సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అధికారుల ప్రాథమిక గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలున్నట్టు తెలిసిందన్నారు. ఇందులో వివిధ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో మరో 6.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
వాస్తవ ఖాళీల సం ఖ్యను బహిర్గతం చేసి వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమ ర్శించారు. ప్రస్తుత ఖాళీలను పక్కాగా ప్రక టించి వాటిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారికి అవకాశాలు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ప్రధాని మోదీకి ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment