
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం సాయంత్రవేళ అంబర్ పేటలో శోభాయాత్ర ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ..శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభాయామానంగా నిర్వహించడం శుభపరిణామం.
దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభాయాత్రలు, సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత భక్తులలో మరింత పట్టుదల, భక్తిశ్రద్ధలు పెరిగాయి. ఇది మంచి శుభపరిణామం’ అని అన్నారు కిషన్ రెడ్డి.