సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు.
అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారాయన. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది.
వివిధ సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment