practicals exams
-
DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాల వెల్లడిలో థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్‌కు వర్తింపజేయొద్దని సీబీఎస్ఈకి ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) సూచించింది. ఆ విధంగా చేయడం సీబీఎస్ఈ సొంత పాలసీకి విరుద్ధమని పేర్కొంది. 12వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై డీసీపీసీఆర్ ఈ మేరకు స్పందించింది. పరీక్ష కేంద్రం పొరపాటు వల్ల తన కుమారుడు 2019–20లో గణితం ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానట్లు నమోదయిందని, అసెస్మెంట్లో 20కుగానూ 17 మార్కులు వచ్చాయని విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. అయితే ప్రొ–రాటా (నిష్పత్తి) ప్రకారం 20కు నాలుగు మార్కులు మాత్రమే ఇస్తున్నట్లు సీబీఎస్ఈ రీజినల్ డైరెక్టర్ చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడం సీబీఎస్ఈ పాత్ర. పరిధికి మించి అధికారాలు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం’’అని డీసీపీసీఆర్ ఛైర్పర్సన్ అనురాగ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. డీసీపీసీఆర్–2005 చట్టం ప్రకారం.. విద్యార్థి పరీక్షకు హాజరైనప్పటికీ అబ్సెంట్‌గా నమోదు చేయడం వల్ల విద్యార్థి నష్టపోవడమే కాదు అతడి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ గ్రేడ్లు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మార్చడం కుదరదని, విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా హాజరు సరిదిద్దే క్రమంలోనే ప్రొ–రాటా విధానం ప్రకారం ప్రాక్టికల్ మార్కులు లెక్కించి 20కు నాలుగు మార్కులు ఇచ్చినట్లు కమిషన్‌కు సీబీఎస్ఈ వివరించింది. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడో అన్ని మార్కులు ఇవ్వాలని, ప్రొ–రాటా విధానం ప్రకారం ఇవ్వరాదని డీసీపీసీఆర్ స్పష్టం చేసింది. మార్కులు తగిన విధంగా ఇవ్వడానికి సీబీఎస్ఈ పాలసీని సవరించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. సర్వీసు రూల్స్ ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. చదవండి: కోవిడ్‌తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి -
ఎక్కడి వారికి అక్కడే ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్‌ను తమ సమీపంలోని కాలేజీల్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. కరోనా అదుపులోకి రాకపోవడం, కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు పట్టణ ప్రాంతాల్లో 90 శాతం వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు ఉంటోందని గుర్తించింది. గత మూడు రోజులుగా యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించింది. ఆన్లైన్ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అప్పుడు సెమిస్టర్ పరీ క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా యాజమాన్యాల సంసిద్ధతపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది. జేఎన్టీయూ పరిధిలోని 180కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్లో 50 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రథమ సెమిస్టర్ విద్యార్థులు మినహా మిగతా ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే వారంతా ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీలున్న ప్రాంతాల్లో ఉండటం లేదు. కరోనా కారణంగా తమ తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి ఆన్లైన్ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠ్యాంశాల బోధన ఏ మేరకు పూర్తయిందన్న దానిపైనా యాజమాన్యాలతో సమీక్షించింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్ బాగానే అయినా, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగమే అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్ చేయడం వంటివి లేకుండా, వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోంది. షెడ్యూలు జారీ చేసిన వెంటనే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయా కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేయనుంది. -
ప్రమోగాలకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలుకానుంది.. ఈనెలాఖరు నుంచి ఒకదాని వెంట మరొకటి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్(విలువలు, మానవ సంబంధాలు) పరీక్ష, 30న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఏడాది నుంచి పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు ఇష్టారాజ్యంగా మార్కులు వేసే విధానానికి స్వస్తి పలికారు. అయితే, సరిపడా అధ్యాపకులను నియమించకపోగా.. ప్రాక్టికల్స్ కోసం సామాగ్రిని ఇవ్వకుండా ప్రాక్టికల్స్ పరీక్షలు విద్యార్థులు ఎలా రాయగలుగుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈసారి ప్రయోగ పరీక్షలు జరగనున్న కేంద్రా ల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేశారు. పరీక్షకు గంట ముందు ప్రశ్నాపత్రం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరగనున్న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలకు సంబందించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో ముఖ్యమైన ప్రశ్నలను అధ్యాపకులే ఎంపిక చేసి పరీక్ష నిర్వహించేవారు. ఈ కారణంగా పరీక్షలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేవి. అయితే, ఈ సంవత్సరం ఈ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు కళాశాల ప్రిన్సిపాల్ సెల్ ఫోన్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దీన్ని ఆధారంగా ఆన్లైన్లో ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏమేం ప్రశ్నలు వస్తాయనేది అధ్యాపకులకు సైతం అప్పటి వరకు తెలియదు. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు మాత్రమే మంచి మార్కులు వస్తాయని చెబుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 7,238 మంది జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 51 ప్రైవేట్ కళాశాలలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు 7,238 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హారుకానున్నారు. ఇందులో బైపీసీ విద్యార్థులు 4,005 మంది కాగా, ఎంపీసీ చదివే విద్యార్థులు 3,233 మంది ఉన్నారు. కాగా, ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్ విధానంలో కొద్ది సమయం ముందే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అవలంబించనుండగా.. ప్రతీ కేంద్రానికి ఓ పరిశీలకుడిని నియమిస్తారు. తద్వారా యాజమాన్యాల ప్రమేయం లేకుండా నిక్కచ్చిగా మార్కులు వేసే వెసలుబాటు కలగనుంది. ప్రాక్టికల్ సామాగ్రి లేక ఇబ్బందులు ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ పరీక్షలకు నిర్వహించేందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చలేదు. ఈక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పరికరాలలను ఇప్పటి వరకు ప్రభుత్వం అందించలేదు. అంతేకాకుండా రీ ఏజెంట్స్, లిక్విడ్ వంటి వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు కూడా ఇవ్వలేదు. ఇక ఒకేషనల్ కళాశాల, పారామెడికల్ కళాశాల విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలకు అనుమతించాలంటే పూర్తి స్థాయిలో వసతులు ఉండాలన్న అధికారులు.. ప్రైవేట్ కళాశాలల్లో ఎంత మేరకు వసతులు ఉన్నాయన్న విషయమై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాఠాలు చెప్పకుండానే పరీక్ష ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటర్మీడియట్ బోర్డు కమిటీ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరార్మెంట్ సబ్జెక్టులను చేర్చారు. కానీ ఈ సబ్జెక్టును బోధించేందుకు ఏ ప్రభుత్వ కళాశాలల్లో కూడా ప్రత్యేక అధ్యాపకులను నియమించలేదు. ఇక ప్రైవేట్ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వీటికి వచ్చిన మార్కులు ప్రత్యేకంగా మెమోలో సాధారణ సబ్జెక్టులతో కలపకపోయినా... మార్కలు తక్కువ వచ్చినా, హాజరుకాకపోయినా ఫెయిల్ అయినట్లే పరిగణిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టుల బోధన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. ఇప్పుడు పరీక్ష రాయాలని చెబుతుండడం గమనార్హం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో బోధించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను గతంలోనే ఆదేశించాం. అలాగే, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేశాం. గతంలో మాదిరిగా ప్రశ్నపత్రాన్ని ఇక్కడ తయారు చేయకుండా బోర్డు నుండే పంపిస్తారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండాపరీక్షలు నిర్వహిస్తాం. – వెంక్యానాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి -
ప్ర‘యోగం’ లేదు
జిల్లావ్యాప్తంగా పలు ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ విద్యార్థులు అసౌకర్యాల నడుమ ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. కొన్ని కళాశాలల్లో అవసరమైన సామగ్రి లేకపోవడం, మరి కొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాయచోటి రూరల్/కడప ఎడ్యుకేషన్: కొత్త ఆవిష్కరణలకు విద్యార్థి దశలోనే పునాది పడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంటర్లో ప్రయోగాత్మక విద్యను బోధించడం జరుగుతోంది. అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకపోవడం, పరికరాలు, రసాయనాలు కొనుగోలుకు నిధులు మంజూరు కాకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. దీంతో వీరికి ప్రయోగాత్మక విద్య దూరమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రయోగాలు అంతంత మాత్రంగానే సాగాయి. ప్రైవేటు కళాశాలల్లో కొంత వరకు ల్యాబ్‌లు, పరికరాలు ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల చెంతకు ప్రయోగాలు చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగానే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 18356 మంది హాజరుకానున్నారు. వారి కోసం 61 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ప్రాంతీయ ఇంటర్ విద్యాపర్యవేక్షణాధికారి ఎస్. రవి చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్‌లోనూ, పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తే తప్ప తదుపరి కోర్సుల్లో సీట్లు సాధించలేమన్న ఆలోచనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. రాయచోటి విషయానికి వస్తే సుమారు 3600 మంది వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారు. అందులో అధిక శాతం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మంది ప్రవేటు కళాశాలల్లో చదువుకుంటున్నారు. రాయచోటిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలికల జూనియర్ కాలేజీ, ఏఎన్ఎం అండ్ బీఆర్(ప్రతిభా) కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాల , సీఎన్ రాజు, కాకతీయ, అర్చన, ఎస్బీటీ, వీరభద్ర కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో పరికరాలు సరిగా లేకపోవడం, మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగా ఉండటం కనిపిస్తున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, ఇతర కళాశాలలల్లో వీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తారోనన్న భయం యాజమాన్యంలో నెలకొంది.జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలని గతంలో పలువురు డిమాండ్ చేయడం తెలిసిందే. ప్రాక్టికల్స్‌కు సిద్ధంగా ఉన్నాం అధ్యాపకులు గత కొంత కా లంగా కళాశాలలో ఉన్న ప్రయోగశాలలో మాకు ప్రాక్టికల్స్ నేర్పించారు. ప్రస్తుతం అన్ని ర కాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రారం భం కానున్న ప్రాక్టికల్స్‌కు సిద్ధంగా ఉన్నాం. -వీరాంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి, రాయచోటి సౌకర్యాలు ఉన్నాయి మాది పాత ప్రభుత్వ జూని యర్ కళాశాల. ఇక్కడ అన్ని రకాల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులకు అన్ని రకాల ప్రయోగాలను చెప్పడం జరిగింది. సిలబస్ పూర్తి చేసి, ప్రాక్టికల్స్‌కు పిల్లలను సిద్ధం చేశాం. –కె.కె. రావు, జువాలజీ అధ్యాపకులు , ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయచోటి ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం ఫిబ్బవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తాం. అన్ని సెంటర్లలో ప్రయోగశాలలు ఉన్నాయి. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రయోగశాలలు సరిగా లేని కళాశాలల విషయం మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్. రవి, ప్రాంతీయ ఇంటర్విద్యా పర్యవేక్షణాధికారి, వైఎస్సార్ జిల్లా -
ప్రాక్టికిల్స్..
ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ అంటేనే ప్రయోగాల కోర్సులు. రెండేళ్ల చదువు పూర్తి చేసేలోపు భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు పూర్తి చేయాలి. ప్రయోగశాలకు వెళ్లి నేర్చుకోవాలి. చెట్టు, పుట్ట వెంబడి తిరిగి ఆకులు, పువ్వులు, మొక్కలు సేకరించాలి. ఇంటిలో ఉన్న బొద్దింకలతో పాటు కప్పలు, ఎర్రలు (వానపాములు) పట్టుకొని శస్త్రచికిత్సలు చేయాలి.. బొమ్మలు గీయాలి... రికార్డులు రాయాలి.. అప్పుడే ప్రాక్టికల్స్‌కు సిద్ధమైనట్టు. లేకపోతే ఫెయిల్.. మరో ఏడాది వేచి ఉండి ప్రాక్టికల్స్ రాస్తేనే ఉత్తీర్ణత.. ఇదంతా ఒకప్పటి మాట.. మరి ఇప్పుడేం జరుగుతోందంటే.. సాక్షి, సిద్దిపేట కాలానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులొచ్చినా.. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు మారలేదు. అధ్యాపకులతో పాటు విద్యార్థులు ‘రెడీమేడ్’ ప్రయోగాలకు అలవాటు పడ్డారు. దానికి అనుగుణంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించడం మరిచిపోయారు. పరీక్షలకు వచ్చే పరిశీలకులు, డిపార్టుమెంట్ ఆఫీసర్‌ను మచ్చిక చేసుకొని తమ విద్యార్థులకు కావాల్సినన్ని మార్కులు వేయించే పనిలో పలు ప్రైవేట్ కళాలల యాజమాన్యాలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి నిర్వహించాలని ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ, 42 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 14 మోడల్ స్కూల్స్, 12 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ సంవత్సరంలో 12,101 మంది, ద్వితీయ సంవత్సరం 12,256 మొత్తం 24,357 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఈ ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 4,084 మంది ఎంపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), 1,675 మంది బైపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజి) ప్రాక్టికల్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఇప్పటి వరకు సగానికి పైగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ చేయించలేదనే ఆరోపణలున్నాయి. మేనేజ్ చేసుకోవడమే మార్గం విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించలేదు. కానీ తమ కళాశాల విద్యార్థులకు మాత్రం స్టేట్ ర్యాంకులు రావాలి. అందరూ ఉత్తీర్ణులు కావాలి. అంటే ఒక్కటే ఒక్క మార్గం. ప్రాక్టికల్స్ పరీక్షల కోసం వచ్చే పరిశీలకులు తమకు అనువైన వారు కావాలి. అందుకోసం బోర్డు వద్దకు వెళ్లైనా అనుకూలమైన వారితో డ్యూటీ వేయించుకునే ప్రయత్నాలను పలు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి నియమించే డిపార్టుమెంట్ అధికారిని కూడా తమకు అనుకూలమైన వారిని రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులకు ఏమీ తెలియకపోయినా.. నిర్దేశించిన మార్కులు వేయించుకోవచ్చనేది వారి ధీమా. అయితే ఇలా ఇంటర్లో అడ్డదారిన అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమకున్న థియరీ పరిజ్ఞానంతో ఐఐటీ, మెడికల్, ఇంజనీరింగ్‌లో సీట్లు పొందినా.. అక్కడ ప్రాక్టికల్స్ చేయడం రాక, తోటి విద్యార్థుల ముందు చులకన కావడం, అవమానంగా భావిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులను యంత్రం మాదిరిగా బట్టీ పట్టించి అధిక మార్కులు తెప్పిస్తున్నారని, ప్రాక్టికల్స్‌లో కూడిన బోధన లేకపోవడం విచారకరమని విద్యానిపుణులు అంటున్నారు. సాధారణ పరిజ్ఞానం కరువు పలువురు విద్యార్థులకు పిప్పెట్, బ్యూరెట్, ఘటం, ఆమ్లం, క్షారం, లవణం, వెర్నియర్ కాలిపస్, స్క్రూగేజీ, లఘులోలకం, అయస్కాంతం రకాలు, విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా ఏకదళ బీజం, ద్విదళ బీజం, కేసరాలు, అండాశయం, అంతర్ నిర్మాణాల గురించి అస్సలు తెలియని వారు కూడా ఉన్నారు. అదేవిధంగా జువాలజికి సంబంధించి డిటెక్షన్ అంటే తెలియదు. స్పెసిమిన్, స్లైడ్స్ గురించి అవగాహన లేనివారు ఉన్నట్లు పలువురు అధ్యాపకులే చెప్పడం విశేషం. దీంతో ఇటువంటి పరిస్థితిలో ఉన్న విద్యార్థులు రికార్డులు, హెర్బిరియం వంటికి రెడిమేడ్‌గా తీసుకువచ్చినా ప్రాక్టికల్స్ ఏం చేస్తారనేది ఆశ్చర్యకరమైన విషయం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై కళాశాలల యాజమాన్యాలకు సర్క్యులర్లు పంపించాం. ప్రరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. బోర్డు నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటాం. – నర్సింహులు, జిల్లా ఇంటర్ విద్యాధికారి -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి సామగ్రిని సంబంధిత డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేసేందుకు ఆర్ ఐవో కార్యాలయంలో భద్రపరిచారు. ఈ నెల 4న ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. థియరీ పరీక్షలకు గడువు దగ్గరపడుతుండడంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్స్‌తో పాటు ఎస్‌ఆర్‌లు, సెంటర్ఎన్ఆర్లు, బార్‌కోడ్స్ సూచనలతో కూడిన బుక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో వలే కాకుండా ఈసారి పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి మించి ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రం చేరుకోవాల్సి ఉంటుంది. 8.45 వరకు హాల్లోకి అనుమతిస్తారు. 9గంటల తర్వాత వచ్చే వారిని కేంద్రంలోకి అనుమతించరు. పెరిగిన 28 కేంద్రాలు ఇంటర్ పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా 141 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి మరో 28 కేంద్రాలు కొత్తగా పెరిగాయి. ఇందులో జిల్లావ్యాప్తంగా 23 ఆదర్శ పాఠశాలల్లో సైతం కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 141 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 141 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఈ సారి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను ప్రవేశపెట్టారు. ఆయా కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లు పరీక్ష సమయంలో ఎవరితో ఏమేమీ మాట్లాడారనే విషయాలన్నీ రికార్డు అవుతాయి. అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులు జీపీఎస్ ద్వారా రికార్డయిన వాయిస్‌ను పరిశీలించనున్నారు. ఏమైనా అక్రమాలు జరిగినట్లు వెల్లడైతే వెంటనే చర్యలు చేపట్టనున్నారు. 1,02,157 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 42,916 మంది, వృత్తివిద్య కోర్సులో 3642 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 39,744 మంది విద్యార్ధులు, ప్రైవేట్ విద్యార్ధులు 10,010 మంది , వృత్తి విద్యకోర్సుల్లో 4,376 మంది, ప్రైవేట్‌గా 1,469 మంది మొత్తం 1,02,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్, ఆర్ఐవో వారం రోజులుగా అన్ని విభాగాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. హాల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు విద్యార్థులకు హాల్టికెట్లివ్వకుండా వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, తాగునీటి సౌకర్యాలతోపాటు సెంటర్ల వరకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద ముందస్తుగా 144 సెక్షన్ విధించాం. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. -ఆర్ఐవో రమేశ్‌బాబు సమస్యలుంటే సంప్రదించండి. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే 0878-2241215, 9440593803, 9849500923 నంబర్లలో సంప్రదించవచ్చు. -
పాలిటెక్నిక్ కళాశాలలోపుట్టెడు సమస్యలు
జోగిపేట, న్యూస్‌లైన్: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలిక పద్ధతిన కొనసాగుతోంది. గదులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. టాయిలెట్స్ లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ల్యాబ్‌లు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సాగిస్తున్నారు. 2011 సంవత్సరంలో జోగిపేటకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం ఆ కళాశాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్, మెకానికల్, ఈసీఈలో మొత్తం 435 మంది విద్యార్థులున్నారు. కళాశాల ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సొంత భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని అందోల్ శివారులో గుర్తించినా నిధులు మంజూరు కాలేదు. పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. సాంకేతిక విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని ప్రభుత్వం అందించే క్రమంలో కంప్యూటర్ను కూడా వినియోగించుకోలేని దుస్థితి. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంబంధిత శాఖనే చూస్తున్నా నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం. మూడు కోర్సులను నిర్వహించేందుకు తొమ్మి ది తరగతి గదులు అవసరం ఉన్నా ప్రస్తుతం ఏడు గదులే ఉన్నాయి. కొత్త భవనం అందుబాటులోకి రాగానే మరో మూడు గదులు కేటాయిస్తామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హమీ ఇచ్చినట్టు సమాచారం. ప్రాక్టికల్స్‌కు మాసాబ్‌ట్యాంకు, జహీరాబాద్ వెళ్లాల్సిందే.. స్థానిక కళాశాలలో ల్యాబ్‌కు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం వంద కిలో మీటర్ల దూరంలోని జహీరాబాద్‌కు విద్యార్థులను పంపుతున్నారు. 10 నుంచి 15 రోజులపాటు అక్కడే ఉండి ఏడాదికి సంబంధించిన ప్రాకిక్టల్స్ను పూర్తి చేసుకొని వస్తున్నారు. జహీరాబాద్‌లో ఈసీఈ కోర్సు లేకపోవడంతో ఆ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌కు వెళ్లాల్సి వస్తుంది. పోస్టులన్నీ ఖాళీనే... పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్, లైబ్రరీయన్, పీడీ, సీనియర్ అసిస్టెంట్-2, జూనియర్ అసిస్టెంట్-2, ఎలక్ట్రికల్ ప్రధానశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ ప్రధానశాఖాధికారి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కేవలం నలుగురు రెగ్యులర్, పదిమంది పార్ట్‌టైం లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. -
ఈసారి పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈసారి కూడా పాత పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేసి తీరుతామని గత నాలుగేళ్లుగా చెబుతున్న ఇంటర్మీడియట్ బోర్డు మరోమారు కార్పొరేట్ కాలేజీలకు తలొగ్గింది. ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ బోర్డు అమలు చేయటం లేదు. 2009 నుంచి జంబ్లింగ్ విధానాన్ని ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ వస్తున్న విషయం విదితమే. కాగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు(ఐపీఈ-2014) వచ్చే మార్చి 12 నుంచి 29 వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు.