
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు వేడుక మంగళవారం ఆద్యంతం ఆసక్తిగా సాగింది

గరుత్మంతుడి వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు

అక్కడ ‘మా వంశం గొప్పదంటే.. కాదు మా వంశమే గొప్ప’ అంటూ కొందరు అర్చకులు సీతమ్మ తరఫున, మరి కొందరు రామయ్య వైపు చేరి సంవాదం చేసుకోవడం రక్తి కట్టించింది

శ్రీ సీతారాముల వారి వైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తామని పండితులు తెలిపారు

ఆ తర్వాత ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి తీసుకెళ్లారు. కాగా రామచంద్రస్వామి తరఫున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సీతమ్మ వారి తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పట్టువస్త్రాలు సమర్పించారు
























