Ammaodhi Scheme
-
ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్‌ను అభినందించాల్సిందే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య. కాగా, కృష్ణయ్య బుధవారం బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల్లో తొలిసారి బీసీలకు న్యాయం జరిగింది. రోడ్లమీద కాదు పార్లమెంట్లో బీసీల కోసం పోరాడండి అని సీఎం జగన్ చెప్పారు. అందుకే నన్ను పార్లమెంట్‌కు పంపించారు. 50 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో నన్ను పోరాడమని చెప్పారు. సామాజిక న్యాయం చేయడానికి దమ్ముకావాలి. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీఎం జగన్ మాదిరి బీసీలకు మంత్రి పదవులివ్వలేదు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రతిపక్షాలు అభినందించాలి. అమ్మఒడి వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రతీ పథకంలోనూ బీసీలకు ఎంతో మేలు జరుగుతోంది. మనకు సీఎం జగన్ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏపీలో 60% పదవులు బీసీలకు దక్కడం మనకు గర్వకారణం. గతంలో ఎవరైనా బీసీలకు మేలు చేశారా?. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా?. మనకు రాజ్యాధికారం కల్పించిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్ -
అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించామన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కేబినెట్లో భేటీలో ఆమోదించిన పలు అంశాలు.. ►అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్, డిసెంబర్లో అర్జీకి అవకాశం కల్పిస్తాం. ►వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం ►కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ అంగీకారం. ►560 అర్బన్ హెల్త్ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం. ►వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం. ►ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం. ►వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం. ►రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. ►శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదం. ►అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం. ►కొత్తగా జైన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. ►అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ►జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు ఆమోదం. ►పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో 5చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ►ప్రకాశం జిల్లాలో జేఎన్టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం. చదవండి: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ గ్రామానికో ట్రాక్టర్.. ఏపీ సర్కార్ కసరత్తు -
మాతాశిశు సంరక్షణపై దృష్టి
► అమ్మ ఒడి పథకం నేపథ్యంలో నియామకాలు ► త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా వందలాది పోస్టుల భర్తీ ► ఆసుపత్రుల్లో బాలింతల మరణాలు తగ్గించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఇటీవల నీలోఫర్, గాంధీ తదితర ప్రధాన ఆసుపత్రుల్లో వరుసగా జరి గిన బాలింతల మరణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. మరోవైపు సిజేరియన్ ఆపరేషన్లలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యాన్ని గాడిలో పెట్టాలని, మాతాశిశు సంరక్షణపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే గర్భిణీలకు పోత్సాహ కం కింద రూ.12 వేలు ఇచ్చే పథకం జూన్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు కేసీఆర్ కిట్ పేరుతో బాలింతలు, పుట్టిన శిశువులకు అవసరమైన వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకాలు విజయవంతం కావాలంటే వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలు భారీగా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. టీఎస్పీఎస్సీకి భర్తీ బాధ్యత... వివిధ ఆసుపత్రులకు 2,118 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కారు ఆ మధ్య ఆమోదం తెలిపింది. వాటిని భర్తీ చేయాలని టీఎస్పీ ఎస్సీకు ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో... కాంట్రాక్టు, ఔట్‌సోర్సిం గ్ పద్ధతిలో 432 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులపై దృష్టిసారించి సోమవారం 1,099 పోస్టులు మంజూరు చేసింది. ఆయా ఆసుపత్రులకు 111 యూనిట్లు మంజూరు చేస్తే అందులో అధికంగా మాతా శిశు సంరక్ష ణకే ప్రాధాన్యమిచ్చారు. బాలింత, శిశుమర ణాలను తగ్గించాలనే ఉద్దేశంతో స్త్రీ వైద్యం కోసం 26, పిల్లల వైద్యం కోసం 12, మత్తు మందు వైద్యంకోసం 29 యూనిట్లు మంజూ రు చేశారు. ఆ యూనిట్లలో భాగంగా మాతా శిశు సంరక్షణ కోసం 78 మంది గైనకాల జిస్టులు, 36 మంది పిల్లల వైద్య నిపుణులు, ఐసీయూలు, ఆపరేషన్ల కోసం 87 మంది మత్తు మందు నిపుణులను తీసుకోవాలని నిర్ణయించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మినహా ఇతర ఉద్యోగాలన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా నేరుగా భర్తీ చేస్తారు. భర్తీలోనే జాప్యం... ప్రభుత్వం విరివిగా పోస్టులను మంజూరు చేస్తున్నా, వాటి భర్తీకి ఆదేశించినా టీఎస్పీఎస్సీ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం పై నిరుద్యోగులు ఆందోళన చెందు తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపించడం, వాటిని ప్రభుత్వం ఆమోదించడం వరకే పరిమితమవుతుందని, కానీ టీఎస్పీ ఎస్సీ మాత్రం స్పందించడం లేదని వైద్య నిరుద్యోగ అభ్యర్థులు విమర్శిస్తున్నారు.