
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని, రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన బీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ సారైనా అధిక నిధులు కేటాయించాలని కోరారు. కులవృత్తుల ఫెడరేషన్‌లకు ఒక్కోదానికి జనాభా నిష్పత్తిలో రూ.250 కోట్లు కేటాయించాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో జనాభా ప్రకారం లబ్ధిదారుల్లో 52 శాతం బీసీలను ఎంపికచేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌లకు ఏటా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సమస్యలపై చర్చించడానికి మార్చి 7న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ నాయకులు ఏడుకొండలు, బీరయ్యయాదవ్, అనిల్‌కుమార్, రామలింగం, రాజు, శ్రీనివాస్, శ్రీధర్, కృష్ణ, రాజేందర్, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment