Telugu Heros
-
అడవి బాట... బాక్సాఫీస్ వేట
బాక్సాఫీస్ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం. అడవిలో ఈగల్ ‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్’ సినిమా టీజర్లోనిది. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్ స్పష్టం చేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆఫ్రికన్ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అడవుల్లో దేవర ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్ 2’లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. పుష్పరాజ్ రూల్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్’ కోసం ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. న్యూజిల్యాండ్‌లో కన్నప్ప శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
ముచ్చటగా 3 గంటలు
-
మాస్ జపం చేస్తున్న యంగ్ హీరోలు
-
కథ లో కంటెంట్ ఉంటే చాలు దేనికైనా రెడీ
-
తెలంగాణ హిట్ ఫార్ములా సక్సెస్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోలు
-
తెలుగు హీరోల వెంటపడుతున్న కన్నడ డైరెక్టర్లు
సినిమా రంగంలో ప్రతిభ ఉంటే చాలు.. భాషాపరమైన హద్దులు బద్దలవుతాయి. టాలెంట్ ఉంటే పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు ఆయా హీరోలు, నిర్మాతలు. ఇదే కోవలో తాజాగా ప్రశాంత్ నీల్, హర్ష, నార్తన్ వంటి కన్నడ దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. తెలుగు హీరోలతో ఆ కన్నడ దర్శకులు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► కన్నడలో ‘ఉగ్రం’ (2014) సినిమాతో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత నాలుగేళ్లకు యశ్ హీరోగా ‘కేజీఎఫ్’ (మొదటి భాగం 2018) మూవీతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్’ (రెండవ భాగం 2022) చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో భారీ అవకాశాలు ప్రశాంత్ నీల్ డోర్‌ని టచ్ చేశాయి. అందులో భాగంగా పాన్ ఇండియా హీరోగా దూసుకెళుతున్న ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేసే గోల్డెన్ చాన్స్ అందిపుచ్చుకున్నారు ప్రశాంత్. ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేసే చాన్స్ అందుకున్నారు ప్రశాంత్ నీల్. ‘సలార్’ షూటింగ్ పూర్తి కాగానే ఎనీ్టఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ని ఆరంభించనున్నారు ప్రశాంత్ నీల్. కొరటాల శివతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ప్రశాంత్ సినిమా షూటింగ్లో అడుగుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్. ► కథా బలం, యాక్షన్ సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ ఎ. హర్ష. శివరాజ్‌కుమార్‌తో ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘వేద’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన తెలుగులో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 31వ చిత్రమిది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై కేకే రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ► రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు చరణ్. అదే విధంగా మరో సినిమాని కూడా లైన్లో పెట్టారట. ‘ముఫ్తీ’ (2017) సినిమాతో దర్శకుడిగా కన్నడలో ఘనవిజయం అందుకున్న నార్తన్‌తో రామ్‌చరణ్ సినిమా చేయనున్నారని టాక్. ఇక ‘ముఫ్తీ’ తర్వాత కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌తో నార్తన్ తీసిన ‘భైరతి రణగల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్‌చరణ్‌కు నార్తన్ ఓ కథ వినిపించగా, నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. శంకర్‌తో చేస్తున్న సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాని పూర్తి చేశాక నార్తన్ మూవీ చేస్తారట రామ్‌చరణ్. ప్రశాంత్ నీల్, హర్ష, నార్తన్ మాత్రమే కాదు.. మరికొందరు కన్నడ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ ఫొటోలు
-
తెలుగు హీరోలకు మంచి రోజులు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి–2’ సినిమాలో ఏనుగునెక్కి ఒంటిచేత్తో శూలాన్ని బాణంలాగా వదిలాడు. ఆ బాణం దేశమంతా గట్టిగా తగిలింది. బాణం వేసిన ప్రభాస్‌కు, అలా బాణం వేయమని చెప్పిన రాజమౌళికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పదహారణాల తెలుగు సినిమా పదహారు దారులు పట్టింది. అన్ని భాషలవారు తెలుగుసినిమాను ఆకాశానికి ఎత్తుకున్నారు. సినిమా పరిశ్రమలో ఇప్పుడు కొత్తగా పాన్ ఇండియా సందడి మొదౖలైంది. దేశవ్యాప్తంగా ఉనికి చాటుకునే సినిమాలే పాన్ ఇండియా మూవీస్. పాన్ ఇండియా సినిమాల వల్ల దేశంలోని పలు భాషల్లో నటించే అగ్రనటులందరూ ఓ సినిమాకి పనిచేస్తారు. దానివల్ల వ్యాపారాన్ని పెద్దగా చేయటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దర్శక, నిర్మాతలు ఈ పద్ధతిని ఎన్నుకుంటారు. ఉదాహరణకు ‘సైరా’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రను పోషిస్తే, ఆయనకు సపోర్ట్‌గా బాలీవుడ్ నుంచి బిగ్‌బీ అమితాబ్, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, శాండల్‌వుడ్ స్టార్ సుదీప్‌లతో పాటు జగపతిబాబు, నయనతార, అనుష్క, తమన్నా ఇలా చాలామంది స్టార్స్ నటించి దాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిలిపారు. ‘సాహో’లో కూడా అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు తమిళ నటులు కూడా నటించారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సాహో’ చిత్రాన్ని పాన్ఇండియా సినిమాగా ప్రభాస్ విడుదల చేశారు. తెలుగు హీరోలకు మంచిరోజులు మన తెలుగు సినిమా హీరోలకు ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో గిరాకీ పెరుగుతుంది. దీనంతటికి కారణం ‘బాహుబలి’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ సినిమాతో వచ్చిన వసూళ్లతో అంతర్జాతీయంగా ఒక తెలుగు సినిమాపేరుతో పాటు రాజమౌళి, ప్రభాస్, రానా పేర్లు మారుమోగాయి. దేశవ్యాప్తంగా విడుదల చేసేలా సినిమా తీస్తే, అప్పుడు ఖర్చుకు వెనుకాడకుండా తీయచ్చనేది చిత్రనిర్మాతల ఆలోచన. అలా తీస్తే పెట్టిన ప్రతిపైసా మొదటివారంలోనే వస్తుందనేది వారి నమ్మకం. చిరంజీవి, ప్రభాస్‌ల కోవలోనే అనేక మంది తెలుగు స్టార్స్ యన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండలతో పాటు మరికొంతమంది తెలుగు స్టార్‌హీరోలు పాన్ ఇండియా మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దేశమంతా సైరా... 80ల నాటి తెలుగు హీరోల్లో కొందరు హిందీ సినిమాలు చేశారు. రాజశేఖర్ హీరోగా నటించిన ‘అంకుశం’ చిత్రం హిందీ రీమేక్ ‘ప్రతిబం«ద్’ (1990)లో చిరంజీవి హీరోగా చేశారు. తానే నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ హిందీ రీమేక్ ‘ఆజ్కా గూండారాజ్’లోనూ, ‘ది జెంటిల్మెన్’ రీమేక్‌లో కూడా చిరంజీవి నటించారు. నాగార్జున, వెంకటేశ్ కూడా నేరుగా కొన్ని బాలీవుడ్ సినిమాలు చేసినవారే! ‘బాహుబలి’ తర్వాత చిరంజీవి నటించిన ‘సైరా’ను పాన్ ఇండియా మూవీగా విడుదలైన రెండో తెలుగు సినిమాగా చెప్పుకోవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ను కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్‌చరణ్ ఆలోచనట! ముచ్చటగా మూడు సినిమాలతో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ఇండియా మూవీ ‘సాహో’ చిత్రం బడ్జెట్ దాదాపు రూ.300 కోట్లు. ప్రాంతీయ భాష తెలుగులో ఈ సినిమాకు యావరేజ్ మార్కులు పడితే, బాలీవుడ్ జనాలు ఈ సినిమా చూసి ప్రభాస్‌కు ‘సాహో’ అన్నారు. కలెక్షన్లపరంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. మొదట ఈ సినిమాకు డివైడ్‌టాక్ వినిపించినా, తర్వాత రూ.400 కోట్ల మార్కును చేరుకోవటంతో ప్రభాస్ చేయబోయే కొత్త చిత్రాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ మరో మూడు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. అవన్నీ చాలా పెద్ద ప్రాజెక్టులుగా తయారు కాబోతున్నాయి. అందులో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తమ సొంత బ్యానర్లు గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1940ల నాటి పిరియాడికల్ లవ్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ‘మహానటి’తో తన టాలెంట్‌ను నిరూపించుకున్న దర్శకుడు నాగ్అశ్విన్ తన తర్వాత కథను ప్రభాస్‌కు వినిపించారు. ప్రభాస్‌కు కథ నచ్చటంతో లాక్‌డౌన్‌లోనే ఈ సినిమాను లాక్ చేసేశారు నిర్మాత సి.అశ్వనీదత్. ‘మహానటి’ చిత్రాన్ని నిర్మించిన స్వప్నా దత్, ప్రియాంకదత్ ఆయన కుమార్తెలే. ప్రియాంకా దత్ భర్తే ‘మహానటి’ దర్శకుడు నాగ్అశ్విన్. ఆలస్యం చేయకుండా ‘మహానటి’ టీమ్‌తో చేతులు కలిపారు ప్రభాస్. బాలీవుడ్ దర్శకనిర్మాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే మైథలాజికల్ చిత్రాన్ని ప్రభాస్ అంగీకరించారు. ఇందులో ఆయన రాముని పాత్రలో నటిస్తున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ–సిరీస్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఓం రౌత్. 2021లో షూటింగ్ ప్రారంభించి 2022లో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. పాన్ ఇండియా రేస్‌లో ఈతరం తెలుగు హీరోల్లో మొదటిస్టార్గా ప్రభాస్ తన పేరు నమోదు చేసుకున్నారు. డబ్బింగ్–రీమేక్–ఓటీటీ ఒక సినిమా కంటెంట్ బావుంటే అది ఏ భాషలో తీసినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సౌతిండియా సినిమాలు (తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ) దేశం మొత్తానికి ఈ రోజేం కొత్తకాదు. మొదట ఓ ప్రాంతీయ భాషలో విడుదలై విజయం సాధిస్తే తర్వాత కాలంలో ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడం లేదా రీమేక్ చేయడం సినిమా తొలినాళ్ల నుంచి వస్తున్నదే. సౌతిండియన్ డబ్బింగ్, రీమేక్ చిత్రాలకు 1970–80ల నుంచి డిమాండ్ పెరగింది. ఈ మధ్య కాలంలో సౌతిండియన్ సినిమాల్లో దాదాపు అన్నింటినీ హిందీలోకి డబ్ చేస్తున్నారు. ఆ విధంగా దక్షిణాది హీరోలందరూ హిందీ ప్రేక్షకులకు తెలిసిన ముఖాలే! ఈ విధంగా చేయటం దాదాపుగా 2010 నుంచి ఊపందుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, గోపీచంద్, రామ్‌చరణ్, రానా, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్, నాని, సాయిధరమ్ తేజలతో పాటు దాదాపు అందరు తెలుగు హీరోలకు హిందీ డబ్బింగ్ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక నూతన చిత్రం ప్రారంభమవుతుంది అని ఎనౌన్స్మెంట్ రాగానే అదేరోజు కోట్లు వెచ్చించి ఆ హీరో రేంజ్‌ను బట్టి సినిమాకు ఆఫర్లు ఇస్తున్నారు హిందీ డబ్బింగ్ సినిమా నిర్మాతలు. ఆ తర్వాత ఈ సినిమాలను వివిధ మాధ్యమాల ద్వారా టీవీల్లో చూడటానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఆ విధంగా భాషతో సంబంధం లేకుండా అందరు నటులు దేశమంతా ఇప్పుడు చిరపరిచితులే. కొత్తగా మూడు, నాలుగేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎంటర్టైన్మెంట్ రంగంలో రాజ్యమేలుతున్నాయి. వీటి ద్వారా సినీ అభిమానులు అన్ని భాషల్లోని సినిమాలను వదిలి పెట్టకుండా చూస్తున్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మన హీరోలందరికీ భవిష్యత్తులో పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎటొచ్చి ఒక భాషలో సినిమాను విడుదల చేస్తే అయ్యే ఖర్చుకు దాదాపు మూడొంతుల అదనపు ఖర్చులు మార్కెటింగ్ రూపంలో ఎదురవుతాయి. రామ్‌చరణ్–ఎన్టీఆర్ రామ్‌చరణ్ ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి 2013లోనే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘ముంబై కా హీరో...’ అనే పాటను కూడా పాడి హిందీలో తన ఆరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగులో ‘తుఫాన్’గా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాను రాజమౌళి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంతరించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్, చెర్రీ పాన్ ఇండియా స్టార్స్‌గా మారతారు అనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ అల్లు అర్జున్ సినిమాలన్నీ దాదాపు హిందీలోకి డబ్బింగ్ జరుపుకుని, కోట్లాది వ్యూస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. మారిన వ్యాపార సమీకరణాలతో లెక్కల మాస్టర్ సుకుమార్‌తో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నారు బన్నీ. ‘పుష్ప’ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు అర్జున్. రీసెంట్గా తాను హీరోగా నటించిన ‘అల..వైకుంఠపురంలో’ సినిమాను కోట్లాదిమంది వీక్షించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఇండియన్ టాప్‌టెన్ మూవీస్ లిస్ట్‌లో కొనసాగుతోంది. పాన్ఇండియా రేంజ్లో కూడా అల్లు వారబ్బాయి స్టైలిష్ స్టార్ అనిపించుకుంటాడో లేదో చూద్దాం మరి. అహం బ్రహ్మస్మిః మంచు మనోజ్ కొంతకాలం గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మస్మిః’. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో చిత్రీకరణ జరుపుకుని పాన్ఇండియా సినిమాగా విడుదల చేస్తామని మనోజ్ ప్రకటించారు. హీరో ఆది సాయికుమార్ కూడా ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. పాన్ ఇండియా దర్శకులు సినిమా వ్యాపారాత్మకమైన కళ. ఓ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలని రూలేం ఉండదు. హీరో మార్కెట్ స్థాయిని బట్టి సినిమాకు డబ్బు ఖర్చు చేయటానికి చూస్తారు నిర్మాతలు. ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవడమే కొంత రిస్కుతో కూడిన వ్యవహారం. నిర్మాతలకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో మణిరత్నం తన సినిమాలను ఒకటికి మించిన భాషల్లో పలుచోట్ల విడుదల చేయడం ఇదివరకే ప్రారంభించారు. మరో తమిళ దర్శకుడు శంకర్‌ది కూడా ఇదే పంథా. ఎస్‌ఎస్‌రాజమౌళి, పూరీజగన్నాథ్, కొరటాలశివ, నాగఅశ్విన్, సుజిత్, రాధాకృష్ణ ఈ తెలుగుదర్శకులతో పాటు ఎంతోమంది తెలుగు దర్శకులు పాన్ ఇండియా బావుటా ఎగరవేయనున్నారు భవిష్యత్తులో. కమల్–రజనీ దక్షిణ భారతవేశంలోని నటుల్లో మొదటి పాన్ ఇండియా స్టార్ కమల్‌హాసన్ అనే చెప్పాలి. కమల్ డైరెక్ట్‌గా తమిళంతో పాటు, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో నటించి ‘లోకనాయకన్’ బిరుదును సొంతం చేసుకున్నారు. గత 45ఏళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తునే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్ చేస్తున్నారు. ఆయన కోవలోనే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నార్త్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తాను శంకర్ దర్శకత్వంలో చేసిన ‘రోబో’, ‘శివాజీ’, ‘రోబో2’ చిత్రాలు పాన్ఇండియా సినిమాలే! ఇక నుంచి వీరద్దరివీ రిలీజ్ అవబోయే సినిమాలన్నీ పాన్ ఇండియాసినిమాలే... విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో తెరపైకి బుల్లెట్లా దూసుకొచ్చిన నటుడు విజయ్ దేవరకొండ. తన నటనతో, యాసతో చాలా తొందరగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బాలీవుడ్లో కూడా ఈయన పేరు అందరికీ పరిచయమే. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ‘కబీర్‌సింగ్’ సినిమాకు మాతృక తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’ అని అక్కడి ప్రేక్షకులకు తెలుసు. తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగానే ‘కబీర్‌సింగ్’నూ తెరకెక్కించారు. రెండుచోట్లా ఆ సినిమా పెద్దవిజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఏకకాలంలో దేశమంతా విడుదలవ్వబోతోంది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చార్మీ ‘ఫైటర్’ గురించి మాట్లాడతూ–ఇకపై తమ బ్యానర్లో నిర్మించే ప్రతిచిత్రాన్నీ పాన్ ఇండియా సినిమాగా తీస్తామని, ముఖ్యంగా పూరీ దర్శకత్వంలో వచ్చే అన్ని సినిమాలనూ దేశమంతా చూసేలా నిర్మిస్తామని అన్నారు. ‘ఫైటర్’గా విజయ్‌దేవరకొండ బాలీవుడ్లో ఇచ్చే ఎంట్రీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాతో వచ్చే మార్కెట్‌ను బట్టి తన తర్వాత సినిమాలను పాన్ ఇండియా చిత్రాలుగా విజయ్ మార్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. రానా రానా తెలుగు హీరోనే అయినా, అన్ని భాషల సినిమాల్లోనూ నటిస్తూ దేశమంతా తిరుగుతుంటారు. ‘బాహుబలి’ చిత్రంలో ఆయన పోషించిన భల్లాలదేవ పాత్రతో ప్రపంచం మొత్తం చుట్టేశారు. ‘హాథీ మేరే సాథీ’ అని హిందీలో ‘అరణ్య’ అని తెలుగులో రానా చేసిన పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే గుణశేఖర్ దర్శకుడిగా ‘హిర ణ్యకశప’ అనే మైథలాజికల్ కథతో ఓ సినిమా చేస్తున్నారు రానా. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా విడుదల చేస్తారు. తన మరో చిత్రం ‘విరాటపర్వం’ సినిమాను మాత్రం తెలుగులోనే విడుదల చేస్తారట. హీరోయిన్ల హవా పాన్ ఇండియా సినిమాలనగానే హీరోయిన్ల హవా కూడా బాగానే ఉంటుంది. ‘బాహుబలి’లో అనుష్క, తమన్నాలు తమ పాత్రలతో కనువిందు చేసి ఔరా అనిపించుకున్నారు. ‘సాహో’ సినిమాతో తెలుగు సినిమాకి సూపర్ ఎంట్రీ ఇచ్చారు శ్రద్ధాకపూర్. ఆ చిత్రంలోనే స్పెషల్‌సాంగ్ ఎంట్రీ ఇచ్చి సినిమాకి రిచ్‌నెస్‌ను తీసుకొచ్చారు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘సైరా’ చిత్రంలోని ఎంట్రీసీన్ను, ఎండ్సీన్ను రుద్రమదేవి పాత్రలో అనుష్క మెరిపించగా, నరసింహారెడ్డి భార్య పాత్రను నయనతార, ప్రేయసి పాత్రను తమన్నా పోషించారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’సినిమాలోనూ, కమలహాసన్‌కి జోడీగానూ కాజల్ రెండు పాన్ఇండియా సినిమాల్లోనూ నటిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ రామరాజు పక్కన సీత పాత్రలో ఒదిగిపోవటానికి రెడీ అయ్యారు. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’లో బాలీవుడ్, టాలీవుడ్‌కు పరిచితురాలైన పూజాహెగ్డే కాథానాయిక. రాబోయే చిత్రాల్లో నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసే సైంటిఫిక్ థ్రిల్లర్‌లో దీపికా పదుకొనేని ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. అల్లు అర్జున్ సరసన రష్మికా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలుగు సినిమా హీరోలందరూ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా సినిమాల బాట పట్టారు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో శుభపరిణామం. థ్యాంక్స్ టు ‘బాహుబలి’. అప్పట్లో మణిరత్నం తీసిన ‘రోజా’, ‘బొంబాయి’ పాన్ ఇండియా సినిమాలే. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కూడా చాలావరకు పాన్ ఇండియా చిత్రాలే. ఏదేమైనా ‘బాహుబలి’ చిత్రం గేమ్ చేంజర్ అని చెప్పాలి. - జాగర్లమూడి రాధాకృష్ణ -
నాగశౌర్య, సందీప్ కిషన్‌లకు గాయాలు
ఆరిలోవ (విశాఖ తూర్పు)/ కర్నూలు సీక్యాంప్: రెండు సినిమా చిత్రీకరణల్లో ఇద్దరు తెలుగు హీరోలు నాగశౌర్య, సందీప్ కిషన్ గాయాలపాలయ్యారు. విశాఖ, కర్నూలు జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లా ఆరిలోవలో షూటింగ్ చేయడానికి హీరో నాగశౌర్య, చిత్ర బృందం శుక్రవారం అక్కడికి చేరుకుంది. అదే రోజు అంబేడ్కర్‌నగర్‌లో రెండు అంతస్తులు ఉండే ఓ భవనం పైనుంచి హీరో నాగశౌర్య కిందకు దూకే సీన్ చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పి ఆయనకు కాలు బెణికింది. పెద్దగా వాపు వచ్చి నడవలేకపోవడంతో వెంటనే షూటింగ్ బృందం నాగశౌర్యను హెల్త్‌సిటీలో ఉన్న పినాకిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కాలుకు కట్టువేసిన వైద్యులు సుమారు 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వారం రోజులుగా కర్నూలు నగరంలో సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ జరుగుతోంది. శనివారం బాంబ్ బ్లాస్టింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల సందీప్ కిషన్ ఛాతీ, కుడిచేతిపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడి సిబ్బంది సందీప్‌ను నగరంలోని మైక్యూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలో హీరోల దోపిడీ ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో ఒక సినిమా వందకోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో రూ. 50 కోట్లు హీరోలే తీసుకుంటున్నారని వాపోయారు. కానీ తెలుగు హీరోలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, రూ.15 కోట్లు ఇచ్చినా సినిమా చేస్తారని అన్నారు. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం అంతుకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ పద్దతి తమిళంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానవేల్ రాజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోల మద్య తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుహీరోల్లాగే తమిళ హీరోలు కూడా దారికి రాకపోతే తమిళ సినిమాలు మానేస్తానంటూ హెచ్చరించారు. తమిళ పరిశ్రమలో హీరోలకు, నిర్మాతలకు ఎప్పుడు కెమిస్ట్రీ కలవదని అన్నారు. తనకు హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందని.. పూర్తిగా టాలీవుడ్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, ఇంకా తమిళ సినిమాలు చేసి చేతులు కాల్చుకోలేనని తేల్చి చెప్పారు. తెలుగు సినమాలు చాలా రిచ్‌గా ఉంటాయని అందుకే ఉత్తరాదిన వాటికి మంచి డిమాండ్ ఉందని జ్ఞానవేల్ రాజ వ్యాఖ్యానించారు. -
‘తెలుగు హీరోలకి తెలివి లేదు..'
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా హీరోలపై ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలకి తెలివి, ధైర్యం, శక్తి లేదని, వారంతా నిజ జీవితంలో కుక్కను చూస్తే కూడా పారిపోతారని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన బాషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇస్తే ఏమీ కాదని లేదంటే గుడిసెలు వేయిస్తానని హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆకృత్యాలపై ప్రభుత్వం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో కనిపించని వివక్ష దోపీడి కొనసాగుతుందని కృష్ణయ్య మండిపడ్డారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు ఇండస్ట్రీకి సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. స్టూడియోలలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సినీ కళాకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని కృష్ణయ్య పేర్కొన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే బలమైన సాధనం సినిమా అని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. కానీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తెరవెనుక చేస్తున్న అఘాయిత్యాలు సినీ ఇండస్ట్రీకి సిగ్గుచేటని మండిపడ్డారు. పరిశ్రమలో జరుగుతున్న దారుణాలను పట్టించుకోవాల్సిన సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపులేదని కృష్ణయ్య విమర్శించారు. -
శ్రీదివ్యపై దుష్ర్పచారం
నటి శ్రీ దివ్య అంటే గిట్టని వాళ్లు, ఆమె ఎదుగుదలను భరించలేనివారు ఆమెపై దుష్ర్పచారంతో దాడికి దిగుతారట. పదహారణాల తెలుగమ్మాయి శ్రీదివ్య. కోలీవుడ్‌లో మొదట విడుదలైన వరుత్త పడాద వాలిబర్ సంఘంతో విజయాన్ని అందిపుచ్చుకున్న ఈ భామ ఆ తరువాత జీవా, వెళ్లక్కార దురై వంటి చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ పలు అవకాశాలను దక్కించుకుంటూ వెళుతున్నారు. గ్లామర్ విషయంలో హద్దులు విధించుకుంటూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటున్న శ్రీదివ్య నటుడు అధర్వతో జత కట్టిన ఈటి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో శ్రీ దివ్య కళాశాల విద్యార్థినిగా నటించారు. అదే విధంగా త్వరలో కార్తీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నటుడు శివకార్తికేయన్‌తో ఒక చిత్రంతో పాటు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీదివ్యపై కొందరు పని కట్టుకుని మరి దుష్ర్పచారం చేస్తున్నారట. చూడటానికి చిన్నమ్మాయిలా కనిపించినా శ్రీ దివ్య వయసు 28 ఏళ్లు అని, ఆ విధంగా చూస్తే యువ నటి కాదని, తమిళ హీరోల కంటే తెలుగు హీరోలతో డ్యూయెట్లు పాడటానికే ఆసక్తి చూపిస్తారని, అక్కడ అవకాశాలు వస్తే తమిళ చిత్ర పరిశ్రమ వైపే చూడరంటూ దుష్ర్పచారాలను చేస్తున్నారట. అయితే ఇవన్నీ ఈ చెవిలో విని ఆ చెవి ద్వారా వదిలేస్తున్నారట శ్రీదివ్య. పండ్లున్న చెట్టుకే రాళ్లన్న చందాన క్యాజువల్‌గా తీసుకుంటున్నారట. -
తెలుగు హీరోలు కూడా మారిపోతున్నారు!
మన హీరోలలో కూడా మార్పు వస్తోంది. వారు కూడా కాలానుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఈ మార్పు బాలీవుడ్, కోలివుడ్లతో పోల్చుకుంటే చాలా నిదానంగా జరుగుతోంది. హిందీ, తమిళం, మళయాల హీరోలు మూస చిత్రాలకు చాలా వరకు స్వస్తి పలికారు. మల్టీస్టార్ చిత్రాలలో నటిస్తున్నారు. కథలలో కొత్తదనంతోపాటు, ఎటువంటి పాత్రనైనా చేస్తున్నారు. జనం మెప్పు పొందుతున్నారు. మన హీరోలు కూడా అదేబాటలోకి వెళుతున్నారు. హీరోలలో మార్పు తప్పనిసరిగా రావలసిన అవసరం ఏర్పడింది. తెలుగు సినిమా రంగంలో కూడా హీరోలు కాస్త ఆలస్యంగానైనా అది గుర్తించారు. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మూస కొట్టుడు తగ్గింది. ఎప్పుడూ ఒకే మూసలో పోతే ప్రేక్షకులు హర్షించరని మనవాళ్లకి అర్ధమైపోయింది. అందుకే స్టార్ హీరోలు కూడా రూటు మార్చుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా రూపురేఖలు మారే అవకాశం ఉంది. కొత్తకొత్త కథలతోపాటు, కొత్త పాత్రలు కూడా తెలుగుతెరపై కనిపించడానికి వీలవుతుంది. మన తెలుగు హీరోలు కూడా బాలీవుడ్, కోలీవుడ్ తరహాలో ప్రయోగాలు చేయటానికి ఏమాత్రం వెనుకాడటంలేదు. టాప్ హీరోలగా వెలిగిపోతోన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునలతోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, నాగ చైతన్య, రాణా వంటి యంగ్ హీరోలు కూడా మల్టీస్టారర్ చిత్రాలలో నటించడానికి సై అంటున్నారు. హీరోగా పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన సాయి కుమార్ విలన్‌గా నటించి మెప్పించారు. ఇప్పుడు మరో హీరో జగపతి బాబు కూడా విలన్‌గా నటిస్తున్నారు. హీరోలు కూడా నటనకు ప్రాధాన్యత ఇచ్చి విభిన్న తరహా పాత్రలలో నటించడం టాలీవుడ్లో ఓ శుభపరిణామంగా భావించవచ్చు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్-మహేష్ బాబు నటించారు. అది బంపర్ హిట్ అయింది. మసాలా సినిమాలో వెంకటేష్-రామ్ నటించారు. మంచు ఫ్యామిలీ ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లతోపాటు తనీష్, వరుణ్ సందేశ్ నటించారు. అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ - వెంకటేష్, పవన్ కళ్యాణ్-మహేష్ బాబులు కూడా త్వరలో మల్టీస్టార్ చిత్రాలలో నటించబోతున్నట్లు సమాచారం. మహేష్ లాంటి స్టార్ హీరోలు కూడా వేరే హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించే లెజెండ్ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు మరో చిత్రంలో హీరోకు అన్నగా కూడా నటించబోతున్నారు. అలాగే హీరో రాజశేఖర్ కూడా ఒక చిత్రంలో హీరోకు అన్నగా నటించబోతున్నట్లు సమాచారం. కథలు బాగున్న పరభాషా సినిమాలను తెలుగులోకి తెస్తున్నారు. వెంకటేష్ దృశ్యం అనే మళయాల సినిమా రీమేక్‌లో నటించబోతున్నారు. ఇవి మన హీరోల్లో వచ్చిన మార్పుకి నిదర్శనంగా భావించవచ్చు. s.nagarjuna@sakshi.com