గ్రూప్-2 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు | group-2 exam dates has changed tspsc | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు

Published Wed, Sep 21 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

గ్రూప్-2 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు

గ్రూప్-2 పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు

గ్రూప్-2 పరీక్షల తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్వల్ప మార్పు చేసింది.

* నవంబర్ 12కు బదులు 11నే రెండు పేపర్ల నిర్వహణ
* 12న ఐఎఫ్‌ఎస్ పరీక్ష ఉండటం వల్లే..: టీఎస్‌పీఎస్సీ
* 13న యథావిధిగా మరో రెండు పేపర్లు

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్వల్ప మార్పు చేసింది. నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ నవంబర్ 12న నిర్వహించాల్సిన రెండు పరీక్షలను 11వ తేదీకి మార్చింది. నవంబర్ 12న కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్టు సర్వీసు (ఐఎఫ్‌ఎస్) మెయిన్ పరీక్షను నిర్వహిస్తున్నందున ఆ రోజు నిర్వహిస్తామని ప్రకటించిన గ్రూప్-2 పేపర్-1, పేపర్-2 పరీక్షలను ఒక రోజు ముందు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.

13వ తేదీన యథావిధిగా మరో రెండు పరీక్షలు (పేపర్-3, పేపర్-4) ఉంటాయన్నారు. దీంతోపాటు పరీక్ష సమయాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని ఆమె సూచించారు. గ్రూప్-2 కోసం గతంలోనే 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం మరో లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 23తో దరఖాస్తుల గడువు ముగియనుంది.
 
ఇదీ తాజా షెడ్యూలు
నవంబర్ 11న: పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
నవంబర్ 13న: పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement