ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈసారి కూడా పాత పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేసి తీరుతామని గత నాలుగేళ్లుగా చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు మరోమారు కార్పొరేట్ కాలేజీలకు తలొగ్గింది. ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ బోర్డు అమలు చేయటం లేదు. 2009 నుంచి జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ వస్తున్న విషయం విదితమే.
కాగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 12 నుంచి 29 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు.
ఈసారి పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
Published Mon, Nov 11 2013 10:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement
Advertisement