సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (టీఎస్‌సెట్–2018) పరీక్షను జూలై 15న (ఆదివారం) నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఓయూ కార్యాలయంలో టీఎస్‌సెట్–2018 చైర్మన్, వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ యాదగిరిస్వామి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, బీసీలకు రూ. 800, ఓసీలకు రూ.1000గా నిర్ణయించినట్లు తెలిపారు. రూ.1500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 24 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుముతో మే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలను www.telanganaset.org/ www.osmania.ac.in వెబ్‌సైట్లలో పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment