సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య.
కాగా, కృష్ణయ్య బుధవారం బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల్లో తొలిసారి బీసీలకు న్యాయం జరిగింది. రోడ్లమీద కాదు పార్లమెంట్‌లో బీసీల కోసం పోరాడండి అని సీఎం జగన్ చెప్పారు. అందుకే నన్ను పార్లమెంట్‌కు పంపించారు. 50 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో నన్ను పోరాడమని చెప్పారు. సామాజిక న్యాయం చేయడానికి దమ్ముకావాలి. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీఎం జగన్ మాదిరి బీసీలకు మంత్రి పదవులివ్వలేదు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతిపక్షాలు అభినందించాలి. అమ్మఒడి వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రతీ పథకంలోనూ బీసీలకు ఎంతో మేలు జరుగుతోంది. మనకు సీఎం జగన్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏపీలో 60% పదవులు బీసీలకు దక్కడం మనకు గర్వకారణం. గతంలో ఎవరైనా బీసీలకు మేలు చేశారా?. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా?. మనకు రాజ్యాధికారం కల్పించిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment