
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సా యంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కమిషన్ వెబ్‌సైట్లో 5.50 లక్షల మంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్– 2కు సంబంధించిన పరీ క్షల షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.