Sri Rama Navami
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర (ఫొటోలు)
-
Sri Ramanavami Asthanam: తిరుమల : కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం (ఫొటోలు)
-
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు..(ఫొటోలు)
-
తిరుపతిలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు..
-
ముస్తాబైన భద్రాచలం
-
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
రాముడి చిత్రమ్.. వెండితెర పైనా రామ నామం
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం. ► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం. ► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె. ‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు. ► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్వీర్ కాంబినేషన్లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, రామ నవమి సందర్భంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ఇచ్చారు. తిరిగి రేపు(గురువారం) బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్..‘తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’ తెలిపారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి… — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2024 -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు.