Group-2
-
కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగ యువతపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో నిరుద్యోగులేమైనా బిక్షగాళ్ళా? అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? ఉంటే ఎవరి కోసం పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు.‘‘ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వమంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా?. గ్రూప్-2 అభ్యర్థులను తీవ్ర కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులను బలిచేస్తారా?. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలికావాలా?. 40 ఏళ్ల సీనియర్.. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నా వినడం లేదంటాడు. సీఎం మాట ఏపీపీఎస్సీ ఛైర్మన్ వినకపోవడమేంటి?’’ అంటూ జూపూడి ప్రశ్నించారు.‘‘సీఎంగా చంద్రబాబు అన్ ఫిట్. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటున్నారు. లోపాలుంటే ఎందుకు సరిచేయలేకపోతున్నారు. వైఎస్ జగన్‌పై అపవాదు వేయాలని చూస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయ్యింది గాడిదలు కాస్తున్నారా? ఇన్ని రోజులూ. గందరగోళం సృష్టించడానికి కాదు.. మీకు అధికారం ఇచ్చింది. పది రోజుల నుంచి అభ్యర్ధుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరుసటిరోజు చంద్రబాబు ఆడియో లీక్ చేశారు. సీఎం మాట విననప్పుడు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను తక్షణమే ఆమెను తొలగించండి’’ అంటూ జూపూడి ప్రభాకర్ అన్నారు.ఇంత గందరగోళం నడుస్తుంటే.. ఏపీపీఎస్ ఛైర్మన్ ఎందుకు నోరువిప్పడం లేదు. వైఎస్ జగన్ బయటికెళితే కేసు. ఆయనకి సెక్యూరిటీ తీసేస్తారు. నిరుద్యోగుల తరపున మాట్లాడితే అరెస్టులు. చిన్న సమస్యకు పరిష్కారం చూపలేనోళ్లు పోలవరం కడతారంట. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీ స్వతంత్రంగా పనిచేసిన చరిత్ర లేదు. నిరుద్యోగులకు వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారు. నిరుద్యోగులు టెర్రరిస్టులు కాదు. ప్రభుత్వమే నిరుద్యోగుల గొంతు కోసేస్తే ఎలా?. నిరుద్యోగుల తరపున వైఎస్సార్సీపీ పోరాడుతుంది.. ఉద్యమాన్ని చేపడతాం. చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి’’ అని జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూపు-2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నియమించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నవి తొలగించటం అన్యాయం’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘గ్రూప్-2 అభ్యర్థలను నమ్మించి వారి గొంతు కోశారు. అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి వారి జీవితాలను నాశనం చేశారు. ఈరోజు 92,250 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. వారందరి జీవితాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెలగాటమాడారు. నిరుద్యోగుల జీవితాలను సీఎం చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్సీపీ తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’’ అని రవిచంద్ర హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ చిరంజీవికి నిరసన సెగ
విశాఖ: టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవికి నిరసన సెగ తగలింది. చిరంజీవికి వ్యతిరేకంగా గ్రూప్-2 అభ్యర్థుల నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ చిరింజీవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ విధానంపై చిరంజీవి మాట మార్చడంపై గ్రూప్-2 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలకు ముందు గ్రూప్ 2 అభ్యర్థులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఇలా మాట మార్చడంపై పెద్ద ఎత్తును నిరసన చేపట్టారు. నిన్న(గురువారం) టీడీపీ ఎంపీ భరత్ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రూప్ 2 అభ్యర్థులు.. ఈరోజు(శుక్రవారం) చిరంజీవికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. -
మార్చి ఆఖరులోగా ‘గ్రూప్స్’ తుది ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ‘గ్రూప్స్’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్–1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామని తెలిపారు. తర్వాత గ్రూప్–2 ఫలితాలు, వెనువెంటనే గ్రూప్–3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచి గ్రూప్–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు.పకడ్బందీగా ఏర్పాట్లుఈ నెల 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–1, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2, 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్–3, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు. 783 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారని వెల్లడించారు.గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశామని.. ప్రత్యక్షంగా 49,848 మంది, పరోక్షంగా మరో 25 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నాటికి 75 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు.ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన..టీజీపీఎస్సీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. ఈ నెల 18, 19 తేదీల్లో టీజీపీఎస్సీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 18న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను, మరుసటి రోజు స్టాఫ్ సెలెక్షన్కమిషన్(ఎస్ఎస్సీ), తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సందర్శిస్తామని చెప్పారు. పరీ క్షలను పారదర్శకంగా నిర్వహించే విధానాలపై అధ్యయ నం చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పిస్తామని తెలిపారు.వచ్చే నెలలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉందనితెలిపారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రకటిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించినది టీజీపీఎస్సీయేనని చెప్పారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నట్లు తెలిపారు. -
డిసెంబర్ 15,16న గ్రూప్–2 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.ఐదోసారి ప్రకటనవివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీలను ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్ మరో ప్రకటన చేసింది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్... గ్రూప్–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
గ్రూప్–2 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచేందుకు, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌లు నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు గ్రూప్–2 పరీక్షల వాయిదాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. చర్చల సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్లను సానుకూలంగా సానుకూలంగా ఆలకించిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు. 3 నెలల్లో 54 వేల ఉద్యోగాలకు మోక్షం: భట్టి గ్రూప్–2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని భట్టి చెప్పారు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అన్నారు. మరిన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ కేలండర్‌ను ప్రకటించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని వెల్లడించారు.ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఇప్పటికే స్థిరపడేవన్నారు. ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ, ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొందరు వారి స్వలాభం కోసం నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్ విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని భట్టి చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని, దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని చెప్పారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వం: ఎంపీలు గ్రూప్–2 పరీక్షల పోస్టులను పెంచుతూ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తెలిపారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంతో సమావేశం తర్వాత మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సమయం ఇవ్వాలి: గ్రూప్–2 అభ్యర్థులు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్–2 అభ్యర్థులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించారంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ పోస్టులను వీలైనంత వరకూ పెంచాలని, అలాగే పరీక్షలకు వీలైనంత సమయాన్ని ఇవ్వాలని విద్యార్థులు సుఖేష్ (సిద్దిపేట జిల్లా), నవీన్ (హుస్నాబాద్), మహేష్ (ఖమ్మం) కోరారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు కూడా చాలామంది గ్రూప్ పరీక్షలు రాస్తున్నారని, అందువల్ల కనీసం మూడు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ పరీక్షల కోసం రూ.5 భోజనం చేస్తూ సిద్ధమవుతున్నామని, ప్రభుత్వం నిరుద్యోగులపై కరుణ చూపించాలని కోరారు. -
గ్రూప్–2, గ్రూప్– 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్– 2, గ్రూప్–3 ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. శాఖల వారీగా గుర్తించిన గ్రూప్–2, గ్రూ ప్–3 ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమ ర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులను ఆదేశించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమో జారీ చేశారు. 2022 ఆగస్టు 30వ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈమేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఆగస్టు 2022 తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు, మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కా లంలో ఖాళీ కానున్న గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల వివరాలను గురువారం సాయంత్రం 5గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్‌ను ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ అధికారులు పంపించారు. కొత్త పోస్టులతో కొత్త ప్రకటనలు... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగ వంతం చేసింది. గ్రూప్–2 కేటగిరీలో 783 ఖాళీలుండగా... వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అదేవిధంగా గ్రూప్–3 కేటగిరీలో 1388 ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించనుంది. తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా... కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచాలా? అనే కోణంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. -
బాబు పథకాలపై 11కు పైగా ప్రశ్నలు
సాక్షి, అమరావతి 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ క్రింది వానిలో సాధారణ వేదిక? 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది? 3. చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు? 4. ‘పసుపు కుంకుమ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది? 5. చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి (రూ.లలో)... ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా? గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్–2లో అడిగిన ప్రశ్నలు. ఈ ఐదు ప్రశ్నలే కాదు నాటి గ్రూప్–2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై మొత్తం 11 ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యంగా 137 నుంచి 142 వరకు వరుసగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. చివరకు చంద్రబాబు తెచ్చిన అట్టర్ ఫ్లాప్ పథకం పసుపు–కుంకుమపైన కూడా ప్రశ్న ఇచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వడమేంటి అని నాడు ఎల్లో మీడియా ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే నాడు అధికారంలో ఉంది.. ఎల్లో మీడియాకు కావాల్సిన చంద్రబాబు. దీంతో గ్రూప్–2లో 11 ప్రశ్నలు ఇచ్చినా ఎల్లో మీడియా ఇదేంటి అని నిలదీసింది లేదు. ఇక ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన గ్రూప్–2లో ఒక పదం మాత్రమే ఇస్తే అది ఎల్లో మీడియాకు పెద్ద పాపంలా కనిపించింది. అందుకే గ్రూప్స్‌లో జగనన్న భజనేనా అంటూ విష కథనాన్ని అచ్చేసింది. ఒక్క పదానికే ఎల్లో మీడియా రచ్చరచ్చ తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ‘మెంటల్ ఎబిలిటీ’ విభాగంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు ఓ పేరాను ఇచ్చారు. అందులో ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పదం మాత్రమే పేర్కొన్నారు. సదరు పేరాను చదివి 123–125 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంతకుమించి ‘ఈ పథకం ఎప్పుడు పెట్టారు?, ఈ పథకం ఏ తేదీన ప్రారంభించారు?’ అనే ప్రశ్నలు లేవు. అయినా సరే ‘ఆడుదాం ఆంధ్ర’ అనే ఒక్క పదమే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. అలాగే 108వ ప్రశ్న.. ‘ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతచేయబడింది?’లో భాగంగా ఇచ్చిన ‘చేదోడు’ పదం కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. దీంతో తట్టుకోలేక గ్రూప్–2 పరీక్షలోనూ జగనన్న భజన చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. కాగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక మంది అభ్యర్థులు రాసిన పరీక్షగా గ్రూప్–2 ప్రిలిమ్స్ చరిత్ర సృష్టించింది. మంచి స్టాండర్డ్స్‌తో పరీక్ష నిర్వహించిందనే ప్రశంసలు ఏపీపీఎస్సీకి దక్కాయి. దీన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా చివరకు గ్రూప్–2 పరీక్షపైన కూడా విషం చిమ్మడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
-
గ్రూప్–2 వాయిదాతో విద్యార్థిని ఆత్మహత్య
చిక్కడపల్లి: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటీ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన కేసీఆర్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అర్ధరాత్రి దాటే వరకు నిరసన కొనసాగింది. విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. -
TSPSC: నవంబర్లోనే గ్రూప్-2.. కొత్త తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు గమనిక. ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా.. -
ముగిసిన గ్రూప్–2 దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సా యంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కమిషన్ వెబ్సైట్లో 5.50 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్– 2కు సంబంధించిన పరీ క్షల షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
T20 World Cup 2022: డచ్‌పై అద్భుత విజయం.. అగ్ర స్థానంలో టీమిండియా
వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ గురి తప్పలేదు. ‘ఆరెంజ్’ టీమ్‌పై తమదైన రేంజ్ ప్రదర్శన కనబర్చి అటు విజయంతోపాటు ఇటు రన్‌రేట్‌ను కూడా అమాంతం మెరుగుపర్చుకున్న టీమిండియా గ్రూప్–2లో అగ్ర స్థానానికి చేరింది. నెదర్లాండ్స్ సాధారణ బౌలింగ్‌ను ముగ్గురు బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొని అర్ధ సెంచరీలు సాధించడంతోనే జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ముఖ్యంగా సూర్యకుమార్ మెరుపులు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ‘డచ్’ బృందం తేలిపోయింది. ఆ జట్టు కనీస స్థాయి ఆటను కూడా చూపించలేకపోవడంతో సంచలనానికి అవకాశం లేకపోయింది. సిడ్నీలో ఈ సమష్టి విజయంతో భారత్ మరింత ఉత్సాహంతో ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధం కానుంది. సిడ్నీ: పాకిస్తాన్‌పై చిరస్మరణీయ గెలుపు తర్వాత మరో మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ టి20 ప్రపంచకప్‌లో దూసుకుపోయింది. గురువారం జరిగిన గ్రూప్–2 పోరులో భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కోహ్లి రెండో వికెట్‌కు రోహిత్‌తో 73 పరుగులు (56 బంతుల్లో), మూడో వికెట్‌కు సూర్యకుమార్‌తో అభేద్యంగా 95 పరుగులు (48 బంతుల్లో) జోడించాడు. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. టిమ్ ప్రింగిల్ (20) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో భువనేశ్వర్, అక్షర్, అశ్విన్, అర్‡్షదీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన కెప్టెన్... తొలి మ్యాచ్‌తో పోలిస్తే నెమ్మదిగా ఉన్న పిచ్‌పై రోహిత్ శర్మ ఆరంభంలో పూర్తి నియంత్రణతో ఆడలేకపోయాడు. అయితే అతి జాగ్రత్తకు పోకుండా ఏదోలా బౌండరీలు బాదేందుకే అతను ప్రయత్నించాడు. పవర్‌ప్లేలో భారత్ 32 పరుగులే చేయగలిగింది. మీకెరెన్ ఓవర్లో లెగ్‌సైడ్‌లో సిక్స్ బాదిన రోహిత్‌కు ఆ తర్వాత కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 13 పరుగుల వద్ద క్లాసెన్ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ప్రింగిల్ వదిలేశాడు. 27 పరుగుల వద్ద బీక్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా, రివ్యూలో బంతి ముందుగా బ్యాట్‌కు తగిలినట్లు తేలింది. ఆ తర్వాత డి లీడ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన అతను, ప్రింగిల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ వెనుదిరిగాడు. భువీ సూపర్ స్పెల్... ఛేదనలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగలేదు. తక్కువ వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చిన జట్టు కోలుకోలేకపోయింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఒక వికెట్ తీసిన భువనేశ్వర్ పూర్తిగా కట్టిపడేశాడు. కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒ డౌడ్ (10 బంతుల్లో 16; 3 ఫోర్లు)ను అక్షర్ తన రెండో బంతికే పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో స్కోరు 27 పరుగులు కాగా, అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 63/5 వద్ద నిలిచింది. అనంతరం 14 పరుగుల వ్యవధిలో నెదర్లాండ్స్ తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. ఓటమి ఖాయమైన తర్వాత అర్‡్షదీప్ వేసిన ఆఖరి ఓవర్ చివరి 3 బంతులను వరుసగా ఫోర్లు కొట్టి మీకెరన్ డచ్ అభిమానులకు కాస్త ఆనందం పంచాడు. రివ్యూ చేయకుండా... ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ (9) నిరాశపర్చాడు. ఇబ్బందిగా ఆడుతున్న అతడిని మీకెరెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ ఎల్బీగా ప్రకటించిన అనంతరం అతను కెప్టెన్‌తో చర్చించాడు. రోహిత్ రివ్యూ తీసుకోమని సలహా ఇచ్చినా... రాహుల్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే రీప్లేలో బంతి లెగ్‌సైడ్ దిశగా వెళుతున్నట్లు కనిపించింది. రివ్యూ కోరితే రాహుల్ పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. ఆసాంతం దూకుడు... ఇద్దరు సీనియర్లతో పోలిస్తే సూర్యకుమార్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వచ్చీ రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లోనే అతను 5 ఫోర్లు బాదాడు. మీకెరెన్, డి లీడ్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా చూడచక్కటి సిక్సర్ కొట్టడంతో 25 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 65 పరుగులు రాబట్టింది. చివర్లో జోరుగా... కోహ్లి కూడా ఆరంభంలో ఎలాంటి సాహసాలకు పోలేదు. నిలదొక్కుకున్న తర్వాతే ధాటిగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. తనదైన శైలిలో సింగిల్స్ తీయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 పరుగులే బౌండరీల ద్వారా రాగా, వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారానే 38 పరుగులు వచ్చాయి. క్లాసెన్ బౌలింగ్‌లో అతను కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్‌గా నిలిచింది. 37 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తయింది. తాను ఆడిన తొలి 30 బంతుల్లో 32 పరుగులే చేసిన విరాట్, తర్వాతి 14 బంతుల్లో 30 పరుగులు రాబట్టడం విశేషం. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మీకెరెన్ 9; రోహిత్ (సి) అకెర్మన్ (బి) క్లాసెన్ 53; కోహ్లి (నాటౌట్) 62; సూర్యకుమార్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–11, 2–84. బౌలింగ్: క్లాసెన్ 4–0–33–1, ప్రింగిల్ 4–0–30–0, మీకెరెన్ 4–0–32–1, బాస్ డి లీడ్ 3–0–33–0, వాన్ బీక్ 4–0–45–0, షారిజ్ 1–0–5–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) భువనేశ్వర్ 1; మ్యాక్స్ ఒ డౌడ్ (బి) అక్షర్ 16; బాస్ డి లీడ్ (సి) పాండ్యా (బి) అక్షర్ 16; అకెర్మన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 17; కూపర్ (సి) (సబ్) దీపక్ హుడా (బి) అశ్విన్ 9; ఎడ్వర్డ్స్ (సి) (సబ్) దీపక్ హుడా (బి) భువనేశ్వర్ 5; ప్రింగిల్ (సి) కోహ్లి (బి) షమీ 20; వాన్ బీక్ (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 3; షారిజ్ (నాటౌట్) 16; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మీకెరెన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–47, 4–62, 5–63, 6–87, 7–89, 8–101, 9–101. బౌలింగ్: భువనేశ్వర్ 3–2–9–2, అర్‡్షదీప్ 4–0–37–2, షమీ 4–0–27–1, అక్షర్ 4–0–18–2, హార్దిక్ 1–0–9–0, అశ్విన్ 4–0–21–2. 34: టి20 ప్రపంచకప్‌లలో రోహిత్ సిక్సర్ల సంఖ్య. భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ (33)ను దాటి అగ్ర స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రిస్ గేల్ (63) ముందున్నాడు. 20: అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా భువనేశ్వర్ (20 ఓవర్లు) నిలిచాడు. ప్రవీణ్ కుమార్, బుమ్రా (19 ఓవర్ల చొప్పున) పేరిట ఉన్న రికార్డును భువనేశ్వర్ సవరించాడు. 57: మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది భారత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య. 2007 లో భారత్ అత్యధికంగా 55 మ్యాచ్‌లు ఆడింది. 867: ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ (25 మ్యాచ్‌ల్లో 867) టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (20 మ్యాచ్‌ల్లో 839 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. -
యథావిధిగా గ్రూప్–2 ఇంటర్వ్యూలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ ద్వారా జరుగుతున్న గ్రూప్–2 ఇంటర్వ్యూలను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఈ అంశంపై గత నాలుగేళ్లుగా జరుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్స్టాప్ పెట్టింది. దీనిపై వివాదం కొనసాగించడం మంచిది కాదని ధర్మాసనం పేర్కొంటూ గ్రూప్–2 నియామకాలపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గ్రూప్–2 నియామకాల కోసం టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో లోపాలున్నాయని, కొందరు జవాబు పత్రాల్లో వైట్నర్ ఉపయోగించారని గతంలో కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా హైకోర్టు సింగిల్ బెంచ్ 2017 లో తీర్పు ఇచ్చింది. అయితే దీనిని తొలి జాబితాలో ఎంపికైన వారు సవాలు చేయగా.. 2019లో జస్టిస్ రామసుబ్రమణ్యం నేతృత్వంలోని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది. ఈ డివిజన్ బెంచ్ తీర్పు ఆధారంగా టీఎస్పీఎస్సీ.. గ్రూప్–2 అభ్యర్థులకు ఇప్పటికే ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభించింది. 45 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్‌లో ఊరట లభించిన వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంటర్వ్యూలను నిలిపివేసి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్ రామసుబ్రమణ్యం ధర్మాసనం తీర్పు బాగుందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసు కుని రాసిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. స్టేలతో జాప్యం దురదృష్టకరం.. ప్రభుత్వ రంగంలో జరిగే నియామక ప్రక్రియలో కేసులు, స్టేల కారణంగా జాప్యం జరుగుతుండటం దురదృష్టకరమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సింగిల్ జడ్జి ముగ్గు రు సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఏర్పాటు చేసి 20 వేల ఆన్సర్ షీట్లను వారితో పరిశీలింపజేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు న్యాయవాదుల కమిటీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం మంచిదని పిటిషన్‌ను తోసిపుచ్చారు. -
గ్రూప్-2 పోస్టింగులు ఇంకెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. నోటిఫికేషన్ వచ్చి రెండున్నరేళ్లు.. పరీక్షలు జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా.. భర్తీ ప్రక్రియ ముందుకు పడలేదు. న్యాయ వివాదాల కారణంగా అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రూప్-2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండటంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి, భర్తీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసులతో చిక్కులు.. గ్రూప్-2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు 5.17 లక్షల మంది హాజరయ్యారు. అయితే పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు పొరపాటుగా కొందరు అభ్యర్థులకు ఇతరుల ఓఎంఆర్ పత్రాలు ఇవ్వడం, తర్వాత మార్చడం, దాంతో అభ్యర్థులు అప్పటికే వ్యక్తిగత వివరాలు నింపిన చోట వైట్నర్ పెట్టి.. ఇతర ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం జరిగాయి. అయితే పరీక్ష నిబంధనల ప్రకారం అలా వైట్నర్ వినియోగించిన ఓఎంఆర్ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీఎస్పీఎస్సీ తొలుత స్పష్టం చేసింది. అయితే ఇలా వేలాది మంది అభ్యర్థులు పొరపాటు చేశారని గుర్తించింది. దీనిపై ఉస్మానియా, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో టెక్నికల్ కమిటీని వేసి.. వైట్నర్ వినియోగం విషయంలో అభ్యర్థుల హడావుడే కారణమని, కావాలని చేయలేదని నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో వారందరి ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ... మూల్యాంకనం పూర్తిచేసింది. 1,032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో 3,147 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కూడా పిలిచింది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన న్యాయవాదుల కమిటీ కూడా వైట్నర్ వినియోగంలో అభ్యర్థులది కేవలం హడావుడి పొరపాటు మాత్రమేనని తేల్చింది. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు గ్రూప్-2లో 17 ప్రశ్నలను తొలగించి ఫైనల్ ‘కీ’ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా తేలాల్సి ఉంది. -
66 ఉర్దూ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు సీఎం కార్యాలయంలో 66 ఉర్దూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేçషన్ విడుదల చేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఎస్ఎ.షుకూర్ గురువారం విలేకరులకు తెలిపారు. గ్రేడ్–1 పోస్టులకు రూ.600, గ్రేడ్–2 పోస్టులకు రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉందన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 2 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. వివరాలకు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జ్టి్టp:// ఠీఠీఠీ.్టటu్చ.జీn/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఆరు గ్రేడ్–1 పోస్టులు.. వీటిలో గ్రేడ్–1 పోస్టులు ఆరు ఉన్నాయి. విద్యార్హత ఎస్సెస్సీలో ఉర్దూ రెండో భాషగా ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీలో ఉర్దూ ఓ సబ్జెక్ట్‌గా ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21–44 మధ్య ఉండాలి. వేతనం కింద రూ.37,100 నుంచి రూ.91,450 చెల్లిస్తారు. గ్రేడ్–2 పోస్టుల అర్హతలు.. గ్రేడ్–2 విభాగంలో 60 ఉర్దూ ఆఫీసర్ల పోస్టులు ఉన్నాయి. విద్యార్హత ఎస్సెస్సీలో ఉర్దూ రెండో భాషగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా డిగ్రీలో ఉర్దూ ఓ సబ్జెక్ట్‌గా ఉండాలి. వయస్సు 21–44 మధ్య ఉండాలి. వేతనం కింద రూ.28,940 నుంచి రూ.78,910 చెల్లిస్తారు. -
గ్రూప్–2 పార్ట్ ఏలో దిద్దుబాట్లు
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల్లోని పార్ట్–ఏలో పొరపాట్లు దిద్దడం, వైట్నర్ వినియోగించడం వంటివి ఉన్నాయని.. పార్ట్–బిలో అలాంటివేవీ కనిపించలేదని హైకోర్టు నియమించిన ముగ్గురు సీనియర్ న్యాయవాదుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పార్ట్–ఏలో పొరపాట్లు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల్సి ఉందని, కానీ వారి జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అనుమతి ఇచ్చిందని పేర్కొంది. 3,147 మంది అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్లలోని పార్ట్–ఏలో 120 మంది పొరపాటు చేసినట్లు టీఎస్పీఎస్సీ తేల్చిందని, వారంతా సర్టిఫికెట్ల ధ్రువీకరణకు ఎంపికయ్యారని వివరించింది. ఇలా పొరపాట్లు చేసినవారి సంఖ్య 120 మంది కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. హడావుడిలో పొరపాట్లలా ఉన్నాయి.. పార్ట్–ఏలో బుక్లెట్, ప్రశ్నపత్రం, టెస్ట్‌బుక్ సిరీస్, రోల్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని.. ఇందులో బబ్లింగ్ రెండు సార్లు చేయడం, అసలు బబ్లింగ్ చేయకపోవడం వంటి తప్పిదాల్ని గుర్తించామని కమిటీ తెలిపింది. అభ్యర్థులు హడావుడిలో పొరపాట్లు చేశారని అనిపిస్తోందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారా, ఎందుకు చేశారన్నదానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ‘‘టాప్‌లో ఉన్న ఐదువేల మంది అభ్యర్థుల్లో ఇలాంటి పొరపాట్లు చేసినవారెవరైనా వివక్ష లేకుండా ఎంపిక చేశారు. ఆ తప్పులు అభ్యర్థి శక్తి సామర్థ్యాలను ప్రభావితం చేసేవిగా అనిపించడం లేదు. స్కానింగ్ ఏజెన్సీ గుర్తించేలా ఓఎంఆర్ జవాబు పత్రాలున్నాయి. అభ్యర్థుల పత్రాలు తారుమారు కాలేదు. ఓఎంఆర్ షీట్లలో టీఎస్పీఎస్సీ జోక్యం ఉన్నట్లు కనిపించలేదు. కొట్టివేతలు, దిద్దుబాట్లు సరిచేయాలంటే.. షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల పత్రాలను నేరుగా పరిశీలన చేయాల్సిన అవసరముంది. కానీ అలా చేయలేదు..’’అని కమిటీ పేర్కొంది. వైట్నర్ వివాదంతో.. గ్రూప్–2 పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వినియోగించారని, తప్పులు చేసిన అభ్యర్థులను కూడా ఎంపిక చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. ఆ జవాబు పత్రాల పరిశీలన కోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అభ్యర్థుల పత్రాలను పరిశీలించి హైకోర్టుకు నివేదిక అందజేసింది. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయమూర్తి.. పిటిషనర్లు వాదనలు తెలియజేసేందుకు విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. -
సజావుగా గ్రూప్–2 మెయిన్ పరీక్షలు
అనంతపురం రూరల్: వసతి గృహాల సంక్షేమ అధికారుల నియామకానికి ఏపీపీఎస్సీ గురువారం నిర్వహించిన మెయిన్ పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్–2 మెయిన్ పరీక్షలకు మొత్తం 650 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 179 మంది అభ్యర్థులు గైర్వాజరయ్యారు. రాప్తాడు మండల పరిధిలోని ఎస్వీఐటీ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రమామణి పరిశీలించారు. -
భర్తీ లేదా.. బ్రదర్!
-
భర్తీ లేదా.. బ్రదర్!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ► నోటిఫికేషన్లు జారీ అవుతున్నా ముందుకు సాగని భర్తీ ప్రక్రియ ► అర్హతలు, నియామక పరీక్షల్లో వరుస తప్పిదాలు ► విపరీత నిబంధనలతో గందరగోళం ► అభ్యర్థుల వ్యతిరేకత, కోర్టు కేసులతో నిలిచిపోతున్న వైనం ► గ్రూప్–2 ఉద్యోగాలకు వైట్నర్ దెబ్బ ► విపరీత నిబంధనలతో గురుకుల పోస్టులకు గండం ► మార్గదర్శకాలు పాటించక లక్ష మంది ‘టెట్’కు దూరం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. అర్హతలు, నిబంధనలు మొదలుకుని సిబ్బంది తప్పిదాలు, కోర్టు కేసుల దాకా ఎన్నో అడ్డంకులతో పోస్టుల భర్తీ జరగక ఆవేదన చెందుతున్నారు. గ్రూప్–2, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ఏడాదిన్నర కిందటే నోటిఫికేషన్లు జారీ అయినా ఇప్పట్లో ఉద్యోగ నియామకాలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నిబంధనలతో దాదాపు లక్ష మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి అనుమతినిచ్చి ఏడాది దాటుతున్నా.. మార్గదర్శకాల్లో అస్పష్టత కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పలు శాఖలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. గ్రూప్–2కు వైట్నర్ దెబ్బ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్, 2016 మార్చిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు 7,89,437 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించగా.. 4,97,961 మంది హాజరయ్యారు. అయితే పరీక్ష నిర్వహణ సమయంలో దాదాపు 50 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలు మారిపోయాయి. కాసేపటికి ఈ తప్పును గుర్తించిన పరీక్షల సిబ్బంది.. ఎవరి జవాబు పత్రాలను వారికి ఇచ్చారు. అయితే అప్పటికే నష్టం జరిగిపోయింది. కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాల్లో తమ వివరాలను రాసేశారు. మరికొందరు జవాబులు కూడా రాశారు (బబ్లింగ్ చేశారు). దీంతో పరీక్షల సిబ్బంది వైట్నర్ పెట్టి పరీక్ష రాయాలని సూచించగా.. అభ్యర్థులు అలాగే రాశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ నిబంధనలు, గ్రూప్–2 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. వైట్నర్ ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయరు. ఈ నిబంధన తెలిసిన కొందరు అభ్యర్థులు పరీక్షల సిబ్బంది తప్పిదం కారణంగా వైట్నర్ ఉపయోగించామని, తమను పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనల ప్రకారం అది వీలుకాదని టీఎస్పీఎస్సీ కోర్టుకు వివరించింది. కోర్టు కూడా అభ్యర్థుల వాదనను తోసిపుచ్చింది. కానీ ఆ తర్వాత టీఎస్పీఎస్సీ మాట మార్చింది. అంతర్గత పరిశీలనలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించినట్లు గుర్తించింది. ఓ కమిటీ వేసి.. ఆ కమిటీ సిఫారసు అంటూ వైట్నర్ ఉపయోగించిన వారిని కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. దీంతో మిగతా నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించగా.. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. టెట్‌కు నిబంధనల కష్టం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విపరీత నిబంధనల కారణంగా లక్ష„ý మంది వరకు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. 2010లో అమల్లోకి వచ్చిన ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్, డిగ్రీలలో 50 శాతం మార్కులుండి, ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు టెట్ రాసేందుకు అర్హులు. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే నాటికంటే ముందే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసుకున్న వారికి మాత్రం 45 శాతం మార్కులు వచ్చినా అర్హులేననే మినహాయింపు ఉంది. కానీ విద్యా శాఖ మొత్తంగా 50 శాతం మార్కుల నిబంధనను అమలు చేయడంతో.. వేలాది మంది టెట్ రాసే అవకాశం కోల్పోయారు. ఇక డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తిచేసి, తర్వాత డిగ్రీ (డీఎడ్+డిగ్రీ) చేసినవారు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులని ఎన్సీటీఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు నిర్వహించిన టెట్‌లలోనూ వారికి అవకాశం కల్పించారు. కానీ టెట్–2017లో విద్యా శాఖ వారికి అవకాశం కల్పించకపోవడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకూ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కానీ ఇంటర్, డిగ్రీల్లో 50 శాతం మార్కులు లేవంటూ టెట్‌కు దూరం చేయడంతో... చాలా మంది అభ్యర్థులు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. గురుకుల పోస్టులకు ‘అర్హత’గండం! దాదాపు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గురుకుల పోస్టుల భర్తీ కూడా గందరగోళంగా మారింది. గురుకుల స్కూళ్లలో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) తదితర 7,306 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలని సంక్షేమ శాఖలు నిబంధనలు విధించాయి. వాస్తవానికి ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం... ఈ పోస్టులకు 2010 ఆగస్టు తర్వాత డిగ్రీ, పీజీలు పూర్తి చేసుకున్న వారికి 50 శాతం మార్కులు.. అంతకుముందు ఉత్తీర్ణులైన వారికి 45 శాతం మార్కులు ఉంటే చాలు. కానీ సంక్షేమ శాఖలు 60 శాతం మార్కుల నిబంధన విధించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా కల్పించుకుని ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయించారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హత నిర్ణయించాలని ఆదేశించారు. అయినా పరిస్థితి మారలేదు. విద్యార్హతలను ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే నిర్ణయించినా.. రిజర్వేషన్ విషయంలో తప్పిదం చేశారు. అత్యధిక పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. జూన్ 1న 2,437 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. మహిళా కాలేజీల్లో పోస్టులను మహిళలతోనే భర్తీ చేయాలన్న నిబంధన ఎక్కడా లేకున్నా... డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులను 100 శాతం మహిళా అభ్యర్థులకే రిజర్వు చేశారు. దీనిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో.. ఈ పరీక్షలు కూడా ఆగిపోయాయి. వైద్యపోస్టుల భర్తీలో దిద్దుబాట! వైద్యారోగ్య శాఖ పరిధిలో 2,118 పోస్టుల భర్తీ ప్రక్రియ అంతులేకుండా సాగుతూనే ఉంది. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతేడాది జూలై 13న అనుమతి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పోస్టులు భర్తీ చేయాలని.. అర్హతలు, నిబంధనలను వైద్య శాఖ రూపొందించాలని పేర్కొంది. దీనిపై వైద్యారోగ్య శాఖ దాదాపు ఏడాది పాటు జాప్యం చేసింది. చివరికి ఈ ఏడాది మేలో మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ వాటిలో స్పష్టత లేకపోవడంతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ పలుసార్లు వైద్య శాఖకు సూచించింది. జూలై 5న టీఎస్పీఎస్సీ, ప్రభుత్వానికి లేఖలు సైతం రాసింది. ట్యూటర్ పోస్టుల భర్తీలో భారత వైద్య మండలి నిబంధనలు, రిజర్వేషన్ల వర్తింపు అంశాలపై స్పష్టత కోరింది. వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలోని అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, లెక్చరర్, రేడియోలాజికల్, ఫిజిక్స్, ఫిజిసిస్ట్ పోస్టులకు... వైద్య విధాన పరిషత్ పరిధిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో పాటించే నిబంధనలపై స్పష్టత కోరింది. దీంతో చివరికి వైద్యారోగ్య శాఖ స్పందించి ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం పలు అంశాలపై స్పష్టతనిస్తూ మంగళవారమే టీఎస్పీఎస్సీకి, ప్రభుత్వానికి వివరాలు పంపింది. ఇప్పటికైనా భర్తీ ప్రక్రియ ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
'మహా ఉద్యమం తప్పదు'
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగినందున ఆ పరీక్షలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులు చేపట్టిన మహా శిరోముండనం(గుండు గీయించుకునే)నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్, నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు భీమ్రావ్ నాయక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఓయూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మానవతారాయ్ అన్నారు. కోర్టు స్టే ఇచ్చినా, అక్రమాలు జరిగాయన్న ఆధారాలున్నా సీఎం కేసీఆర్ పరీక్షలను రద్దుచేయకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్వహించిన ప్రతి పోటీ పరీక్షలో అక్రమాలు చూస్తుంటే మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం తెలగాణలో పునరావృతం అయిందని, ఇది పెద్దల అవినీతికి నిదర్శనమని విమర్శించారు. హైకోర్టు గ్రూప్-2ను రద్దు చేసేలోపు ప్రభుత్వమే రద్దు చేసి తిరిగి మూడు నెలల్లో పరీక్ష నిర్వహించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. -
‘గ్రూప్–2’పై హైకోర్టు స్టే
3 వారాలపాటు నియామకాలు నిలిపేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)గ్రూప్–2 నియామకపు ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు నియామకపు ప్రక్రియ చేపట్టొద్దని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు మెరిట్ జాబితాలో స్థానం కల్పించారని, నియామకపు ప్రక్రియలో లోపాలున్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వి.రామచంద్రారెడ్డి, పి.శ్రీచరణదాస్ మరో 34 మంది వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వి.సురేందర్‌రావు, న్యాయవాది బి.రచనారెడ్డిలు వాదనలు వినిపించారు. ఓఎంఆర్ షీట్లో రెండుసార్లు దిద్దడం (డబుల్ బబ్లింగ్), వైట్నర్ వాడటానికి వీల్లేదని, ఈ విషయంలో టీఎస్పీఎస్సీ స్పష్టమైన నిబంధనలు జారీ చేసిందని వారు కోర్టుకు నివేదించారు. ఈ నిబంధనల ప్రకారం కొందరి జవాబుపత్రాలను మూల్యాంకనం చేయలేదని, దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. డబుల్ బబ్లింగ్, వైట్నర్ వాడినవారిలో 10 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 24న కొట్టేసిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం వీరంతా అనర్హులని, అయినా కూడా వీరి పేర్లు మెరిట్ జాబితాలో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీని వల్ల అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు నివేదించారు. పరీక్షలకు జబ్లింగ్ పద్ధతిని కూడా అనుసరించలేదని అన్నారు. దీనిని బట్టి ఈ నియామకపు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మూడు వారాలపాటు నియామకపు ప్రక్రియను ఆపేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. గ్రూపు–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా గ్రూపు–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినందునా ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు జరగాల్సిన వెరిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 1,032 పోస్టుల భర్తీకి గత నవంబర్‌లో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీఎస్సీ ఈ నెల 1న ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 1:3 చొప్పున అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసింది. మొత్తంగా 3,147 మందిని ఈ వెరిఫికేషన్‌కు పిలిచింది. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ చాపల్రోడ్డులోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు షెడ్యూలు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం వెరిఫికేషన్ నిర్వహించింది. అయితే, వెరిఫికేషన్‌కు ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. -
తెలంగాణ గ్రూప్-2 ఆగింది..
మూడు వారాలపాటు స్టే విధించిన హైకోర్టు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రూప్-2 నియామక ప్రక్రియపై హైకోర్టు మూడువారాల పాటు స్టే ఇచ్చింది. ఈ మూడువారాల్లో ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్-2 రాతపరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో 1032 పోస్టులతో ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ జారీచేసింది. గత నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్-2 రాతపరీక్షకు 5.65 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మూడువేల మందికిపైగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచింది. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను చేపట్టింది. అయితే, గ్రూప్-2 పరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయని, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను, వైట్నర్ ఉపయోగించిన వారు సైతం ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయాలని, ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. -
ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్: గ్రూప్ - 2 పరీక్ష వాయిదా వేయాలని వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యార్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఉదయ భాస్కర్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినిదాలు చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం ఏర్పడి తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. -
గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయండి: జనసేన
అమరావతి: గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో కోరారు. పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై ప్రభుత్వం, సర్వీస్ కమిషన్ అధికారులు సానుభూతితో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతకాలంగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారని, గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు మెయిన్ ఎగ్జామ్స్‌కు మధ్య ఉన్న 45 రోజుల గడువు సరిపోదన్నారు. ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిందని, వారు చెబుతున్న విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అభ్యర్థుల్లో కనిపిస్తున్న మానసిక ఆందోళనను సహృదయంతో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని, వారితో చర్చలు జరిపి , ఎవరికీ నష్టం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జనసేన కోరుతుందని తెలిపారు. -
గ్రూప్–2లో 17 ప్రశ్నలు తొలగింపు
- మరో 14 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు - వెబ్సైట్లో రివైజ్డ్ ‘కీ’లు.. ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. పరీక్ష ‘కీ’లలో పలు ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆప్షన్లు సరైనవి కావంటూ కొందరు అభ్యర్థులు చాలెంజ్ చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ 4 పేపర్లలో తప్పుడు ఆప్షన్లు ఉన్న, సరైన సమాధానాలు లేని 17 ప్రశ్నలను తొలగించింది. మరో 14 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా జవాబుల ఆప్షన్లలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్డ్ ‘కీ’లను వెబ్సైట్లో పెట్టింది.గ్రూప్–2 పరీక్షల్లో ఇంత భారీ సంఖ్యలో తప్పులు దొర్లడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలనలో.. గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్–2 రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిం దే. టీఎస్పీఎస్సీ వాటి ప్రాథమిక ‘కీ’లను డిసెంబర్ 2న వెబ్సైట్లో పెట్టింది. వాటిపై అదేనెల 5 నుంచి 14 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిశీలించిన అనంతరం జనవరి 11న తుది ‘కీ’ని వెబ్సైట్లో పెట్టింది. కానీ ఇందులోనూ భారీగా తప్పులున్నట్లు గుర్తించిన కొందరు అభ్యర్థులు.. తుది ‘కీ’లను చాలెంజ్ చేశారు. వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ... 17 ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొర్లాయని, మరో 14 ప్రశ్నలకు సంబంధించి 2, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సరైన సమాధానాలు ఉన్నాయని తేల్చింది. దీంతో తప్పులు దొర్లిన 17 ప్రశ్నలను తొలగించింది. రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలున్న 14 ప్రశ్నల్లో సరైన సమాధానాల్లో దేనిని గుర్తించినా మార్కులు ఇస్తామని ప్రకటించింది. ఈ మార్పులతో కూడిన రివైజ్డ్ ఫైనల్ ‘కీ’లను వెబ్సైట్లో పెట్టింది. ఇక వీటిపై భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొంది. -
గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేయాలి
ఎస్కేయూ: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు . జాతీయ రహదారిపై సోమవారం మోకాళ్లపై కూర్చొని మూడు గంటలపాటు నిరసన తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రూప్–2 ప్రిలిమనరీ ఫలితాలు , మెయిన్స్ పరీక్షకు కేవలం 40 రోజుల వ్యత్యాసం ఉండడంతో పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. మెయిన్స్‌కు నూతన సిలబస్ ఎక్కువగా నిర్ధేశించడంతో కాల వ్యవధి సరిపోలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. వెంటనే పరీక్షను వాయిదా వేయాలన్నారు. ఎంఎస్ఎఫ్ నాయకులు జగదీష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరు యాదవ్, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ఏపీ గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలి’
గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఏపీపీఎస్సీ మే లో నిర్వహించబోయే గ్రూప్–2 మెయిన్ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్–2 పోస్టులను పెంచాలని, మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నీల వేంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్–2 నిరుద్యోగుల పాలిట శాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్. కష్ణయ్య మాట్లాడుతూ.... గ్రూప్–2లో 4వేలు ఖాళీలు ఉండగా కేవలం 900 పోస్టులు భర్తీ చేస్తే సరిపోదని, గ్రూప్–2 పోస్టులను 900 నుంచి 4వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్ష అనంతరం మెయిన్ పరీక్షలకు 5నెలల సమయం ఇస్తారు కానీ ఈ ధఫా కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తే నిరుద్యోగులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. ఏపీ నిరుద్యోగ యువత ఆరేళ్లుగా ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారని కానీ గ్రూప్–2 నూతన పరీక్ష విధానం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ఆన్లైన్ పరీక్ష విధానం వల్ల కొంతమంది గ్రామీణ విద్యార్థులు ఉద్యోగ అవకాశం కోల్పోతున్నారని అన్నారు. అనంతరం ఏపీపీఎస్సీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. -
ఇబ్బందులే అసలు పరీక్ష
ప్రశాంతంగా గ్రూప్2 స్క్రీనింగ్ టెస్ట్ 29,627 మంది హాజరు 10,201 మంది పరీక్ష రాయలేదు గుర్తింపు కార్డుల్లేక వెనుదిరిగిన అభ్యర్థులు ఆర్ట్స్ సబ్జెక్ట్ ఓకే.. సైన్స్ కొంచెం టఫ్ ఏలూరు సిటీ : గ్రూప్2 ఉద్యోగాలకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అడుగడుగునా ఎదురైన సమస్యలు, ఇబ్బందులు అభ్యర్థులకు పెద్ద పరీక్షగా రిలియామి, విధిగా గుర్తింపు కార్డులు తీసుకురావాలనే నిబంధనపై అభ్యర్థులకు అవగాహన కల్పించకపోవటంతో జిల్లాలో వందలాది మంది పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఆర్ట్స్ గ్రూప్ అభ్యర్థులకు ఈ పరీక్ష ఏపీపీఎస్సీ స్థాయిలో లేదని చెబుతుండగా, సైన్సు సబ్జెక్ట్ అభ్యర్థులకు మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది. జిల్లా వ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాల్లో 74.39 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఽ 10,201 మంది గైర్హాజరు జిల్లాలో 39,828మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 10,201 మంది గైర్హాజరయ్యారు. 29,627 మంది ఽస్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. 9 మంది స్పెషల్ ఆఫీసర్లు, 30మంది లైజాన్ ఆఫీసర్లు, కలెక్టర్ కె.భాస్కర్, జేసీ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో కట్టా హైమావతి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వీ.రమేష్‌బాబు, డీఈఓ ఆర్ఎస్ గంగాభవాని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ భాస్కర్ ఏలూరులోని సీఆర్ఆర్ అటానమస్, సీఆర్ఆర్ ఉమెన్స్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఽఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, పెదపాడు, పెదవేగి, నల్లజర్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంకు చెందిన ఎస్.దివ్య గుర్తింపు కార్డు లేకుండా రావటంతో పరీక్ష రాసేందుకు అధికారులు నిరాకరించారు. తమ గోడును చెప్పుకునే అవకాశాన్ని కూడా అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో వందలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. టికెట్లు ఇచ్చేందుకు బస్సులను పలుచోట్ల నిలుపుదల చేయడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లగలమో లేదోనని ఆందోళన చెందారు. నెలల తరబడి శిక్షణ పొందిన వారితోపాటు పరీక్షలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆశతో అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. చాలామంది అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 9.30 గంటల నుంచి వారికి లోనికి అనుమతించారు. చంటి పిల్లలు ఉన్న వారు భర్త, బంధుగణంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెట్లు, పుట్టలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలావుంటే.. వేసవి వచ్చేసిందా అన్నట్టు భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ‘గ్రూప్–2’ కేంద్రాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈ నెల 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ నుంచి అధికారులను డిప్యుటేషన్‌పై నియమించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల పేర్లు, మొబైల్ నెంబర్లను ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 6,57,010 మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రానికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో పర్యవేక్షణాధికారులను సంప్రదించవచ్చని కమిషన్ వివరించింది. పరీక్ష హాలులోకి ఉదయం 9 గంటలకు అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఉదయం 9.45 గంటల తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అత్యధిక సంఖ్యలోనే దరఖాస్తులు అందడం విశేషం. ఈ పరీక్షకు గాను హైదరాబాదు సెంటరు నుంచి 53063 మంది పరీక్ష రాయనున్నారు. -
2.9 లక్షల మందికి గ్రూప్–2 హాల్ టిక్కెట్లు
ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈనెల 26న నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు 2.9 లక్షల మందికి హాల్‌టిక్కెట్లను జారీ చేసింది. అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వేషన్, స్థానికత విషయంలో తప్పులు దొర్లినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఆ పొరపాట్లను స్క్రీనింగ్ టెస్టు అనంతరం పరిష్కరిస్తామని, అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. అభ్యర్ధుల వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్), ఎగ్జామినేషన్ అప్లికేషన్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వివరించారు. -
26న గ్రూప్–2 ప్రిలిమ్స్
⇒ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు ⇒ 982 పోస్టులకు 6,57,010 మంది పోటీ ⇒ ఈ పరీక్షకు రిజర్వేషన్లు, లోకల్, నాన్‌లోకల్ కోటా వర్తించదు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్ పరీక్ష) ఈనెల 26న జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చిన వారు మినహా మిగతా వారు పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఆప్షన్లు ఇచ్చిన వారు 14వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 982 పోస్టులకు 2016 నవంబర్ 8వ తేదీన గ్రూప్2 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 6,57,010 మంది అభ్యర్థులు (తెలంగాణ వారితో కలిపి) పోటీ పడుతున్నారు. ఒక్కో పోస్టుకు 670 మంది పోటీలో ఉన్నారు. ప్రిలిమ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల విధానం, లోకల్, నాన్‌లోకల్ కోటా వర్తించదు. మెయిన్ పరీక్షలకు వర్తిస్తుంది. లోకల్ కోటాలో 30% పోస్టులు ఉమ్మడి మెరిట్ జాబితా ద్వారా పూర్తిచేసి తక్కిన 70% పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మెయిన్స్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా మే 20వ తేదీన నిర్వహిస్తారు. -
12న గ్రూప్–2 ఉచిత మోడల్ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆశ్రిత ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల నిపుణులు, సామాజిక విద్యావేత్త (2008 గ్రూప్–2 విజేత) వి.ఉషాకిరణ్ నిర్వహణలో ఈనెల 12న ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఉచిత మోడల్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉద్యోగార్థులు విజయం సాధించడం కోసం రూ. 500 విలువ చేసే మెటీరియల్ ఇవ్వనున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మొదటి ఐదుమంది రాష్ట్ర టాపర్స్‌కు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున, జోనల్ టాపర్స్‌కు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతులు మీదుగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలో 120కు పైగా మార్కులు సాధించే 100 మందికి గ్రూప్–2 మెయిన్స్‌కు ఉచిత ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లాల వారిగా అభ్యర్థులు పరీక్ష సెంటర్లకోసం పౌండేషన్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 6 వరకు వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 93925 85533 నంబరులో సంప్రదించాలని కోరారు. -
గ్రూప్–2లో 17 ప్రశ్నలు తొలగింపు
8 ప్రశ్నలకు 2 కంటే ఎక్కువ సరైన సమాధానాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఫైనల్ కీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి నిర్వ హించిన గ్రూప్–2 పరీక్షలో మొత్తం 17 ప్రశ్నలను టీఎస్పీ ఎస్సీ తొలగించింది. మరో 8 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయని, వాటిల్లో ఏదీ రాసినా సరైన సమాధానం అవుతుందని వెల్లడించింది. తొలగించిన ప్రశ్నలను మినహాయించి మిగతా ప్రశ్నలకు మార్కులు లెక్కించనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలు, తొలగించిన ప్రశ్నల వివరాలతో కూడిన ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. మొత్తం 4 పేపర్లలో 17 ప్రశ్నలు తొలగించినట్లు తెలిపింది. నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు మొత్తం 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,98,944 మంది హాజరయ్యారు. ఆ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ గత నెల 2న తమ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. వాటిపై డిసెంబర్ 5 నుంచి 14 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, పరిశీలన చేయించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు 600 ప్రశ్నలతో కూడిన నాలుగు పేపర్లలో సరైన సమాధానాలు లేనందున 17 ప్రశ్నలను తొలగించింది. పేపర్–1లో 6 ప్రశ్నలు, పేపర్–2లో 5 ప్రశ్నలు, పేపర్–3లో 3 ప్రశ్నలు, పేపర్–4లో 3 ప్రశ్నలను తొలగించింది. మరో 8 ప్రశ్నలకు 2, అంతకంటే ఎక్కువ సమాధానాలు ఉన్నట్లు తేల్చింది. ఇందులో పేపర్–1లో 2 ప్రశ్నలకు, పేపర్–2లో ఒక ప్రశ్నకు, పేపర్–3లో 4 ప్రశ్నలకు, పేపర్–4లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నట్లు గుర్తించింది. తాజాగా ప్రకటించిన ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని టీఎస్పీఎసీ వెల్లడించింది. పేపర్ల వారీగా తొలగించిన,ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్న ప్రశ్నలు పేపర్–1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీఎస్), ఏబీ సిరీస్‌లో.. తొలగించినవి: 38, 70, 78, 93, 108, 139వ ప్రశ్నలు. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 17వ ప్రశ్నకు 3 లేదా 4వ ఆప్షన్ సరైంది. 77వ ప్రశ్నకు 3 లేదా 1 లేదా 2వ ఆప్షన్ సరైంది. పేపర్–2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ), ఏబీ సిరీస్‌లో.. తొలగించినవి: 40, 94, 104, 113, 131. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 28వ ప్రశ్నకు 2 లేదా 3వ ఆప్షన్ సరైంది. పేపర్–3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), ఏబీ సిరీస్‌లో.. తొలగించినవి: 20, 53, 124. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 59వ ప్రశ్నకు 1 లేదా 2వ ఆప్షన్ సరైన సమాధానం. 94వ ప్రశ్నకు 2 లేదా 3వ ఆప్షన్ సరైంది. 118వ ప్రశ్నకు 1 లేదా 4వ ఆప్షన్ సరైంది. 134వ ప్రశ్నకు 1 లేదా 4వ ఆప్షన్ సరైంది. పేపర్–4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం), ఏబీ సిరీస్‌లో.. తొలగించినవి: 16, 51, 80. ఒకటి కంటే ఎక్కువ సమాధానాలున్నవి: 32వ ప్రశ్నకు 1 లేదా 2వ ఆప్షన్ సరైంది. -
గ్రూప్–2కు 6.5 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్ నుంచి 52,893 మంది పోటీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు అందాయి. ఆదివారం అర్ధరాత్రితో గడువు ముగిసే సమయానికి ఈ పోస్టులకు 6,55,729 మంది ఆన్లైన్ దరఖాస్తు చేశారు. ఆన్లైన్ పేమెంటుకు సంబంధించి బ్యాంకుల నుంచి సమాచారం వస్తే ఈ సంఖ్య మరో వేయి వరకు పెరుగుతుందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. ఇందులో హైదరాబాద్ నుంచి 52,893 మంది అభ్యర్థులు ఉండడం విశేషం. వీరంతా నాన్‌లోకల్ కేటగిరీలో దరఖాస్తు చేశారు. -
గ్రూప్–2 ఆన్ లైన్ లైన్ ఉచిత శిక్షణ
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ఈజీఎం, జేకేసీ ఆధ్వర్యంలో గ్రూప్–2 అభ్యర్థులకు ఆ¯Œన్ లైన్ టెలీకాస్ట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, ఇతర నిరుద్యోగ అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్మెంట్ భవనంలో జరిగే శిక్షణకు ఇన్చార్జ్గా శ్యాం (సెల్ నంబర్ : 9701452775) వ్యవహరిస్తారు. తాడిపత్రిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘునాథరెడ్డి (సెల్ నంబర్ : 7702100249), హిందూపురంలోని ఎ¯ŒSఎస్పీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో లక్ష్మి (సెల్ నంబర్ : 7702100239), కళ్యాణదుర్గంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓబుళేసు (సెల్ నంబర్ : 7702100246), ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే శిక్షణకు అనంతలక్ష్మి (సెల్ నంబర్ :7386763456) సెంటర్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. -
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు
-
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు
- ఇప్పటికే ఆరు లక్షలకు చేరిన దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెలలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ సంఖ్య మరికొంతమేర పెరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్–2 కింద 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి గతనెల 8న నోటిఫికేషన్ వెలువరించి అదేనెల 11వ తేదీనుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను కమిషన్ చేపట్టింది. డిసెంబర్ 10వ తేదీ వరకు ముందు గడువు విధించింది. అయితే కమిషన్ వెబ్సైట్లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తడంతో సాంకేతికంగా మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో గడువును మరో అయిదు రోజుల పాటు పెంచి ఈనెల 15వ తేదీని తుది గడువుగా చేసింది. కమిషన్ అంచనా కన్నా తక్కువగా ఇప్పటివరకు ఆరు లక్షల లోపే దరఖాస్తులు అందాయి. దీంతో గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని ఆ వర్గాలు వివరించాయి. ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ టెస్టు: గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టు 2017 ఫిబ్రవరి 26న నిర్వహించే అవకాశముంది. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఉదయం ఈ స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఆ టెస్టులో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున 982 పోస్టులకు కటాఫ్ నిర్ణయించి 49,100 మందికి పైగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. క్యారీఫార్వర్డ్ కింద కొత్తగా వచ్చి చేరే పోస్టుల సంఖ్యను అనుసరించి ఈ అభ్యర్థుల జాబితా మరింత పెరుగుతుంది. వీరికి మే 20, 21వ తేదీల్లో మెయిన్స్‌ను నిర్వహించనున్నారు. దరఖాస్తుల గడువు పెంచినందున ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆన్లైన్లో గ్రూప్–2 ఉచిత కోచింగ్
– క్లాసులను ప్రారంభించిన ఆర్యూ వీసీ కర్నూలు సిటీ: నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన కోచింగ్‌ను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆర్‌యూలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులను వీసీ వై.నరసింహూలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి, యవకుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ సదుపాయం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్యూ రిజిస్ట్రార్ అమర్నాథ్, డీఆర్డీఏ ఏపీడీ శివలీల, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ప్రారంభం
-
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 రాత పరీక్ష ప్రరంభమైంది. మొత్తం 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయం అనంతరం నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించక పోవడంతో కొందరు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. అయితే.. పెద్ద నోట్ల రద్దుతో గ్రూప్-2 అభ్యర్థులనూ చిల్లర కష్టాలు వదల్లేదు. ఇవాళ్టి నుంచి ఏటీఎంలతో డబ్బు డ్రా చేసుకోవచ్చు కదా అని భావించి దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు బయలుదేరిన వారికి నిరాశ తప్పలేదు. గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఆర్టీసి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ), 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్), 13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరగనున్నాయి. -
గ్రూపు-2 దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
గ్రూపు-2 దరఖాస్తుల్లో సవరణకు అవకాశం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో తిరస్కరణ జాబితా హైదరాబాద్: వచ్చే నెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాల్లోని తప్పులను ఈనెల 22లోగా సవరించుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. తప్పులు దొర్లిన వారి ప్రతిపాదిత తిరస్కరణ జాబితాను తమ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. అభ్యర్థుల పేరు, తండ్రి పేరు, ఫొటో, సంతకం, అర్హత వివరాలు, జెండర్ తదితర వివరాల్లో పొరపాట్లు చేసిన వారి పేర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపింది. వారంతా వాటిని సవరించుకునేందుకు తమ వెబ్సైట్లో ‘కరెక్ట్ దేర్ డిటేల్స్’ లింక్ సహాయంతో తప్పులను సవరించుకోవాలని సూచించింది. -
పాత ‘గ్రూప్–2’ పద్ధతిలోనే పరీక్ష జరగాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రూప్–2 పరీక్షలను పాత విధానంలో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గ్రూప్–2 పరీక్షలను గతంలో నిర్వహించిన విధంగానే జరపాలని కోరుతూ నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. వీరికి సంఘీభావం పలికిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలు సరికాదని అన్నారు. గ్రూప్–2 పరీక్షల విధానంలో నెగిటివ్ మార్కుల పద్ధతిని రద్దు చేయాలని, క్వాలిఫై అయిన అభ్యర్థులను ఒక పోస్టుకు 15 మంది నిష్పత్తిలో ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అర్థం లేని విధానాలతో పరీక్షల విధానాన్ని మరింత జఠిలంగా మారుస్తున్నారని అరోపించారు. సీనియర్ న్యాయవాది వైకే మాట్లాడుతూ ఏపీపీఎస్సీ నూతనంగా అమల్లోకి తెచ్చిన విధానాలతో నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడం అత్యంత కష్టసాధ్యం కానుందని అన్నారు. నిరుద్యోగ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిరుద్యోగుల వయో పరిమితి 52 ఏళ్ళకు పెంపుదల చేసి గ్రూప్–2 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను 2,600కు పెంచి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాగ్‌లాగ్ పోస్టులతో పాటు 6,250 కానిస్టేబుల్, ఎసై ్స పోస్టులను భర్తీ చేయాలన్నారు. -
గ్రూప్-2 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు
* నవంబర్ 12కు బదులు 11నే రెండు పేపర్ల నిర్వహణ * 12న ఐఎఫ్ఎస్ పరీక్ష ఉండటం వల్లే..: టీఎస్పీఎస్సీ * 13న యథావిధిగా మరో రెండు పేపర్లు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్వల్ప మార్పు చేసింది. నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించిన టీఎస్పీఎస్సీ నవంబర్ 12న నిర్వహించాల్సిన రెండు పరీక్షలను 11వ తేదీకి మార్చింది. నవంబర్ 12న కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్టు సర్వీసు (ఐఎఫ్ఎస్) మెయిన్ పరీక్షను నిర్వహిస్తున్నందున ఆ రోజు నిర్వహిస్తామని ప్రకటించిన గ్రూప్-2 పేపర్-1, పేపర్-2 పరీక్షలను ఒక రోజు ముందు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. 13వ తేదీన యథావిధిగా మరో రెండు పరీక్షలు (పేపర్-3, పేపర్-4) ఉంటాయన్నారు. దీంతోపాటు పరీక్ష సమయాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని ఆమె సూచించారు. గ్రూప్-2 కోసం గతంలోనే 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం మరో లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 23తో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఇదీ తాజా షెడ్యూలు నవంబర్ 11న: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 13న: పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. -
గ్రూప్-2 పరీక్ష తేదీలు మార్పు..
హైదరాబాద్: గ్రూపు-2 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ మార్పు చేసింది. నవంబరు 12, 13 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని తాత్కాలిక షెడ్యూలును గతంలోనే ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. నవంబరు 12వ తేదీన నిర్వహించాల్సిన రెండు పరీక్షలను 11వ తేదీకి మార్పు చేసింది. 12వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను 11వ తేదీనాడే నిర్వహిస్తామని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. నవంబరు 12వ తేదీన యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్టు సర్వీసు మెయిన్ పరీక్షను నిర్వహిస్తున్నందునా, ఆరోజు నిర్వహిస్తామని ప్రకటించిన గ్రూపు-2 పేపరు-1, పేపరు-2 పరీక్షలను ఒక రోజు ముందు నిర్వహిస్తామని తెలిపారు. 13వ తేదీన మరో రెండు పరీక్షలు (పేపరు-3, పేపరు-4) ఉంటాయని వెల్లడించారు. దీంతోపాటు పరీక్ష సమాయాన్ని కూడా ఖరారు చేసినట్తు తెలిపారు. గ్రూపు-2 కోసం గతంలోనే 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం మరో లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈనెల 23వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఇదీ తాజా షెడ్యూలు..: నవంబరు 11న: పేపరు-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపరు-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. - నవంబరు 13వ తేదీన: పేపరు-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపరు-4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. -
తెలంగాణలో కొలువుల జాతర
-
కొలువుల జాతర
మొత్తం 1,032 గ్రూప్-2 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ జారీ.. నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్ష! ► పాత నోటిఫికేషన్‌లోని 439 పోస్టులకు అదనంగా 593 పోస్టులు ► నేటి నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తులు ► ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ చేసుకోనక్కర్లేదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 డిసెంబర్ 30నాటి నోటిఫికేషన్లో పేర్కొన్న 439 పోస్టులతోపాటు ప్రస్తుత నోటిఫికేషన్ కింద మరో 593 పోస్టులను చేర్చారు. మొత్తంగా 1,032 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పోస్టులకు రాత పరీక్షను నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని వివరించారు. హాల్‌టికెట్లను పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 2015 డిసెంబర్ 30న జారీ చేసిన మొదటి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సుబ్రహ్మణ్యన్ వివరించారు. వారి పాత దరఖాస్తులను ఈ అనుబంధ నోటిఫికే షన్‌కు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఓటీఆర్ తర్వాతే దరఖాస్తు.. వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోని వారు ఓటీఆర్ చేసుకున్నాకే గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు నేరుగా గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు మినహా మిగతా వాటికి జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సాధారణంగా 34 ఏళ్లుగా ఉంది. అయితే ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. అంటే 44 ఏళ్ల లోపు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా కేటగిరీ అభ్యర్థులకు దీనికి అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. అయితే 58 ఏళ్లకు మించిన వారు అనర్హులు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కచ్చితంగా చెల్లించాలి. పరీక్ష ఫీజు కింద రూ. 140 చెల్లించాలి. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ కు మాత్రం పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. వారు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మరికొన్ని నిబంధనలు.. 2015 డిసెంబర్ 30 నాటికి నిర్ణీత విద్యార్హతలు ఉన్నవారు, 2015 జూలై 1వ తేదీ నాటికి నిర్ణీత వయోపరిమితి కలిగిన అభ్యర్థులు గత నోటిఫికేషన్‌తోపాటు తాజాగా జారీ చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు కూడా అర్హులే. 2015 డిసెంబర్ 30 నాటికి నిర్ణీత విద్యార్హతలు లేని అభ్యర్థులు పాత నోటిఫికేషన్‌కు అనర్హులు. 18 ఏళ్లలోపు వారితోపాటు గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ (పోస్టు నెంబరు 3) పోస్టుకు 2015 జూలై 1 నాటికి 20 ఏళ్లు నిండని వారు పాత నోటిఫికేషన్‌కు అన ర్హులు. పాత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరైనా 2016 జూలై 1నాటికి గరిష్ట వయోపరిమితిని మించితే(అన్ని రకాల వయోపరిమితి సడలింపులు, మినహాయింపులు కలుపుకొని) సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు అనర్హులు. జనరల్ అభ్యర్థులైతే 44 ఏళ్లు దాటిన వారు అనుబంధ నోటిఫికేషన్‌కు అనర్హులు. పాత నోటిఫికేషన్‌కు మాత్రం వారు అర్హులే. 2016 జూలై 1నాటి 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని దాటిన వారు(జనరల్), ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు విషయంలో 28 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని దాటిన జనరల్ అభ్యర్థులు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు అనర్హులు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తులను సబ్మిట్ చేయవద్దు. అలాగే టీఎస్పీఎస్సీ ఐడీ కూడా ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. అలాంటి వారి దరఖాస్తులను తిరస్కరిస్తారు. పోస్టులు, పరీక్షా విధానం, సిలబస్, ఖాళీల వివరాలు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు. ఇదీ పరీక్ష విధానం.. మొత్తంగా 675 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో పార్ట్-ఏ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉండగా.. పార్ట్-బీలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూను 75 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఏలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు. పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు. (1.తెలంగాణ, ఇండియా సాంఘిక సాంస్కృతిక చరిత్ర; 2.భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3.సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు. ఈ మూడింటిలో ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి) పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు. (1.భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు; 2.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివద్ధి; 3.అభివద్ధి, మార్పు అంశాలు. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి) పేపర్-4: తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు. 150 మార్కులు. (1.తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970); 2.ఉద్యమ దశ (1971-1990); 3.తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014). ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి). ఆరో జోన్లోనే అధికం గ్రూప్-2 కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికం ఆరో జోన్లోనే ఉన్నాయి. మొత్తం 1,032 పోస్టుల్లో 595 ఈ జోన్లో ఉన్నాయి. ఐదో జోన్లో 289 పోస్టులు ఉండగా..మల్టీజోన్ కేటగిరీలో 19 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రస్థాయి పో స్టులు 128 ఉండగా, సిటీ కేడర్ కింద ఒక పోస్టు ఉంది. రాష్ట్ర స్థాయి పోస్టుల్లో జీఏ డీ, ఫైనాన్స్, న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను చేర్చగా, మల్టీ జోన్ పోస్టుల్లో గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులను చేర్చారు. అసిస్టెంట్ లేబ ర్ ఆఫీసర్ పోస్టులు 3 ఉండగా అందులో 2 పోస్టులు ఐదో జోన్లో ఉండగా.. ఒక పోస్టు సిటీ కేడర్‌లో ఉంది. -
గ్రూప్–2 పోస్టులు పెంచాలి
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్–2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను 750 నుంచి రెండు వేలకు పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరండల్‌పేటలోని వావిలాల సంస్థలో గుంటూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్–2 అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రూప్–2 సిలబస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, స్క్రీనింగ్ పరీక్షలో కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను 150 మార్కులకు పొందుపర్చారని వివరించారు. జనరల్ స్టడీస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలైన రాజధాని నిర్మాణం, నదీ జలాల పంపిణీ, ఉద్యోగుల విభజన, విభజన చట్టం హామీలు తదితర అంశాలను చేర్చారని పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్ బి. మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రుల చరిత్రను శాతవాహనుల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ అధ్యయనం చేయాలని సూచించారు. అర్ధశాస్త్ర అధ్యాపకుడు మునుస్వామి మాట్లాడుతూ భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థలపై 15 ప్రశ్నలు ఉంటాయని, సమకాలీన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ప్రశ్నలు రావచ్చని తెలిపారు. సదస్సులో జీవశాస్త్ర అధ్యాపకుడు ఫణికుమార్, అధ్యాపకులు ప్రభాకర్, సుబ్బారావు, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
31న గ్రాండ్ టెస్టు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రూప్–2, ఎస్సై పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పీఆర్ రెడ్డి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో బ్రాడీపేట 3/10లోని ఐఓఎం క్యాంపస్‌లో ఈనెల 31న ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు వి. ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్–2, ఎస్సై పరీక్షలకు హాజరు కాగోరు అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ, ప్రిపరేషన్ తీరును అంచనా వేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఉచిత గ్రాండ్ టెస్ట్‌కు హాజరుకాగోరు అభ్యర్థులు సంస్థ కార్యాలయంలో నేరుగా సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 93462 45639 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
గ్రూప్–2పై అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
గుంటూరు వెస్ట్ : గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రూప్–2 ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవడం మినహా మరో మార్గం లేదన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పాశం రామారావు మాట్లాడుతూ జాషువా ఆశయాలను కొనసాగించేందుకు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముద్రించిన గ్రూప్–2 మెటీరియల్‌ను వీసీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ మెటీరియల్‌ను అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. ప్రణాళికాబద్ధంగా చదివితేనే.. మాజీ ఎంఎల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయని, ప్రణాళికాబద్ధంగా చదువుకుని విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను భర్తీ చేయాలని, నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రిలిమినరీ పరీక్షా విధానం ఆలోచనను విరమించుకోవాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ప్రవేశపెట్టే విధానాలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందిగా ఉండబోతున్నాయన్నారు. ఆ విధానాలపై తాము చేసే ఆందోళనలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఉద్యోగ సోపానం ఎడిటర్ ఎస్.వి.సురేష్, సబ్జెక్టు నిపుణులు మునిస్వామి, బి.మల్లికార్జునరావు, షేక్ ఇస్మాయిల్, కుర్రా శ్రీనివాస్, ప్రణయ్‌కుమార్ తదితరులు పరీక్షల సిలబస్ తదితరాలు వివరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బీ.లక్ష్మణరావు, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పిన్నమనేని మురళీకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీ.భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం: టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: ఈ నెల 24, 25 తేదీలలో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-2 పరీక్షకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించి 439 పోస్టులకు 5,64,431 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. పోస్టులు పెంచి, పరీక్షను వాయిదా వేయాలని.. నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తునా అభ్యర్థనలు అందిన నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్‌లోనే గ్రూప్-2 పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోస్టులు పెంచి గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. -
గ్రూప్-2 రెండు నెలలు వాయిదా
హైదరాబాద్ : తెలంగాణలో టీఎస్పీస్సీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలు రెండు నెలలు వాయిదా పడింది. వీటితో పాటూ కానిస్టేబుల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి గత కొంత కాలంగా డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే. కాగా షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ 24, 25 తేదీలలో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో పాటు సిలబస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం... తదితర అంశాలతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక గ్రామీణ అభ్యర్థుల కారణంగా...ఎస్ఐ పరీక్షల్లో ఇంగ్లీష్ వెయిటేజీ విధానాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. -
మమ్మల్ని ఏఎస్‌ఓలుగానే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ 1999 గ్రూప్2 నియామకాల్లో ఏఎస్‌ఓలుగా నియమితులై సచివాలయంలో కొనసాగుతున్న తమను యథాతథంగా కొనసాగించాలని అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్ఓ) ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీకి పంపాలని కోరారు. మంగళవారం సచివాలయంలోని 40 మంది ఎఎస్ఓలు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఏఎస్ఓలు తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీ అడిగిందని వారు వివరించారు. తాము ఎక్కువ మార్కులు కలిగి ఉన్నందున ఎగ్జిక్యూటివ్ లు, ఏఎస్‌ఓలుగా రెండింటికీ అర్హులమేనని చెప్పారు. కాకపోతే ఏఎస్‌ఓలుగా 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నందున తమకు ఎక్కువ మార్కులు ఉన్నా కూడా ఇదే పోస్టులో కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ సమ్మతి పత్రాలను తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో పనిచేస్తున్న 973 మందికి మేలు జరుగుతుంద న్నారు. -
కీలక పోస్టుల భర్తీ లేనట్లే!
* విభజన పూర్తయ్యే వరకూ ఆగిపోనున్న గ్రూప్-1 భర్తీ * విభాగాధిపతి కార్యాలయాల్లో ఖాళీల పరిస్థితీ అంతే.. * గ్రూప్-2, జోనల్, జిల్లా పోస్టుల భర్తీకి మాత్రం అవకాశాలు * అదీ ఉన్న రెండు జోన్లను యథాతథ ంగా కొనసాగిస్తేనే.. * లెక్చరర్ పోస్టుల భర్తీకి ‘క్రమబద్ధీకరణ’తో లింకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాల భర్తీలో మరింత ఆలస్యం తప్పేలా లేదు. పలు కేటగిరీలకు చెందిన జోనల్ పోస్టులు, జిల్లా స్థాయి ఉద్యోగాలు మినహా గ్రూప్-1, శాఖాధిపతుల కార్యాలయాల్లో పోస్టులు వంటివాటి భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర స్థాయి, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విభజనను కమల్‌నాథన్ కమిటీ తేల్చాకే... ఆయా విభాగాల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఇక ఇంజనీర్లు, గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. వీటికి సంబంధించి జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలా? లేక జోన్లను పునర్విభజించాలా? అన్నదానిపై వాటి భర్తీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం కూడా... కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోకపోతే జాప్యం తప్పదు. ఇక టీచర్ పోస్టుల వ్యవహారం పరిస్థితీ ఇంతే. 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినా..వేసవిలో హేతుబద్ధీకరణతో వాటిల్లో ఎన్ని మిగులుతాయనేది సందేహమే. 20 శాఖల్లోనే ఆప్షన్లకు అవకాశం.. 127 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 20 శాఖల్లోని ఉద్యోగులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కమిటీ కల్పించింది. ఇంకా 107 శాఖల ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించాల్సి ఉంది. ఆ తరువాత ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1,07,774 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమల్‌నాథన్ కమిటీ లెక్కలు వేసినా... పోస్టుల విభజన పూర్తయ్యాకే కేటగిరీల వారీగా ఖాళీలపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది. కాంట్రాక్టు క్రమబద్ధీకరణతో లింకు.. లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో... డెరైక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ వాటిని డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే... కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి నెలకొంది. విభజనపై తేల్చేదెప్పుడు? కమల్‌నాథన్ కమిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 127 శాఖల్లో 72 వేల పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందులో 52 వేల మంది రాష్ట్రస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది తెలంగాణ వారు ఏపీ ప్రభుత్వంలో, ఏపీ వారు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారందరి పంపకం పూర్తయ్యే వరకు గ్రూప్-1లోని వివిధ కేటగిరీలు, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల మొత్తం ఖాళీల సంఖ్య తేలే అవకాశం లేదు. అప్పటిదాకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై స్పష్టత రాదు. అసలు ఈ విభజనకు ఎంత సమయం పడుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. జోన్లను యథాతథంగా కొనసాగిస్తేనే.. రాష్ట్ర పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథాతథంగా కొనసాగిస్తే మాత్రం గ్రూప్-2, ఇంజనీర్లు వంటి జోనల్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ కోసం ఐదు వేలకుపైగా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వాటికి కూడా ప్రస్తుత జోన్ల విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం జోన్ల పునర్వ్యవస్థీకరణ దిశగా యోచిస్తే వాటి భర్తీకి అడ్డంకులు తప్పవు. ఏపీలో 13 జిల్లాలకు 4 జోన్లు ఉండగా, తెలంగాణలో పది జిల్లాలకు రెండే జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా జోన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రూప్-2, ఇంజనీఇర్ వంటి పోస్టుల భర్తీ ఆధారపడి ఉంది. ఇక జిల్లా స్థాయి పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
పరిధి విస్తృతం.. స్కోరింగ్ సులభం
గ్రూప్-1,2 వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ముఖ్యమైన భాగం.. చరిత్ర. ఏ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థికైనా చక్కని స్కోరు సాధించడానికి ఈ సబ్జెక్టు తోడ్పడుతుంది. ఇతర సబ్జెక్ట్లతో పోల్చితే సిలబస్ పరిధి కొంచెం విస్తృతం.. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని అంశాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.. కాబట్టి కొద్దిగా శ్రమిస్తే చరిత్రలో మెరుగైన మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.. ఈ క్రమంలో చరిత్రకు సంబంధించి ముఖ్యాంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సూచనలు... కె. యాకూబ్ బాష, సీనియర్ ఫ్యాకల్టీ. జనరల్ స్టడీస్‌లో చరిత్రలో భాగంగా ఇండియన్ హిస్టరీ నుంచి అత్యధికంగా ప్రశ్నలు వస్తాయి. రాజులు, వంశాలు, సాంఘిక-ఆర్థిక పరిస్థితులు, సామాజిక ఉద్యమాలు వంటి అంశాలు ప్రధాన నేపథ్యంగా ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపుగా ప్రశ్నలన్నీ అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తాయి. కాబట్టి సంబంధిత అంశాలను క్షుణ్నంగా చదవడం ప్రయోజనకరం. రెండు రకాల ప్రశ్నలు చరిత్రలో సాధారణంగా రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. అవి.. నేరుగా అడిగే ప్రశ్నలు-వీటిని ఏక పద సమాధాన ప్రశ్నలు లేదా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలుగా వ్యవహరిస్తారు. ఉదాహరణ-నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడెవరు? (సమాధానం- కుమారగుప్తుడు). ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం సరిపోతుంది. ఇన్‌డెరైక్ట్ ప్రశ్నలు- వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అంటారు. ఉదాహరణకు-జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం? 1) సమాఖ్య ఫ్రభుత్వ నిర్మాణం 2) రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు 3) {బిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి 4) దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం సమాధానం: 4. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సరళి మారుతోంది హిస్టరీ నుంచి దాదాపుగా 20-30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ప్రశ్నల సరళి కూడా క్రమంగా మారుతోంది. కాబట్టి ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనను ఏర్పర్చుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా పునరావృతం అవుతున్న ప్రశ్నలను ఏయే అంశాల నుంచి ఏ కోణంలో అడుగుతున్నారనే విషయం అవగతమవుతుంది. దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవాలి. తద్వారా అంశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రిపరేషన్ సాగించవచ్చు. మిగతా అంశాలపై కనీస అవగాహన స్థాయిని చేరుకుంటే తక్కువ సమయంలోనే మెరుగైన మార్కులు సాధించవచ్చు. తప్పనిసరిగా భారతదేశ చరిత్రలో కొన్ని చాప్టర్ల నుంచి ప్రతి పరీక్షలో ఏదో ఒక ప్రశ్నను తప్పనిసరిగా అడుగుతూనే ఉంటారు. ఉదాహరణకు-వైదిక నాగరికత, బౌద్ధ మతం, ఢిల్లీ సూల్తాన్లు, మొగలులు, స్వాతంత్రోద్యమం తదితరాలు. కాబట్టి ఈ అంశాలను సమయానుకూలంగా పునశ్చరణ చేయడం తప్పనిసరి. అంతేకాకుండా అభ్యర్థులు రిమోట్ ఏరియాస్గా భావించే అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు - మొదటిసారి వడ్డీ వ్యాపారం గురించి ప్రస్తావిస్తున్న గ్రంథం? (శతపత బ్రాహ్మణం). కాబట్టి ఇలాంటి అంశాలపైనా కూడా దృష్టి సారించాలి. గమనించాల్సిన విషయం నాన్ ఆర్ట్స్ అభ్యర్థులు చరిత్ర విషయంలో కొంత ఆందోళనతో ఉంటారు. వంశాల పేర్లు, రాజులు, రాజధానులు, సంవత్సరాలు వంటి వాటి విషయాలను గుర్తుంచుకోవడాన్ని క్లిష్టంగా భావిస్తుంటారు. కానీ గమనించాల్సిన విషయం.. ఈ మధ్య నిర్వహించిన కొన్ని పరీక్షలను పరిశీలిస్తే ఈ అంశాల నుంచి అడిగిన ప్రశ్నలు అతి స్వల్పం మాత్రమే. ఒకవేళ వచ్చినా గతంలో అడిగిన ప్రశ్నల్లోంచి అధిక శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అంతేకాకుండా అధిక శాతం ప్రశ్నలు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక అంశాల ఆధారంగా ఉంటున్నాయి. ఉదాహరణ-మొగల్ వంశస్థాపకుడెవరు? గుప్త వంశంలో ప్రముఖ రాజెవరు? వంటి ప్రశ్నలు గతంలో వచ్చేవి. ప్రస్తుతం బాబర్ రాసిన గ్రంథం? దాన్ని ఏ భాషలో రచించారు? గుప్తుల ఆస్థానంలోని నవరత్నాల్లో లేని వారెవరు? వంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఆయా అంశాలను చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం మొదలు విస్తృతమైన అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల సబ్జెక్ట్‌పై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. ఇలా చదవాలి బిట్స్ రూపంలోని మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహనను కలిగించే లోతైన అధ్యయనానికి ఆస్కారముండే ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఎంచుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసుకుంటూ చదవడం ప్రయోజనకరం. మూడు భాగాలుగా భారతదేశ చరిత్రను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడు యుగాల (ప్రాచీన, మధ్య, ఆధునిక)కు సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ విభాగంలో ముఖ్యాంశాలు-సింధు నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులు, హర్ష సామాజ్య్రం మొదలైనవి. ఇందులో సింధు, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు? 1) కశ్యప మాతంగుడు 2) ఆచార్య నాగార్జునుడు 3) ఆర్య అసంగుడు 4) ధర్మ కీర్తి సమాధానం: 2 కింది వాటిలో దాదాపుగా హరప్పా ముద్రికలన్నింటిపై ముద్రించిన జంతువు? 1) ఏక సింఘ 2) ఏనుగు 3) ఖడ్గమృగం 4) పులి సమాధానం: 1 వాసుదేవ కృష్ణునికి సమీప బంధువు కూడా అయిన జైన తీర్థంకరుడెవరు? 1) రుషభనాథుడు 2) పార్శ్వనాథుడు 3) నేమినాథుడు 4) మహావీరుడు సమాధానం: 3 మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది? 1) ఫాల్గుణం 2) ఆషాఢం 3) జ్యేష్టం 4) మాఘం సమాధానం: 2 కింది వాటిలో అత్యధిక సంఖ్యలో రోమన్ నాణేలు బయటపడిన ప్రాంతం? 1) కేరళ 2) ఆంధ్ర 3) తమిళనాడు 4) కర్ణాటక సమాధానం: 3 మధ్య యుగ భారతదేశ చరిత్ర ఈ యుగం హర్షుని అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు, విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు తదితరాలు ఈ విభాగంలోని ముఖ్యాంశాలు. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. దక్షిణ భారతదేశంలో భూ దానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు? 1) సైనికులు, అధికారులు 2) బ్రాహ్మణులు 3) దేవాలయాలు 4) 2, 3 సమాధానం: 4 మహ్మద్ ఘోరీ తొలిసారిగా భారతదేశంపై దండెత్తిన ప్రాంతం? 1) గుజరాత్ 2) పంజాబ్ 3) సింధ్ 4) ముల్తాన్ సమాధానం: 3 మంగోలుల దాడులను అత్యధికంగా ఎదుర్కొన్న ఢిల్లీ సుల్తాన్? 1) ఫిరోజ్‌షా తుగ్లక్ 2) మహ్మద్ బిన్తుగ్లక్ 3) అల్లాఉద్దీన్ ఖిల్జీ 4) బాల్బన్ సమాధానం: 2 విజయనగర సామాజ్య్ర నిర్మాణంలో భాగంగా భావించే వ్యక్తి (కింది వారిలో)? 1) మాధవాచార్యులు 2) మాధవ విద్యారణ్యులు 3) సాయనాచార్యులు 4) వ్యాసరామాచార్యులు సమాధానం: 2 అక్బర్‌ను ఇస్లాం వ్యతిరేకి అని దూషించిన సమకాలీన చరిత్రకారుడెవరు? 1) అబ్బాస్ ఖాన్ షేర్వాణి 2) నిజాముద్దీన్ అహ్మద్ 3) అబ్దుల్ హమీద్ లాహోరి 4) బదౌని సమాధానం: 4 ఆధునిక భారతదేశ చరిత్ర క్రీ.శ. 1707 నుంచి 1947 వరకు గల కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్రగా చదవాలి. ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఈ యుగం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం? 1) రైతులు పాల్గొనడం 2) విద్యార్థులు పాల్గొనడం 3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం 4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సమాధానం: 4 1928లో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు? 1) లాహోర్ 2) ఢిల్లీ 3) అలహాబాద్ 4) కాన్పూర్ సమాధానం: 2 స్వదేశీ ఉద్యమాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారెవరు? 1) లాలాలజపతిరాయ్ 2) బిపిన్‌చంద్రపాల్ 3) బాలగంగాధర్ తిలక్ 4) అరబిందోఘోష్ సమాధానం: 3 భారతదేశంలో మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా వీరిని భావించవచ్చు? 1) రాందేవ్ 2) సరోజినీనాయుడు 3) అనిబిసెంట్ 4) విజయలక్ష్మి పండిట్ సమాధానం: 1 భారతీ జాతీయ కాంగ్రెస్‌లో రెండో చీలికకు కారణం? 1) 1916 లక్నో ఒప్పందం 2) 1918 మాంటెగ్ ప్రకటన 3) అనిబిసెంట్ ఐఎన్‌సీ అధ్యక్షురాలిగా ఎన్నికవటం (1917) 4) 2, 3 సమాధానం: 2 {బిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మారు పేరు? 1) జాబ్ భార్నగ్ కంపెనీ 2) లండన్ వ్యాపారుల కంపెనీ 3) జాన్ కంపెనీ 4) జేమ్స్ కంపెనీ సమాధానం: 3 రాబర్ట్ క్లైవ్ జాకెట్‌గా ఏవరిని వర్ణించారు? 1) ఓమిచంద్ 2)మాణిక్ చంద్ 3) మీర్ జాఫర్ 4) సిరాజుద్దౌలా సమాధానం: 3 విక్టోరియా రాణి ప్రకటన చేసిన సంవత్సరం? 1) 1848, డిసెంబర్ 2) 1858, నవంబర్ 3) 1940, ఆగస్ట్ 4) 1930, ఆగస్ట్ సమాధానం: 2