TS set
-
TS SET: టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారాయన. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. వివిధ సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేయనున్నారు. -
TS SET 2022: మార్చి 13 నుంచి టీఎస్‌సెట్ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.1,500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలను టీఎస్‌సెట్–2022 వెబ్సైట్లో చూడవచ్చన్నారు. (క్లిక్ చేయండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
రేపటి నుంచే టీఎస్‌సెట్ దరఖాస్తులు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే టీఎస్‌సెట్–2018లో 29 సబ్జెక్టులకు గాను రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి సోమవారం తెలిపారు. అధ్యాపక ఉద్యోగాల అర్హతకు, పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశాలకు పీజీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు టీఎస్సెట్కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో కుల ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేసి పంపించాలన్నారు. రేపటి నుంచి www.telanganaset.org/ www.osmania. ac.in వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. రేపటి నుంచి ఏప్రిల్ నెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ట్రాన్స్జెండర్లు రూ.500, బీసీలు రూ.800, ఓసీలు రూ.1,000 ఫీజు చెల్లించాలన్నారు. రూ.1,500 అపరాధ రుసుముతో వచ్చే నెల 24 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే నెల 4 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో మే నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జూలై 15న టీఎస్‌సెట్–2018ను హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర రిజర్వేషన్లు వర్తింపు.. టీఎస్సెట్లో ఈ సారీ రెండు పేపర్లు మాత్రమే ఉంటాయని అన్నారు. జూలై 15న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు వంద మార్కుల జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్, 12.15 నిమిషాల నుంచి 1.15 నిమిషాల వరకు 200 మార్కులకు సంబం ధిత సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ట్రాన్స్జెండర్లకు 35 శాతం, ఓసీలకు 40 శాతం మార్కులుగా రావాల్సిందిగా ప్రకటించారు. గతంలో మాదిరి కాకుండా బీసీలకు రాష్ట్ర రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు యాదగిరిస్వామి వివరించారు. -
నేటి నుంచి టీఎస్‌సెట్–2017 సర్టిఫికెట్ల జారీ
హైదరాబాద్ : టీఎస్‌సెట్–2017లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం నుంచి (9వ తేదీ) నుంచి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు సెట్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి గురువారం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలోని సెట్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చని వెల్లడించారు. -
జూలై 15న టీఎస్‌సెట్–2018
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (టీఎస్‌సెట్–2018) పరీక్షను జూలై 15న (ఆదివారం) నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఓయూ కార్యాలయంలో టీఎస్‌సెట్–2018 చైర్మన్, వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, బీసీలకు రూ. 800, ఓసీలకు రూ.1000గా నిర్ణయించినట్లు తెలిపారు. రూ.1500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 24 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుముతో మే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలను www.telanganaset.org/ www.osmania.ac.in వెబ్సైట్లలో పొందవచ్చని తెలిపారు. -
టీఎస్ సెట్ 2017 నోటిఫికేషన్ విడుదల
జూన్ 11న పరీక్ష.. ఈనెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల భర్తీ కోసం నిర్వహించే టీఎస్–సెట్ 2017 (తెలంగాణ స్టేట్– స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎస్.రామచంద్రం గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 11న నిర్వహించే టీఎస్–సెట్ పరీక్షకు సంబంధించి ఈనెల 22 నుంచి మార్చి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనరల్ అభ్యర్థులు రూ.1,000, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత గడువు తర్వాత లేట్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. రూ.1,500 ఆలస్య రుసుముతో మార్చి 30 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము కేటగిరీలో రిజిస్ట్రేషన్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 20 నుంచి ఆన్లైన్లో హాల్ టిక్కెట్లు పొందవచ్చు. కాగా డిగ్రీ లెక్చరర్లు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియామకం కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టీఎస్–సెట్లో తప్పని సరిగా ఉత్తీర్ణులై ఉండాలి.