
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం ముగిసినప్పటికీ ఇంకా ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులపై కాలేజీ యాజ మాన్యాల ఒత్తిడి తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా పరీక్షల సీజన్ సమీపించడంతో కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు పేర్కొంది. ఫీజు బకాయిలు విడుదల చేయడమే ప్రస్తుత పరిష్కార మని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేసింది.
శనివారం హైదరాబాద్ లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం అను బంధ సంఘాల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత వార్షిక సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక కాలేజీ యాజమాన్యాలు సైతం ఇబ్బందులు పడుతు న్నట్లు చెప్పారు. ఫలితం గా వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే తీసుకోవచ్చని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు.
ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.అంజి, నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment