
సాక్షి,న్యూఢిల్లీ:రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ స్రెటేరియట్ మంగళవారం(సెప్టెంబర్24) నోటిఫై చేసింది.
బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై కృష్ణయ్య స్పందించలేదు.