గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఏపీపీఎస్సీ మే లో నిర్వహించబోయే గ్రూప్–2 మెయిన్ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–2 పోస్టులను పెంచాలని, మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నీల వేంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్–2 నిరుద్యోగుల పాలిట శాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్. కష్ణయ్య మాట్లాడుతూ.... గ్రూప్–2లో 4వేలు ఖాళీలు ఉండగా కేవలం 900 పోస్టులు భర్తీ చేస్తే సరిపోదని, గ్రూప్–2 పోస్టులను 900 నుంచి 4వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం మెయిన్ పరీక్షలకు 5నెలల సమయం ఇస్తారు కానీ ఈ ధఫా కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తే నిరుద్యోగులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. ఏపీ నిరుద్యోగ యువత ఆరేళ్లుగా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారని కానీ గ్రూప్–2 నూతన పరీక్ష విధానం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ఆన్‌లైన్ పరీక్ష విధానం వల్ల కొంతమంది గ్రామీణ విద్యార్థులు ఉద్యోగ అవకాశం కోల్పోతున్నారని అన్నారు. అనంతరం ఏపీపీఎస్సీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
‘ఏపీ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలి’
Published Thu, Apr 27 2017 8:00 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
Advertisement
Advertisement