ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులు
పాత ‘గ్రూప్–2’ పద్ధతిలోనే పరీక్ష జరగాలి
Published Fri, Oct 14 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రూప్–2 పరీక్షలను పాత విధానంలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గ్రూప్–2 పరీక్షలను గతంలో నిర్వహించిన విధంగానే జరపాలని కోరుతూ నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. వీరికి సంఘీభావం పలికిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలు సరికాదని అన్నారు. గ్రూప్–2 పరీక్షల విధానంలో నెగిటివ్ మార్కుల పద్ధతిని రద్దు చేయాలని, క్వాలిఫై అయిన అభ్యర్థులను ఒక పోస్టుకు 15 మంది నిష్పత్తిలో ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు.
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అర్థం లేని విధానాలతో పరీక్షల విధానాన్ని మరింత జఠిలంగా మారుస్తున్నారని అరోపించారు. సీనియర్ న్యాయవాది వైకే మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నూతనంగా అమల్లోకి తెచ్చిన విధానాలతో నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడం అత్యంత కష్టసాధ్యం కానుందని అన్నారు. నిరుద్యోగ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిరుద్యోగుల వయో పరిమితి 52 ఏళ్ళకు పెంపుదల చేసి గ్రూప్–2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 2,600కు పెంచి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాగ్‌లాగ్ పోస్టులతో పాటు 6,250 కానిస్టేబుల్, ఎసై ్స పోస్టులను భర్తీ చేయాలన్నారు.
Advertisement
Advertisement