
బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది.
సాక్షి, తిరుపతి: బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యపై రాయి దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పేడు మండల కేంద్రంలో కృష్ణయ్య ప్రసంగిస్తున్న సమయంలో ఓ అగంతకుడు వెనుక నుంచి రాయి విసరడంతో ఆయన వీపునకు తగిలి గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ.. ఇలాంటి రాళ్ల దాడికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్ వైపు ఉన్నారని తెలిపారు. పేదలకు మేలు చేస్తున్న జగన్‌కు బీసీలు అండగా నిలుద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు.