‘తెలుగు హీరోలకి తెలివి లేదు..' | MLA R Krishnaiah Slams On Tollywood Industry | Sakshi
Sakshi News home page

‘తెలుగు హీరోలకి తెలివి లేదు.. కుక్కను చూస్తే పారిపోతారు'

Published Mon, Apr 16 2018 7:38 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

MLA R Krishnaiah Slams On Tollywood Industry - Sakshi

ఆర్‌. కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు సినిమా హీరోలపై ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలకి తెలివి, ధైర్యం, శక్తి లేదని, వారంతా నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బాషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇస్తే ఏమీ కాదని లేదంటే గుడిసెలు వేయిస్తానని హెచ్చరించారు.

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. సినీ ఇండస్ట్రీలో కనిపించని వివక్ష దోపీడి కొనసాగుతుందని కృష్ణయ్య మండిపడ్డారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు ఇండస్ట్రీకి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడియోలలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సినీ కళాకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని కృష్ణయ్య పేర్కొన్నారు.

సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కానీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటని మండిపడ్డారు. పరిశ్రమలో జరుగుతున్న దారుణాలను పట్టించుకోవాల్సిన సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపులేదని కృష్ణయ్య విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement