![Sri Rama Navami Shobha Yatra At Sitaram Bagh Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/17/shobhayatra4.jpg.webp?itok=AhLDPxK4)
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ సీతారాంబాగ్‌లో శ్రీరాముని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీసీతారామ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా యోగి స్వామి హాజరయ్యారు. కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు.
కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించారు. శోభాయాత్ర జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గోషామహల్, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. 21 ప్రాంతాల్లో శోభా యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకు హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment