Sri Rama Navami 2024
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం (ఫొటోలు)
-
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి సందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల పీవీ సింధు మీడియాతో మాట్లాడారు. ‘‘ శ్రీ రామ నవమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మలేసియా, ఇండోనేషియాలో టోర్నమెంట్స్, ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లలో బాగా రాణించాలని కోరుకున్నా’’ అని పీవీ సింధు తెలిపారు. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ సీతారాంబాగ్‌లో శ్రీరాముని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీసీతారామ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా యోగి స్వామి హాజరయ్యారు. కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించారు. శోభాయాత్ర జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోషామహల్, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. 21 ప్రాంతాల్లో శోభా యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకు హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకోనుంది. -
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు!
అమెరికా ఇల్లినాయిస్లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని బాలాజీ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిది. ఈ వేడకలకు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సీటీఏ కల్చరల్ డైరెక్టర్ శ్రీమతి సుజనా ఆచంట, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలకి, వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, శాస్త్రీయ సంగీతం, తెలుగు భాష స్కిట్లు ఎంతగానో అరించాయి. అలాగే ఉగాది పచ్చడి పోటీలు కూడా నిర్వహించారు. శోభా తమ్మన, జానకి నాయర్, ఆశా అడిగా, వనిత వీరవల్లి వంటి గౌరవనీయ గురువులు ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పిల్లలు శాస్త్రీయ నృత్యాలు, సంగీతంతో అలరించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో గురు రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన అనతి నీయారాతో సహా..ముగింపులో రవిశంకర్ మరియు అతని బృందం పాడిన 'భో శంభో', 'బ్రహ్మ ఒకటే' వంటి భక్తి పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ఈవెంట్‌కి అతిధులుగా సత్య, ఏటీఏకు చెందిన కడిమళ్ల, కరుణాకర్ మాధవరం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సీటీఏ కల్చరల్ కమిటీ సభ్యులు రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ, చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపలపాటి, ప్రత్యేక వాలంటీర్ల బృందం, సాయిచంద్ మేకల, భవానీ సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్ తొక్కాల,నాగభూషణ్ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్, రమేష్, నరేంద్ర, బాల, చక్రధర్, వివేక్ కిలారు, రామానుజం, శశిధర్, రమేష్, మృదుల, సీటీఏ బోర్డు సభ్యులు ప్రవీణ్ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్ పగడాల, ప్రసాద్ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్ విరాటపు, రమేష్ మర్యాల, తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, జయప్రదం చేయడంలో సహాయసహకరాలు అందించిన సీటీఏ బోర్డు సభ్యులకు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
Sri Ramanavami Asthanam: తిరుమల : కమనీయం.. శ్రీ సీతారాముల కల్యాణం (ఫొటోలు)
-
Quiz On Lord Rama: శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
నేడు శ్రీరామ నవమి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు?... శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఈ కింద లింక్ క్లిక్ చేసి క్విజ్‌లో పాల్గొనండి.. -
Bhadrachalam Sri Rama Navami: భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు (ఫొటోలు)
-
Ayodhya Video: బాలరాముడికి సూర్య తిలకం
Live Updates ►బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు.. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై పడిన సూర్య కిరణాలు.. #WATCH | ‘Surya Tilak’ illuminates Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple in Ayodhya, on the occasion of Ram Navami. (Source: DD) pic.twitter.com/rg8b9bpiqh — ANI (@ANI) April 17, 2024 ►భక్తజన సంద్రంగా మారిన అయోధ్య. ►బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు श्री राम जन्मभूमि मंदिर, अयोध्या से प्रभु श्री रामलला सरकार के मंगल जन्मोत्सव का सीधा प्रसारण LIVE webcast of Mangal Janmotsav of Prabhu Shri Ramlalla Sarkar, from Shri Ram Janmabhoomi Mandir, Ayodhya https://t.co/WQKw2u10pe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 17, 2024 ►ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/MTGzGvcbud — ANI (@ANI) April 17, 2024 ►భారీ ఏర్పాట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ►ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం వేడుక ►అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు. #WATCH | Pooja performed at the Ram Temple in Ayodhya, Uttar Pradesh on the occasion of #RamNavami Ram Navami is being celebrated for the first time in Ayodhya's Ram Temple after the Pran Pratishtha of Ram Lalla. (Source: Temple Priest) pic.twitter.com/3sgeuIdXBB — ANI (@ANI) April 17, 2024 ఇక, శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాలరాముడు. పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాల రాముడు మెరిసిపోతున్నాడు. కాసేపట్లో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్న సూర్యభగవానుడు. ఈ సందర్భంగా నాలుగు నిమిషాలపాటు బాలరాముడి నుదుటిపై కిరణాలు పడతాయి. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఆలయ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. This is the first #RamNavami after 496 years since 1528 when Lord Shri Ram is in his grand #AyodhyaRamTemple after 5 centuries of sacrifice, penance and struggle of his devotees..!! The Lord tests his devotees and it takes many generations for the collective power and strength… pic.twitter.com/6LFsPuPEPE — Megh Updates 🚨™ (@MeghUpdates) April 17, 2024 దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?
శ్రీరామ నవమి అనంగానే తాటాకు పందిళ్లు రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచి పెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఆ టైం కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధివీధుల్లో ఈ తంతు, కోలాహాలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే.. అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేగాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు..(ఫొటోలు)
-
శ్రీరాముని దివ్య రూపం.. ఏఐ ఫోటోలు
-
నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు..? నవమి నాడే కళ్యాణం ఎందుకంటే.. ఆగమ శాస్త్రం ప్రకారం... శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. అందువల్ల గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే.. ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కళ్యాణం జరిగినప్పుడే లోక కళ్యాణ యజ్ఞానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించబడింది. శ్రీరామ చంద్రుడు, జానకి దేవి ఇద్దరూ సాధారణ వ్యక్తులు కాదు. వీరిద్దరూ యజ్ఞ ఫలితం ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దశరథ మహారాజు తన వంశం తరించడానికి పుత్ర సంతానం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఞం నిర్వహించేందుకు యాగ శాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఞప్రసాదమే సీతమ్మ తల్లి. చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కళ్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు. తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం పాటను భజంత్రీలు పాడుతుంటారు. "శ్రీ సీతారామాభ్యాంనమ:" అంటూ పూజలు కూడా చేస్తారు. ఈ శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. శ్రీరామచంద్రుడిని తెలుగు వారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. అంతేకాదండోయ్ రామాలయం లేని ఊరే ఉండదు కూడా. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. మరో కథనం ప్రకారం.. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటా.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి ఏడాది భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ చరితార్థం అవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..) -
భద్రగిరికి కళ్యాణ శోభ.. ఎదుర్కోలు వేడుకలో సీతా, రాముడు (ఫొటోలు)
-
అయోధ్యలో తొలి శ్రీరామ నవమి వేడుకలు..ప్రత్యేకతలు ఏంటంటే..!
అయోధ్యలో ప్రారంభమైన కొత్త రామాలయం తొలి శ్రీరామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. అవేంటో సవివరంగా చూద్దామా..! శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేలా రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దర్శనం, హారతి సమయానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కోసం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీరాముడిని దర్శించుకునేలా అనుమతించింది. సుమారు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. అందువల్ల ఈ రోజున వీఐపీ ప్రత్యేక దర్శనాలు నిషేధించారు. మళ్లీ ఈ నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి వీఐపీ పాసులు అందుబాటులోకి రానున్నాయి. దర్శన వేళలు.. ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది. బాల రాముడికి సూర్యుడి తిలకం.. శ్రీరామ నమమి రోజున అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. బాలరాముడి నుదిటి మీద శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి కిరణాలు నుదిట మీద పడే విధంగా ఏర్పాటు చేశారు. పురాణల ప్రకారం..చైత్రమాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందువల్ల మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు బాల రాముడి నుదుటి మీద సూర్యకిరణాలతో తిలకం పడేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి తిలకించే విధంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అంతేగాదు అయోధ్య నగరం అంతటా దాదాపు వంద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీరామ జన్మోత్సవ వేడుకలు ప్రసారం కానున్నాయి. ట్రస్ట్ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఉంటాయి. ఏకంగా లక్ష కేజీల లడ్డూలు.. శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?) -
నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి తంతు ఇలా.. ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మంటపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావిస్తారు. ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటివరకు మంటపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్త్ర బంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరలు ఉంటాయి. అనంతరం కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్రస్తాలను సీతారాములకు ధరింపజేస్తారు. అదే విధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. అభిజిత్ లగ్నంలో చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి, అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళ హారతి అందిస్తారు. కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. పూర్తయిన ఏర్పాట్లు సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేర్వేరు ధరల్లో టికెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామ నవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో భద్రాద్రితో భక్తులకు వసతి లభించడం దుర్లభంగా మారింది. లాడ్జీల్లో రేట్లు రెండు, మూడింతలు పెంచేశారు. పెరిగే ట్రాఫిక్‌కు తగ్గట్టుగా గోదావరిపై రెండో వంతెనను అందుబాటులోకి తెచ్చారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఘనంగా ఎదుర్కోలు వేడుక శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు వేడుకను కనుల పండువగా నిర్వహించారు. రామయ్య తరఫున కొందరు, సీతమ్మవారి తరఫున కొందరు అర్చకులు విడిపోయి ‘మా వంశమే గొప్పదంటే..కాదు కాదు.. మా వంశమే గొప్ప’అంటూ సంవాదం చేసుకుంటూ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు. -
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
రాముడి చిత్రమ్.. వెండితెర పైనా రామ నామం
అంతా రామమయం... ఈ జగమంతా రామమయం... ఈరోజు దాదాపు ఎక్కడ చూసినా రామ నామమే. వెండితెర పైనా రామ నామం వినపడబోతోంది. రాముడిపై ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. త్వరలో కొన్ని చిత్రాలు రానున్నాయి. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముడి చిత్రాల గురించి తెలుసుకుందాం. ► 1980లలో రాముడంటే బుల్లితెర వీక్షకులు చెప్పిన పేరు అరుణ్ గోవిల్. ‘రామాయణ్’ సీరియల్లో రాముడిగా అంత అద్భుతంగా ఒదిగిపోయారాయన. ఇప్పటికీ రాముడంటే చాలామంది అరుణ్∙పేరే చెబుతారు. రాముడి కథాంశంతో ఇటీవల విడుదలైన ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’లో ఆయన నటించారు. ‘‘ఒక కాలాతీత కథలో మళ్లీ నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ‘695: ట్రైంప్ ఆఫ్ ఫైత్’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సాంస్కృతిక వారసత్వం’’ అని పేర్కొన్నారు అరుణ్ గోవిల్. రామ జన్మభూమిపై రజనీష్ బెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలో విడుదలైంది. ► రాముడు ఆజానుబాహుడు.. అందగాడు... వీరం, కరుణ, ప్రేమ... ఇలా సకల గుణాలూ ఉన్నవాడు. ఎన్ని ఉన్నా అసలు రాముడంటే సౌమ్యంగా కనిపించాలి. రణ్‌బీర్ కపూర్ దాదాపు అలానే ఉంటారు. అందుకే దర్శకుడు నితీష్ తివారీ తన ‘రామాయణ్’ చిత్రానికి రాముడిగా రణ్‌బీర్ కపూర్‌ని ఎన్నుకున్నారు. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ చిత్రం షూట్ంగ్ ఈ మధ్యే ముంబైలో ఆరంభించారు. ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా ఓ నిర్మాత కాగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మరో నిర్మాత. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కూడా యశ్ చేస్తారట. నేడు ఈ చిత్రం గురించి ఆధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది దీపావళికి ‘రామాయణ్’ రిలీజవుతుందని సమాచారం. ► ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తున్న కంగనా రనౌత్‌ది కథానాయికల్లో సెపరేట్ రూట్. స్వతహాగా రాముడి భక్తురాలైన కంగనా ఇప్పటికే రామ మందిరం నేపథ్యంలో ‘అపరాజిత అయోధ్య’ చిత్రాన్ని, ‘సీత: ది ఇన్కార్నేషన్’ చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇవి పట్టాలెక్క లేదు. గత ఏడాది తన ‘తేజస్’ చిత్రం విడుదల సందర్భంగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని సందర్శించారు కంగనా రనౌత్. ఆ సమయంలో అయోధ్యపై తాను కథ సిద్ధం చేశానని పేర్కొన్నారామె. ‘‘ఇది ఆరువందల ఏళ్ల పోరాటం. ఇప్పుడు రామ మందిరం సాధ్యమైంది. అయోధ్యపై కథ రాయడానికి నేను చాలా పరిశోధించాను’’ అని కూడా చెప్పారు కంగనా రనౌత్. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియజేయలేదు. ► తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను మాన్’ గడచిన సంక్రాంతికి విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రానుంది. ‘జై హనుమాన్’ కథ రాయడానికి ఓ పాన్ ఇండియా స్టార్ స్ఫూర్తి అన్నట్లుగా ప్రశాంత్ వర్మ ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండో భాగం ప్రధానంగా హనుమంతుడి నేపథ్యంలో సాగుతుందని టాక్. వార్తల్లో ఉన్న ప్రకారం హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తారట. ‘హను మాన్’ చిత్రం చూసి, ప్రశాంత్ వర్మకు రణ్వీర్ ఫ్యాన్ అయ్యారని సమాచారం. ఇటీవల ఈ ఇద్దరి మధ్య ‘జై హనుమాన్’ గురించి చర్చలు జరిగాయని, రణ్‌వీర్‌కు స్క్రిప్ట్ కూడా నచ్చిందని భోగట్టా. కాగా.. ప్రశాంత్–రణ్వీర్ కాంబినేషన్లో రూపొందనున్నది ‘జై హనుమాన్’ కాదు.. వేరే చిత్రం అనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ తెరకెక్కించడం ఖాయం. ఈ చిత్రం నటీనటుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇవే కాదు.. రాముడిపై ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన మరిన్ని చిత్రాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, రామ నవమి సందర్భంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ఇచ్చారు. తిరిగి రేపు(గురువారం) బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభమవుతుంది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్..‘తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’ తెలిపారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి… — YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2024 -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట.