సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు గమనిక. ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్‌పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.
మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్‌లోడ్ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment