Reschedule
-
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
TSPSC: నవంబర్లోనే గ్రూప్-2.. కొత్త తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థులకు గమనిక. ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచనలు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఒక్క క్లిక్‌తో.. ఆర్టీసీ బస్సు ఎక్కడుందో చెబుతుంది.. డౌన్లోడ్ ఇలా.. -
ఒక రోజు ముందే ఇండియా-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్..?
భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు దేవీ నవరాత్రులకు మొదటి రోజు కావటం, అందులోనూ ఈ పండుగను ఘనంగా జరుపుకునే అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే దయాదుల సమరాన్ని రీషెడ్యూల్ చేసుకోవాలని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తుంది. దీనిపై బీసీసీఐ కూడా స్పందించినట్లు సమాచారం. భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పు అంశం పరిశీలనలో ఉన్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్-పాక్ లాంటి హైప్రొఫైల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌కు చేరుకుంటారని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగితే దేవీ నవరాత్రుల పండుగ కారణంగా విధించే అంక్షల కారణంగా ఫ్యాన్స్ ఇబ్బందులకు గురవుతారని సెక్యూరిటీ ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దాయాదుల సమరాన్ని షెడ్యూల్ తేదీకి ఒక రోజు ముందు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఏదిఏమైనా షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే మాత్రం ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారు, ముందస్తుగా అహ్మదాబాద్‌లో వసతి ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా ఇబ్బందులకు గురవుతారు. -
TS SET: టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారాయన. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. వివిధ సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేయనున్నారు. -
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
Huzurabad bypoll: ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.(చదవండి: బెట్టు వీడని ఏజెంట్లు.. మెట్టు దిగని సర్కారు) ఈ నెల 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1, 26న ఇంగ్లీష్ పేపర్-1, 27న మాథ్స్ పేపర్-1ఏ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, 28న మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, 31న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, నవంబర్ 1న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, నవంబర్ 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. చదవండి: బాలికలకు చాక్లెట్ల ఆశ చూసి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం.. -
ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్‌గా అనుమతించం
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో రద్దయిన ఆఖరి మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. దీన్ని మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ సిరీస్‌ను బీమా చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వివాద పరిష్కారానికి ఐసీసీ తలుపు తట్టింది. దీన్ని నిశితంగా గమనించిన బీసీసీఐ అసంపూర్తి సిరీస్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమని తెలిపింది. చదవండి: ఐదో టెస్టు భవితవ్యం మీరే తేల్చండి కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ! -
భారత్-శ్రీలంక సిరీస్: ఐదు రోజులు వెనక్కి..!
న్యూఢిల్లీ: భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కరోనా సెగ తగిలింది. శ్రీలంక జట్టులో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్‌లను రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జులై 13(మంగళవారం) తొలి వన్డే జరగాల్సి ఉంది. కానీ ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చిన శ్రీలంక జట్టులో 48 గంటల్లోని ఇద్దరు వైరస్ బారిన పడినట్లు బయట పడింది. మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. శుక్రవారం ఆ టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్‌కు పాజిటీవ్ అని తేలింది. దీంతో శ్రీలంక జట్టు క్వారంటైన్ పొడిగించాలని భావించిన ఆ దేశ క్రికెట్ బోర్డు.. వన్డే సిరీస్‌ను ఐదు రోజుల తర్వాత ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో 13న జరగాల్సిన వన్డే సిరీస్‌ను 18వ తేదీ నుంచి జరపనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా పీటీఐకు తెలిపారు. జులై 18వ తేదీన తొలి వన్డే, 20వ తేదీన రెండో వన్డే, 23వ తేదీఏన మూడో వన్డే జరుగనుంది. వాస్తవానికి జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగాల్సి ఉంది. ఇక ముందస్తు షెడ్యూల్ ప్రకారం 21, 23, 25 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉండగా, దానిని 25,27,29 తేదీల్లో జరిపేందుకు దాదాపు షెడ్యూల్ ఖరారైంది. -
టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి: హాగ్
మెల్బోర్న్: ఏదేమైనా సరే ఆస్ట్రేలియా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా లేదంటే రద్దు లాంటివి చేయవద్దని సూచించాడు. ‘ప్రపంచకప్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఈవెంట్‌ను రద్దు చేయడమో లేదంటే రీషెడ్యూల్ చేస్తారంటున్నారు. ఇది సరికాదు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే కప్ నిర్వహణ సాధ్యమే. పాల్గొనే అన్ని జట్లను ఓ నెలన్నర ముందుగానే చార్టెడ్ ఫ్లయిట్లలో ఇక్కడికి తీసుకురావాలి. క్వారంటైన్ సహా కరోనా పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈ సమయంలో వారి సన్నాహాలు జరుగుతుంటాయి. షెడ్యూలు వరకల్లా మెగా ఈవెంట్‌ను అనుకున్నట్లే ప్రారంభించవచ్చు’ అని హాగ్ సూచించాడు. -
సంక్రాంతి వార్: మారిన రిలీజ్ డేట్స్
హైదరాబాద్ : స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసి వీలైనంత సొమ్ము చేసుకోవాలని అగ్ర నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతికి రెండు, మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజైనా అన్ని సినిమాలు మెరుగైన వసూళ్లు సాధించే స్పేస్ ఉంటుందని చెబుతారు. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని, లాంగ్‌రన్‌లోనూ వసూళ్లు ఎఫెక్ట్ అవుతాయనే ఆందోళనా వ్యక్తమవుతుంది. రానున్న సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ డేట్‌ను లాక్ చేశాయి. బన్నీ, ప్రిన్స్‌ల బాక్సాఫీస్ క్లాష్‌పై బయ్యర్లతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆందోళన రేకెత్తడంతో విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్‌తో పాటు నెగెటివ్, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా వసూళ్లు దెబ్బతింటాయనే భయం వెంటాడుతోంది. భారీ మొత్తాలు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసే బయ్యర్లకు అంత భారీ మొత్తం రికవర్ కావాలంటే రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని భావిస్తున్నారు. విడుదల తేదీ వివాదంపై ఇటీవల సమావేశమైన ఇరువురు నిర్మాతలు చర్చించి రిలీజ్ డేట్స్‌ను మార్చినట్టు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విడుదల తేదీలపై ఆయా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండు భారీ చిత్రాలు ఒకేరోజు తలపడకుండా రెండు రోజుల గ్యాప్‌తో రానుండటంతో ఇరు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడతాయని మేకర్లు భావిస్తున్నారు. -
ఢిల్లీలో దట్టంగా అలుముకున్న పొగమంచు
సాక్షి: ఢిల్లీలో దట్టంగా పొగమంచు అలుముకున్నది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నిటి వేళల్లో మార్పులు చేశారు. 17 రైళ్లను రద్దు చేయగా 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
రుణాల కోసం ఎదురుచూపు
ఇంకా వర్తించని మూడో విడత రుణమాఫీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు పాలకుర్తి టౌన్ : రుణమాఫీ పొందిన రైతులకు రెండేళ్లుగా సీజన్ ప్రారంభంలో తిరిగి పంటరుణా లు పొందేందుకు అవస్థలు తప్పడం లేదు. రెండేళ్లుగా వరుస కరువు పరి స్థితులను ఎదుర్కొంటున్న రైతులు గత పది రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్లో పత్తి, మొక్కజొన్న సాగుకు రైతులు విత్తనాలు విత్తుకోగా వరిసాగుకు నార్లు పోసుకున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు పూర్తయినా బ్యాంకుల నుంచి పంట రుణాలు రీ షెడ్యూల్ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసినా అవి బ్యాంకుల్లో జమ కాలేదని బ్యాంకు అధికారులు విముఖత చూపుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రెండేళ్లుగా కరువుతో పంటలు చేతికందక ఆర్ధికంగా చితికిపోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్ సాగుకోసం మళ్లీ అప్పు లు చేయక తప్పటంలేదు. దీం తో చిన్న, సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తు న్నారు. ఈ సీజన్లో 50 శాతం పత్తి సాగును తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఇతర పంటలు సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినా రైతులు పత్తిపైనే మొగ్గు చూపుతున్నా రు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ రైతులకు సరైన ప్రోత్సాహం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి రుణాలు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు. -
రీషెడ్యూల్ చేస్తేనే రుణమాఫీ
కరీంనగర్ అగ్రికల్చర్: సర్కారు నిర్ణయాలు కరీంనగర్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇచ్చినట్లే ఇచ్చి ఎంతో కొంత తిరిగి రాబట్టుకునేందుకు కొర్రీలు పెడుతోంది. ఈ నెలాఖరులోగా రీషెడ్యూల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటూ సర్కారు స్పష్టం చేసింది. అన్నదాతలకు అవగాహన లేక, రీషెడ్యూల్ ప్రక్రియ విధానం తెలియక కరీంనగర్ జిల్లాలో 70వేల మంది అందుకు దూరంగానే ఉన్నారు. వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు కనీస చర్యలకు పూనుకోకపోవడంతో వీరందరికి రుణామాఫీ ప్రశ్నార్థకంగా మారుతోంది. డెడ్‌లైన్ గడువు మరో 48 గంటలే ఉండడంతో రైతులందరికీ రీషెడ్యూల్ జరుగుతుందా అనేది అనుమానంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టులో పంట రుణాల మాఫీని ప్రకటించింది. జిల్లాలో రూ.లక్ష లోపు రుణం పొందిన 3,80,203 మంది రైతులను గుర్తించగా, వీరికి రూ.1694 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడతగా 25 శాతం అంటే రూ.423.56 కోట్ల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే సర్కారు తీరుతో విడుదలైన 25శాతం సొమ్ము కూడా రైతులకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. రుణమాఫీ వర్తించాలంటే రీషెడ్యూల్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తుండడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాల లక్ష్యం రూ.2300 కోట్లకు కాగా, ఇప్పటివరకు రూ.1600 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. రుణమాఫీ అర్హత పొందిన 3,80,203 మంది రైతుల్లో 3,10,000 మంది మాత్రమే రీషెడ్యూల్ చేసుకున్నారు. పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుని రుణమాఫీ అర్హత ఉన్నవారంతా రీషెడ్యూల్లో భాగంగా రూ.1560 కోట్ల పంట రుణాలు పొందినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో 70,203 మంది రైతులు ఈ ఏడాది పంట రుణాలు తీసుకోలేదు. ప్రభుత్వం మాత్రం వారిని రుణమాఫీకి అర్హులుగా గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో 25శాతం సొమ్మును జమచేసింది. గడువు రెండు రోజులే.. రైతులకు రుణమాఫీ వర్తించాలంటే రుణాలు రీషెడ్యూల్ చేసుకుని బ్యాంకర్లు ఇచ్చే మొత్తాన్ని తీసుకోవాలి. అప్పుడే 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాల్లో మిగిలిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు వేసిన మొత్తానికి అనుగుణంగా మళ్లీ రుణాలు పొందలేకపోతే ప్రభుత్వం ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు రుణం మొత్తాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 31లోగా రైతులంతా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉండగా, వ్యవసాయశాఖ, బ్యాంకర్లు చివరి నిమిషంలో హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది. బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మధ్య సమన్వయలోపం కారణంగా 70వేల మంది రీషెడ్యూల్ చేసుకోలేకపోయారు. వీరిలో భూమి తన పేరు మీద ఉండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు, చాలా కాలంగా రుణాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉండి చనిపోయినవారు, అర్హత కార్డులు లేని కౌలురైతులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అధికారులు వ్యవసాయం చేసుకుంటున్న వారి సంబంధీకులకు వారికి ఉన్న భూమి ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణం ఇచ్చే చర్యలకు పూనుకుంటున్నారు. ఈ విషయమై లీడ్ బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి మాట్లాడుతూ ఈనెల 31లోగా పంట రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని, వందశాతం రీషెడ్యూల్ జరిగేలా బ్యాంకర్లకు ఆదేశాలున్నాయని, ఈ రెండు రోజుల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. -
రీ షెడ్యూలు చేసుకుంటేనే రుణమాఫీ
పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకోవాల్సిందేనన్న ప్రభుత్వ ప్రకటనతో రుణాల మాఫీ వ్యవహారం మరోమారు తెరమీదకొచ్చింది. రీషెడ్యూలు గడువు రెండు రోజులు మాత్రమే ఉండటంతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రుణాల మాఫీ ప్రక్రియపై మొదటి నుంచి అధికారులు అస్పష్ట ప్రకటనలు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు బ్యాంకర్ల వైఖరితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేకపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు వలస వెళ్లడం వంటి కారణాలతో పంట రుణాల రీ షెడ్యూలు జిల్లాలో పూర్తిస్థాయిలో జరగలేదు. జిల్లాలో 6.07లక్షల మంది రైతులు రూ.2725.83 కోట్ల మేర పంట రుణాల మాఫీకి అర్హులుగా తేల్చారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడత కింద రూ.681.45 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. 4.55 లక్షల మంది రైతులు రూ.1917 కోట్ల మేర రుణాలను రీ షెడ్యూలు చేసుకున్నారు. సుమారు 1.50లక్షల మంది రైతుల్లో కొందరు అవగాహన లోపంతో, మరికొందరు మళ్లీ రుణం అవసరం లేదనే ఉద్దేశంలో రీ షెడ్యూలు చేసుకోలేదు. పంట రుణాలు రీ షెడ్యూలు చేసుకుంటేనే రుణమాఫీ వర్తిస్తుందని తాజాగా అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. లేనిపక్షంలో తొలి విడత కింద రైతుల ఖాతాలో జమ చేసిన 25శాతం రుణ మొత్తం తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. కొన్నిచోట్ల రీ షెడ్యూలు ఫారాలపై సంతకాలు చేయాలంటూ బ్యాంకర్లు తమ ఏజెంట్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సహకరించని బ్యాంకర్లు రుణమాఫీ వ్యవహారంతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెబుతున్న బ్యాంకర్లు రీ షెడ్యూలు కోసం వెళ్తున్న రైతులను ఇక్కట్లకు గురి చేస్తున్నారు. తగినన్ని కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారు. ఓ వైపు రీ షెడ్యూలు గడువు ముంచుకొస్తుండడం, మరోవైపు బ్యాంకర్ల సహాయ నిరాకరణతో లబ్ధి పొందలేక పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో సుమారు 56వేల మంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఆంధ్రాబ్యాంకుతో సహా కొన్ని బ్యాంకులు బంగారం రుణాలను రీ షెడ్యూలు చేస్తుండగా ఎస్బీఐ మాత్రం నిరాకరిస్తోంది. పంట రుణాల మాఫీని సాకుగా చూపుతూ వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన పంట రుణాల లక్ష్యాన్ని కూడా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వివిధ బ్యాంకులకు 349 శాఖలుండగా ఖరీఫ్, రబీలో కలిపి రూ.2804 కోట్లను పంట రుణాల లక్ష్యం గా నిర్దేశించారు. ఖరీఫ్‌లో రూ.1542 కోట్ల లక్ష్యానికి రూ.625 కోట్లు, రబీలో రూ.1262 కోట్లకు రూ.860 కోట్లు మాత్రమే పంట రుణాల వితరణ జరి గింది. కొత్త రుణాల మంజూరు, పంట రుణాల రీ షెడ్యూలుపై అంతా సానుకూలంగా ఉన్నట్లు బ్యాంకర్లు ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రీ షెడ్యూలు గడువు పెంచడంతో పాటు బ్యాంకుల్లో శాఖల వారీగా పంట రుణాల మంజూరు, రైతుల కోసం బ్యాంకులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష జరిగితేనే ప్రయోజనం నెరవేరేలా ఉంది. -
రుణమాఫీ, రీషెడ్యూల్‌పై కమిటీ నియామకం
హైదరాబాద్: రైతుల రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉంటారు. మరో 11 మంది సభ్యులు ఉంటారు. రెవిన్యూ, ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్యకార్యదర్శులు, రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కన్వీనర్ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్‌పై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఒక సమగ్ర నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుంది. -
'ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారు'
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. రుణమాఫీపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేస్తుంటూ చంద్రబాబు మాత్రం సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ధర్మాన విమర్శించారు. కాగా వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతానికి రీషెడ్యూల్ మాత్రమే చేస్తామని, రుణమాఫీ గురించి తర్వాతే ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఇంటిలో ఒక్కరికే.. ఒక్క రుణానికే వర్తింపు
-
రుణాలు రీషెడ్యూలే
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఇంటిలో ఒక్కరికే.. ఒక్క రుణానికే వర్తింపు బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ నావల్ల కాదు ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మారుస్తాం సాక్షి, ఏలూరు: వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతానికి రీషెడ్యూల్ మాత్రమే చేస్తామని, రుణమాఫీ గురించి తర్వాతే ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తాడిచర్ల, ఉప్పలపాడు, రావికంపాడు గ్రామాల్లో ఆయన బహిరంగ సభల్లో మాట్లాడారు. కామవరపుకోటలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘రుణమాఫీపై చాలా సాంకేతిక ఇబ్బందులున్నాయి. ఆర్బీఐ మేం ఇవ్వలేం అంటోంది. ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్లూ ఇలానే అడుగుతారంటోంది. అయినా సరే నేను మాఫీ చేసేందుకు యత్నిస్తా. ముందుగా నాలుగైదు రోజుల్లో రీ షెడ్యూల్ చేయిస్తాం. 2014 ఏప్రిల్ ఒకటో తేదీలోపు రుణాలు తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఒక్కరికే, ఒక్క రుణానికే వర్తిస్తుంది. రీషెడ్యూల్ చేసుకున్నవారికి 12 శాతం వడ్డీ పడుతుంది. ఆ భారం రైతులపై వేయకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం’’ అని చంద్రబాబు చెప్పారు. రుణాల రీషెడ్యూల్ విషయమై తాను ఈరోజే ఆర్బీఐ గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాల మాఫీ మాత్రం తనవల్ల కాదని స్పష్టం చేశారు. ‘బంగారంపై తీసుకున్న రుణాలు చాలానే ఉన్నాయి. వ్యవసాయం పేరిట రుణం తీసుకుని వేరే వాటికి వినియోగించుకున్నారు. అటువంటి వాటి గురించి నేనేం చేయలేను’ అని చంద్రబాబు చేతులెత్తేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... పరిస్థితి అర్థం చేసుకోండి - సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురంలో నేను రుణమాఫీ ప్రకటన చేశాను. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అందుకే వ్యవసాయ రుణమాఫీ గురించి మరికొంత సమయం అడుగుతున్నాను. ఏదేమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. రైతులు అర్థం చేసుకోవాలి. - ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ కట్టాలో ఇంకా తెలియడం లేదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మారుస్తాం. నల్లమల అడవుల్లో ఇప్పటికే 15వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పట్టుబడింది. వీటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం. - ప్రస్తుతం వినియోగంలో ఉన్న పంపుసెట్లు నాణ్యమైనవి కావు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. రైతులు కొత్త పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం విద్యుత్ శాఖ నుంచి రుణాలు ఇప్పిస్తాం. - జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తాం. కేంద్రం సహకారంతో బహుళార్థసాధక ప్రాజెక్టు అరుున పోలవరంను నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. - రాష్ర్టంలో ప్రముఖ దేవాయాల్లో ప్రజలిచ్చిన కానుకలు వారికే ఉపయోగపడేలా దేవాలయాల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు నెలకొల్పాలని యోచిస్తున్నాం. ముఖ్య దేవాలయాల్లో రోజుకు 5వేల మందికి ఉచిత నిత్యాన్నదానం చేసేలా చర్యలు చేపట్టాం. అవసరమైతే గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం పెట్టే దిశగా ముందుకెళ్తాం. -
సర్కారీ ఆస్తులు తనఖా పెడదాం!
-
రుణమా(ఫీ)..హుళక్కేనా..!
సాక్షి, ఒంగోలు: ‘శుభకార్యానికి ఊరుబంతి పెడతాం.. ఇళ్లల్లో పొయ్యి వెలిగించొద్దంటూ దండోరా వేయించిన పెద్దమనిషి బియ్యంలో రాళ్లు ఏరివేసే దాకా ఆగండని ఊరి జనాల్ని రెండ్రోజులు పస్తులుంచాడంట...’ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఇది ప్రతిబంబిస్తోంది. రైతుల పరిస్థితి నేడు మరీ దారుణంగా మారింది. అప్పులు కట్టాలంటూ వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్ల ఒత్తిళ్లతో సమాధానం చెప్పలేక అన్నదాత బిక్కచచ్చిపోతున్నాడు. పాత పంట రుణాలు మాఫీ చేసి.. కొత్త రుణాలందిస్తే పంటపెట్టుబడులొస్తాయని కలలుగన్న రైతుకు సర్కారు వైఖరి కన్నీటిని మిగులుస్తోంది. రుణమాఫీ చేయకపోగా.. రీషెడ్యూల్ చేస్తామంటూ అదీ..కుటుంబానికి లక్షన్నర పరిమితితో ఆధార్‌కార్డు ఆధారంగా వర్తిస్తామంటూ పూటకో ప్రకటనలివ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాల రైతులకే రీషెడ్యూల్ వర్తిస్తోందనే నిబంధనతో జిల్లాలో అధికమంది రైతులకు ఇక కొత్తరుణం పుట్టనట్టేనని తెలుస్తోంది. అతివృష్టి లేదా అనావృష్టితో పంటలు దెబ్బతిని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది. ప్రభుత్వం కోరితే ఈ కరవు మండలాల్లో రైతుల రుణాలను బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తాయి. గత అక్టోబర్‌లో పైలిన్ తుపాను ప్రభావంతో నష్టం జరగ్గా దానిని ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం.. జిల్లాలో 56 మండలాలు ఉండగా, వాటిల్లో 45 మండలాలను తుపాను ప్రభావిత ప్రాంతాలుగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. కొన్నాళ్లకు మరో నాలుగింటిని కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఎంతమొత్తం అవుతుందనే అంచనాలు రూపొందించుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులను లెక్కలు కోరింది. కరువు మండలాల జాబి తాను బ్యాంకులకు పంపింది. ఆయా మండలా ల్లో పంటరుణాలు తీసుకున్న రైతులెంతమంది.. ? తీసుకున్న రుణం ఎంత..? ఆఘమేఘాలమీద తెలపాలంటూ బ్యాంకులను కోరింది. జిల్లా పరిస్థితిదీ.. తుపాను ప్రభావిత, కరువు మండలాల జాబితా ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తే జిల్లా రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. మెజారిటీ మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చినా .. ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలనే కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. తుపానుతో మండలం మొత్తం నష్టపోనందున.. ఏఏ గ్రామా ల్లో నష్టం జరిగిందో ఆ ప్రాంతాలను కరువు ప్రభావితంగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా లో 1098 పంచాయతీలుండగా, వాటిల్లో 441 గ్రామాలను మాత్రమే కరువు గ్రామాలుగా గుర్తించారు. దీంతో కరువు గ్రామాలుగా గుర్తించిన ప్రాంత రైతుల రుణాలనే రీషెడ్యూల్ చేసి బ్యాంకులు కొత్తరుణాలు అందజేస్తాయి. రీషెడ్యూల్ అంటే..?: బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాన్ని అదే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణాలను రీషెడ్యూల్ చేస్తే తీసుకున్న రుణాన్ని 3 నుంచి 5 ఏళ్లలో వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు నూతనంగా అంతే మొత్తం రుణా న్ని పెట్టుబడి కోసం మళ్లీ ఇస్తారు. కానీ, దీనికి (ముందుగా తీసుకున్న రుణానికి)ప్రస్తుతమున్న రేటు ప్రకారం 12.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంటరుణం కాస్తా.. టర్మ్‌లోన్‌గా మారుతుంది. తర్వాత ఇచ్చే రుణం పంట రుణం అవుతోంది. రీషెడ్యూల్ చేస్తే బకాయిలను ప్రభుత్వం దశలవారీగా చెల్లించుకోవచ్చని భావిస్తోంది. ఒకవేళ రైతులు చెల్లించినా..వారి ఖాతాల్లో డబ్బు జమచేసే ఆలోచనలో ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టతనిచ్చి రుణాలు మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. -
రుణాల రీ షెడ్యూల్ 8 వేల కోట్ల లోపే
మిగిలిన 10 వేల కోట్ల రుణాలు ఏమి చేద్దాం ? సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేవలం రూ.8,000 కోట్ల మేర రుణాలు మాత్రమే రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన పదివేల కోట్ల రూపాయలను రైతులే బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో లక్షలాది మంది రైతులకు నిరాశ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. కరువు, వరదల వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించి 90 రోజుల్లోగా కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉన్నా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించినందున, రీ షెడ్యూల్ నిబంధనలు సడలించాలని తెలంగాణ సర్కార్ రిజర్వ్ బ్యాంకును కోరుతోంది. రిజర్వ్‌బ్యాంకు ఈ విజ్ఞప్తిని మన్నించి రుణాలు రీ షెడ్యూల్ చేసి.. ఒక సంవత్సరం మారటోరియం విధిస్తుందని, ఆ తరువాత ఎప్పట్లోగా రుణాలు చెల్లించాలో మార్గదర్శకాలు జారీ చేస్తుందని ఓ అధికారి వివరించారు. రుణ మాఫీ కింద దాదాపు 17 వేల కోట్లరూపాయల పై చిలుకు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంకు పంట రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకారం తెలిపింది. బంగారు రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించలేదు. దీనితో రీ షెడ్యూల్ కాని రైతులు బకాయిలు చెల్లిస్తే తప్ప వారికి కొత్తగా రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. అలా అని రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లను ఒకేసారి చెల్లించడం సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు. ఈ రుణాలపై ఏమి చేయాలన్న అంశాన్ని బుధవారం కేబినెట్లో చర్చించనున్నారు. -
రీషెడ్యూల్ చేసినా రుణాలు డౌటే..
రైతు రుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రుణమాఫీకి రిజర్వ్‌బ్యాంకు తిరకాసు పెడుతుండటంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని రీషెడ్యూల్ చేసి తాత్కాలిక ఉపశమనం పొందే యత్నం చేస్తోంది. కరువు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోటే రీషెడ్యూల్కు అవకాశముండగా.. కరువు ప్రాంతాల ఎంపికలో ప్రభుత్వం అనుసరించిన విధానంతో రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం గద్దెనెక్కి నెలన్నర కావస్తుండగా రైతుల రుణమాఫీపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మాఫీకి బదులు రీషెడ్యూల్ చేయనున్నారనే వార్తలు జిల్లా రైతుల్లో గుబులు పుట్టిస్తున్నా యి. కరువు మండలంగా ప్రకటిస్తేనే రీషెడ్యూల్కు అవకాశముంటుంది. అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని, బ్యాంకుల్లో రైతు లు తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది. ప్రభుత్వం కోరితే రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం.. పంట రుణాలు ఇచ్చిన బ్యాం కులు... ఈ కరువు మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. గత అక్టోబర్‌లో జిల్లాలో పైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టం జరగ్గా దానిని ప్రమాణికంగా తీసుకున్న ప్రభుత్వం... జిల్లాలో 57 మండలాలుండగా పంటనష్టం జరిగిన 50 మండలాలను కరువు మండలాలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఎంత మొత్తం అవుతుందనే అంచనాలు రూపొందిం చుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులను లెక్కలు కోరింది. కరువు మండలాల జాబితాను బ్యాం కులకు పంపించింది. ఆయా మండలాల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది? తీసుకున్న రుణం ఎంత? ఆఘమేఘాల మీద తెలపాలంటూ బ్యాంకులను కోరింది. అలాగైతే అన్యాయమే కరువు మండలాల జాబితా ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తే జిల్లా రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. జిల్లాలో మెజారిటీ మం డలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా... ఆ మండలంలోని కొన్ని గ్రామాలనే కరువు గ్రా మాలుగా చూపింది. తుపాన్‌తో మండలం మొత్తం పంట నష్టపోనందున ఏఏ గ్రామాల్లో నష్టం జరిగిందో అదే గ్రామాలను కరువు గ్రా మాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 1200కు పైగా గ్రామాలకు గాను 979 గ్రామాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించా రు. దీంతో రుణాలు రీషెడ్యూల్ చేస్తే బ్యాంకు లు కరువు గ్రామాలుగా ప్రకటించిన గ్రామ రైతుల రుణాలనే రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇస్తాయి. మిగతా గ్రామ రైతులకు మొండిచె య్యే ఎదురుకానుంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో మండలానికి నాలుగైదు గ్రా మాలనే ఈ జాబితాలో చేర్చారు. ఉదాహరణకు జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలంలో 31 గ్రామాలుండగా కేవలం నాలుగే(బాలెపల్లి, ధర్మారం, కన్నాపూర్, తిమ్మాపూర్) గ్రామాలను మాత్రమే కరువు గ్రామాలుగా గుర్తించారు. రాయికల్ మండలంలో 27 గ్రామాలుండగా... కట్కపూర్, తాట్లవాయి, రాజ్‌నగర్, ఆలూర్ గ్రామాలను, సారంగాపూర్ మండలంలో 22 గ్రామాలుండగా తుంగూర్, బట్టపల్లి, పోతారం, సారంగాపూర్, అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించారు. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో... గ్రామాలకు గాను ఐలాపూర్, పెద్దపూర్లు మాత్రమే కరువు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలు అసలు కరువు మండలాల జాబితాలోనే లేవు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం కూడా జాబితాలో లేదు. దీంతో మెజారిటీ గ్రామాల్లో రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం లేకపోగా రైతులకు కొత్త రుణా లు అందే అవకాశం లేదు. ఫలితంగా వారు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేలా లేదు. ఒక వేళ రీషెడ్యూల్ చేస్తే కరువు గ్రామాలు కాని రైతుల రుణాలను మాఫీ చేస్తారా? లేక ఏం చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతోఆందోళనకు గురవుతున్నారు. రీ-షెడ్యూల్ అంటే.. సాధారణంగా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాన్ని అదే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే తీసుకున్న రుణాన్ని 3 నుంచి 5 ఏళ్లలో వాయిదాల పద్ధతి లో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు నూతనంగా అంతే మొత్తం రుణాన్ని పెట్టుబడి కోసం మళ్లీ ఇస్తారు. కానీ, దీనికి(ముందుగా తీసుకున్న రుణానికి) ప్రస్తుతమున్న రేటు ప్రకా రం 12.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పంట రుణం కాస్తా... టర్మ్ లోన్‌గా మా రుతుంది, తర్వాత ఇచ్చే రుణం పంట రుణంగా మారుతుంది. రీషెడ్యూల్ చేస్తే బకాయిలను ప్రభుత్వమే దశలవారీగా చెల్లించుకోవచ్చని భా విస్తోంది. ఒకవేళ రైతులు చెల్లించినా... వారి ఖా తాల్లో డబ్బు జమ చేసే ఆలోచనలో ఉంది. ప్ర భుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి రుణాలు మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు పడుతున్నందున పెట్టుబడికి ఇబ్బంది కాకుండా బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదు.. రీ షెడ్యూలే
హైదరాబాద్: రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మెలిక పెట్టారు. ప్రస్తుతానికి రుణమాఫీ ఉండదని, రీ షెడ్యూల్ మాత్రమే చేస్తామని చంద్రబాబు చెప్పారు. శనివారం విజయవాడకు వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 2014 ఏప్రిల్ నాటికి ఉన్న రుణాల్లో ఓ కుటుంబానికి ఓ లోన్ మాత్రమే మాఫీ చేస్తామని తెలిపారు. -
రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ అంగీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనివల్ల కొత్త రుణాలు మంజూరు చేయడానికి సమస్య ఉండదని చెప్పారు. ఎంతమేర రీషెడ్యూల్ చేశారన్న విషయం లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాక తెలుస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.