంట్ ఇచ్చిన మంచి మనిషి. 300 హాస్టళ్లు, విద్యార్థినిలకు హాస్టళ్లు, మెయింటెనెన్స్ చార్జీలు అన్నీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివి ఆకుటుంబాలు బాగుపడాలని రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్. ఆయనలానే బీసీలంటే వైఎస్ జగన్‌కి ప్రేమ. దేశవ్యాప్తంగా 36 పార్టీలను బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరితే, స్పందించింది కేవలం వైఎస్సార్సీపీ ఒక్కటే. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి మరీ ఈ అంశం పార్లమెంట్లో చర్చకు కృషిచేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. తప్పని సరిగా వైఎస్సార్సీపీ బీసీ గర్జనకు హాజరవుతా. వైఎస్సార్సీపీ గెలిస్తేనే నా జీవిత ఆశయం చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం ముందుకెళుతుందని భావిస్తున్నా' అని కృష్ణయ్య అన్నారు. -
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
-
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడగటం లేదని, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు రిజర్వేషన్లు ప్రాతిపదిక కాదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓపెన్ కేటగిలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీరి ఈబీసీ రిజర్వేషన్లను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు తేవొచ్చాని సూచించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 49.5 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతోంది. 10శాతం పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతంకు చేరనుంది. -
సమైక్యంగా ఉద్యమిద్దాం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు. టీజే ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్‌పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు. ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గం: దాసోజు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వినయ్‌కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్‌కుమార్, పీఎల్ విశ్వేశ్వర్రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సరైన సమయంలో బీసీ పార్టీపై ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సరైన సమయంలో బీసీ పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు సీఎం కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు 20 మందే ఉన్నారని, ఇటు కాంగ్రెస్ లీకులిస్తోన్న జాబి తాల్లోనూ బీసీలకు పెద్దగా ప్రాధాన్యం కన్పించడం లేదని ఆరోపించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే, బీసీలకు రాజ్యాధికారమే ఏకైక మార్గమని తెలిపారు. మాతో కలసి రండి: బీఎల్ఎఫ్ బీసీల ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఓ ప్రత్యేక పార్టీ ఉండాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కృష్ణయ్య తమతో కలసి రావాలని.. తమ కూటమి తరఫున కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ, కృష్ణయ్యను కూటమి సీఎం అభ్యర్థిగా బలపరుస్తామని, అధిష్టానంతో ప్రకటనకు కృషి చేస్తామని తెలిపారు. అయితే దీనిపై కృష్ణయ్య ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. తన అనుచరులతో సమావేశమైన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీజేఎస్ నేత విశ్వేశ్వర్, పీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు మల్లయ్య, రాజలింగం తదితరులు ప్రసంగించారు. -
త్వరలో కొత్త పార్టీ పెడతాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..’అని అడుగుతున్నారని చెప్పా రు. పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతాననిç Ü్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానన్నారు. రద్దు చేసి సీఎంగా కొనసాగడమా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేసి, ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలసి ఓడిస్తామని వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్లు 54 శాతానికి పెంచండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34 శాతం నుంచి 54 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి జూపల్లి చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, చట్ట పరమైన అవరోధాలు లేవని తేల్చి చెప్పారు. సకలజనుల సర్వే, ఇటీవల ప్రభుత్వం జరిపిన జనాభా లెక్కల ప్రకారం బీసీలు 54 శాతం ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పల్లె గోడల మీద రాసిన విషయం గుర్తులేదా అని ధ్వజమెత్తారు. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్, మెరిట్ లేదని వివరించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, కోట్ల శ్రీనివాస్, కె.నర్సింహగౌడ్, వన్నాడి రమ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లను పెంచాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 54 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 54 శాతమని స్పష్టమైందని, జనాభా ప్రాతిపదికన ఆమేరకు రిజర్వేషన్లను పెంచాలని కోరారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇలాంటి కుట్రలు సాగవని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసినందున ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. -
బీసీ బడ్జెట్‌ను రూ.50 వేల కోట్లకు పెంచాలి’
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్లో బీసీల సంక్షేమ వాటాను పెంచాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లట్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన.. కేంద్రం 24 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు రూ.900 కోట్లే కేటాయించిందన్నారు. ఈ వాటాను రూ.50 వేల కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించినా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర రాయితీలు పొందలేక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారన్నారు. కేంద్రంలో బీసీల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్లను సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, రూ.60 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. -
‘తెలుగు హీరోలకి తెలివి లేదు..'
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా హీరోలపై ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలకి తెలివి, ధైర్యం, శక్తి లేదని, వారంతా నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బాషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇస్తే ఏమీ కాదని లేదంటే గుడిసెలు వేయిస్తానని హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో కనిపించని వివక్ష దోపీడి కొనసాగుతుందని కృష్ణయ్య మండిపడ్డారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు ఇండస్ట్రీకి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడియోలలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సినీ కళాకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని కృష్ణయ్య పేర్కొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కానీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటని మండిపడ్డారు. పరిశ్రమలో జరుగుతున్న దారుణాలను పట్టించుకోవాల్సిన సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపులేదని కృష్ణయ్య విమర్శించారు. -
త్వరలో బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభ
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభను త్వరలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఏడు శాసనసభ స్థానాలు కేటాయించేలా ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీలందరినీ ఐక్యం చేసి పార్లమెంట్లో, శాసన సభలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేద్దామన్నారు. అనంతరం బీసీ సంఘం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న బీసీ యువజన సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేశ్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, అశోక్ పాల్గొన్నారు.