Ayodhya Video: బాలరాముడికి సూర్య తిలకం | Sri Rama Navami Celebrations At Ayodhya Temple | Sakshi
Sakshi News home page

Ayodhya Live Updates: అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అప్‌డేట్స్‌

Published Wed, Apr 17 2024 11:39 AM | Last Updated on Wed, Apr 17 2024 12:23 PM

Sri Rama Navami Celebrations At Ayodhya Temple - Sakshi

Live Updates

బాల రాముడికి తిలకం దిద్దిన సూర్య కిరణాలు.. మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదిటిపై పడిన సూర్య కిరణాలు..

భక్తజన సంద్రంగా మారిన అయోధ్య.

బాలరాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు 

ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి అయోధ్యలో శ్రీరామనవమి 

భారీ ఏర్పాట్లు చేసిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం వేడుక

అయోధ్యలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు.

ఇక, శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాలరాముడు.  పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాల రాముడు మెరిసిపోతున్నాడు. కాసేపట్లో బాలరాముడికి సూర్యతిలకం దిద్దనున్న సూర్యభగవానుడు. ఈ సందర్భంగా నాలుగు నిమిషాలపాటు బాలరాముడి నుదుటిపై కిరణాలు పడతాయి. భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడేలా ఆలయ నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. 

దర్శన వేళలు..
ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున భక్తులకు శ్రీరాముడి దర్శనం కోసం 19 గంటల పాటు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. నాలుగు భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే తెర మూసివేయనున్నారు. విశిష్ట అతిథులు ఏప్రిల్ 19 తర్వాత మాత్రమే దర్శనం కోసం సందర్శించాలని అయోధ్య రామ మందిర ట్రస్ట్ వెల్లడించింది.

ఏకంగా లక్ష కేజీల లడ్డూలు..
శ్రీరామనవమి రోజు రాముల వారి కోసం 1,11,111 కేజీల లడ్డూలను అయోధ్య రామ మందిరానికి పంపించననుంది దేవర్హ హన్స్ బాబా ట్రస్ట్. ఆ ట్రస్ట్‌ ఈ లడ్డూలను ప్రసాదంగా రామ మందిరానికి పంపిస్తుంది. ఈ విషయాన్ని ట్రస్ట్ సభ్యుడు అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఈ ట్రస్ట్ జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ట వేడుకకు 40 వేల కేజీల లడ్డూలు ఇచ్చింది. రామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి సుమారు 25 నుంచి 35 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement