old method
-
పాత ‘గ్రూప్–2’ పద్ధతిలోనే పరీక్ష జరగాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రూప్–2 పరీక్షలను పాత విధానంలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గ్రూప్–2 పరీక్షలను గతంలో నిర్వహించిన విధంగానే జరపాలని కోరుతూ నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. వీరికి సంఘీభావం పలికిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలు సరికాదని అన్నారు. గ్రూప్–2 పరీక్షల విధానంలో నెగిటివ్ మార్కుల పద్ధతిని రద్దు చేయాలని, క్వాలిఫై అయిన అభ్యర్థులను ఒక పోస్టుకు 15 మంది నిష్పత్తిలో ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అర్థం లేని విధానాలతో పరీక్షల విధానాన్ని మరింత జఠిలంగా మారుస్తున్నారని అరోపించారు. సీనియర్ న్యాయవాది వైకే మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నూతనంగా అమల్లోకి తెచ్చిన విధానాలతో నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడం అత్యంత కష్టసాధ్యం కానుందని అన్నారు. నిరుద్యోగ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిరుద్యోగుల వయో పరిమితి 52 ఏళ్ళకు పెంపుదల చేసి గ్రూప్–2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 2,600కు పెంచి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాగ్‌లాగ్ పోస్టులతో పాటు 6,250 కానిస్టేబుల్, ఎసై ్స పోస్టులను భర్తీ చేయాలన్నారు. -
అదే చుక్క.. అదే కిక్కు
‘కొత్తసీసా.. పాత సారా’ చందంగా నూతన మద్యం పాలసీ షాపుల కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంపు కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రేవరీల ఏర్పాటు మెడికల్ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జిల్లాకో డీ-ఎడిక్షన్ సెంటర్ గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీని పరిశీలిస్తే ‘ కొత్త సీసాలో పాత సారా’ అన్న చందంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు తమిళనాడు, కర్ణాటక తరహా మద్యం విధానాన్ని తెస్తామని చెపుతూ వచ్చిన ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన మద్యం సిండికేట్ల ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం విధానం మేరకు ఇక పల్లెల్లో మద్యం ఏరులై పారనుంది. గతంలో ఐదు శ్లాబ్లుగా విభజించి మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు నిర్ణయించగా, ఈసారి ఏడు శ్లాబ్‌లకు పెంచి లెసైన్స్ ఫీజులు నిర్ణయించారు. గతంలో మాదిరిగానే లాటరీ విధానంలో షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ఏడాది షాపు దక్కించుకున్న వారికి ఒక్క సంవత్సరం మాత్ర మే సమయం ఉండేది, ఈ సారి కాలపరిమితిని రెండేళ్లకు పెంచింది. ప్రతి కార్పొరేషన్ పరిధిలో మైక్రోబ్రేవరీలు ఏర్పాటుకు వీలుంటుంది. ఇది తెలుగు తమ్ముళ్లకు వరంగా మారనుందని భావిస్తున్నారు. లెసైన్స్ దుకాణాలను బట్టి 10 శాతం వరకు ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ప్రభుత్వం 34 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా ఉండేలా ప్రతి మూడు దుకాణాల మధ్య ప్రభుత్వం ఓ మద్యం దుకాణం ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మరో వైపు ప్రతి జిల్లా కేంద్రంలో మద్యానికి బానిసలు అయ్యే వారి కోసం మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ తరఫున ఉచిత డీ-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, ప్రస్తుతం అందులో 250 దుకాణాల వరకు అధికార పార్టీ నేతలకు చెందినవి కావడం, మిగతా వాటిని కూడా నయానో భయానో తమ సొంతం చేసుకుని మద్యం సిండికేట్ల హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇందులో 29 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని మద్యం డిపోల వద్ద ప్రభుత్వ అవుట్లెట్లు పెట్టి మద్యం విక్రయాలు జరపాల్సి ఉండగా, మద్యం సిండికేట్ దారుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తెరిచిన దాఖలాలు లేవు. మూడు దుకాణాలను తెరవలేని ఎక్సైజ్ అధికారులు జిల్లాలో 34 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎలా నడపగలరో వేచి చూడాల్సిందే. -
'పాత పద్ధతిలోనే ధాన్యం సేకరణ'
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ విధానాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వైఎస్సార్సీపీకి చెందిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం ఆయన లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘దేశంలోని 60 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా రైతులు తమ ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్ముకోవాలనుకుంటున్నారు. అక్కడైతే కనీస మద్దతు ధర లభిస్తుందని వారి ఆశ. అయితే ప్రస్తుతం ఉన్న లెవీ విధానం ద్వారా ధాన్యాన్ని సేకరించే పద్ధతికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే కనుక అమలైతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మిల్లర్లు, వర్తకుల నుంచి కనీస మద్దతు ధర లభించే పరిస్థితి ఉండదు. ఇది రాష్ట్రాలపైనా పెను ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎక్కువగా పండించే రాష్ట్రాలపైన, ఎక్కువ వినియోగం ఉండే రాష్ట్రాలపైన ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అవి పండించే ధాన్యంలో దాదాపు 80 శాతాన్ని వినియోగించుకుంటాయి. ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ధాన్యాన్ని పండించుకున్నప్పటికీ.. ఎక్కువగా వినియోగించుకోవు. అలాగే పశ్చిమబెంగాల్, అస్సాం, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఒడిశా, తదితర రాష్ట్రాలపైనా ప్రతిపాదిత విధానం ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ తాజా యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. అలాగే 75 శాతం వరకు రైతుల నుంచే సేకరించేలా పాత నిబంధనలను కొనసాగించాలి..’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పాత పద్ధతిలోనే ప్రవేశాలు
ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై ప్రవేశాల కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. తొలుత జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు భర్తీ విధానాన్ని ఖరారు చేశారు. మేనేజ్మెంట్ కోటా భర్తీ విధివిధానాలను మేనేజ్మెంట్లకు తెలియజేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినందున, ఈనెల 28న కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, ప్రవేశాల క్యాంపు ముఖ్య అధికారి రఘునాథ్, ఏఎఫ్ఆర్సీ నుంచి బాలసుబ్రహ్మణ్యం, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇదీ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విధానం... గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్ఆర్ఐ కోటా 5 శాతమే ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దానిని 15 శాతానికి పెంచుతున్నారు. అయితే ఇందులో కేవలం ఎన్ఆర్ఐ కోటానే కాకుండా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా పేరును చేర్చాలని, తద్వారా స్పాన్సర్డ్ కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే విమర్శలు వస్తాయనే ఆలోచనతో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాకు కమిటీ నిరాకరించింది. - ఈసారి 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలో నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్మెంట్ కోటాలోకి వెళతాయి. - మిగిలిన 15 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. - మొత్తం మేనేజ్మెంట్ కోటాను ఇంటర్ మార్కులతోనే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలన్న యాజమాన్యాల డిమాండ్లకు ఉన్నత స్థాయి కమిటీ మొదట్లో తలొగ్గి, ఆ అంశంపై చర్చించింది. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. -
ఈసారి పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈసారి కూడా పాత పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేసి తీరుతామని గత నాలుగేళ్లుగా చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు మరోమారు కార్పొరేట్ కాలేజీలకు తలొగ్గింది. ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ బోర్డు అమలు చేయటం లేదు. 2009 నుంచి జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ వస్తున్న విషయం విదితమే. కాగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 12 నుంచి 29 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు.