Shobha Yatra
-
కరీంనగర్ : కనుల పండువగా శ్రీవారి శోభాయాత్ర (ఫొటోలు)
-
కడపలో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర.. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు (ఫొటోలు)
-
Khairatabad ganesh : ఘనంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర (ఫోటోలు)
-
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర (ఫొటోలు)
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ సీతారాంబాగ్‌లో శ్రీరాముని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీసీతారామ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా యోగి స్వామి హాజరయ్యారు. కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించారు. శోభాయాత్ర జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోషామహల్, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. 21 ప్రాంతాల్లో శోభా యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకు హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకోనుంది. -
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పోలీస్ డ్యాన్స్ అదుర్స్
-
బాలాపూర్ గణేష్ శోభా యాత్ర
-
Live: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర
-
హైదరాబాద్: వర్షంలో తడుస్తూ హనుమాన్ శోభాయాత్ర (ఫొటోలు)
-
హైదరాబాద్ : జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన శోభాయాత్ర (ఫొటోలు)
-
HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్, రిజర్వ్ పోలీస్ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే.. -
HYD: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శ్రీరామనవమి సందర్బంగా పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారామ కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కాగా, శ్రీరామనవమి సందర్బంగా శోభాయాత్ర జరగనుంది. నేడు(గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు శోభాయత్ర ప్రారంభం కానుంది. శ్రీరాముని శోభాయాత్ర మొత్తం 6 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్, సల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. In view of Sri Rama Navami shobha yatra traffic diversions will be imposed in Hyderabad City on 30-3-2023 శ్రీరామ నవమి శోభ యాత్ర దృష్ట్యా 30-3-2023న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించబడతాయి.#sriramvavami2023 #TrafficDiversions #hyderabadcity pic.twitter.com/m4CBwmcC8C — Hyderabad City Police (@hydcitypolice) March 29, 2023 -
ధూల్ పేట్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో రామనవమి శోభాయాత్ర
-
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర (ఫొటోలు)
-
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
శోభాయమానంగా.. ‘శోభాయాత్ర’
సాక్షి, హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన వీరహనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, కాషాయవర్ణ శోభిత నిలువెత్తు హనుమాన్ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది.విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రకు నగరం నలు మూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. గౌలిగూడ రామమందిర్లో యజ్ఞం నిర్వహించిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్, కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి వినాయక్దేశ్ పాండేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్రకుట్ స్వామి రామ హృదయ్‌దాస్, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు హనుమంతుడి జెండాను చేతబూని గౌలిగూడ నుంచి తాడ్బంద్వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.శోభాయాత్ర ఉత్తేజభరితంగా, ప్రశాంతంగా సాగింది. భారీ బందోబస్తు...... గౌలిగూడ రామమందిర్ నుంచి సాగిన శోభాయాత్రకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.అడుగడుగునా సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఉంచారు. రామ మందిరం పనులు ప్రారంభిస్తాం : అలోక్‌కుమార్ వీరహనుమాన్ శోభాయాత్రలో భాగంగా కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదికలో వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యఅధ్యక్షుడు అలోక్‌కుమార్ స్వామి రామ హృదయ్‌దాస్, వినాయక్ దేశ్‌పాండేలు మాట్లాడారు. ఏడాదిలోపు అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు యువశక్తిలోని ఐక్యతను చాటాయని, ఇంది ఎంతో శుభసూచకమన్నారు. ఈ శోభాయాత్ర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. దుష్టశక్తుల నాశనానికి ఇలాంటి ఐక్యత అవసరమన్నారు. గతంలో ఎలాంటి ఆయుధాలు , డైనమెట్ లేకుండా చేతులతోనే అయోధ్యలో అక్రమ కట్టడాలను కూల్చివేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ హిందూ ప్రజల ఐక్యత ఉందనడానికి నిదర్శనం ఈ శోభాయాత్రనే అన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామదాస్, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, నేతలు గాల్‌రెడ్డి, కైలాశ్, ముఖేష్‌లతో పాటు స్థానిక నాయకులు డాక్టర్ భగవంత్‌రావు, యమన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం విక్రయాలు బంద్..
కంటోన్మెంట్,సుల్తాన్‌బజార్: హనుమాన్ జయం తిని పురస్కరించుకుని ఈ నెల 19న నిర్వహించనున్న శోభాయాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఇతర అధికారులతో కలిసి శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1,200 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాత్రామార్గంలో 450 ప్రత్యేక సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం గౌలిగూడ నుంచి ప్రారంభం కానున్న శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నందున మార్గమధ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. రహదారుల మరమ్మతులు పూర్తి చేశామని. వేసవి దృష్ట్యా భక్తులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో శోభాయాత్ర విధులకు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తాడ్బంద్ హనుమాన్ ఆలయం వద్ద యాత్ర ముగుస్తుందన్నారు. యాత్రా మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తాడ్బంద్ దేవాలయ కమిటీ చైర్మన్ బూరుగు వీరేశం అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. ట్రాఫిక్ మళ్లింపులపై విస్తృత ప్రచారం సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరిగే ఈ భారీ ఊరేగింపునకు నగర పోలీసులు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆ రోజు తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఉరేగింపు మార్గాల్లో అధికారులు స్వయంగా పర్యటించి సమస్యలను గుర్తించాలని సూచించారు. ఏ ప్రాంతంలో అయినా అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లకు కచ్చితంగా దారివదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్న ప్రాంతాల్లో బారికేడ్లు, సైనేజెస్ ఏర్పాటు చేయాలన్నారు. వీటి వల్ల సామాన్య వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రావని, ఊరేగింపునకు ఆటంకం ఉండదని ఆయన పేర్కొన్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఎత్తైన స్థంభాలపై ఏర్పాటు చేసిన, మెబైల్ వేరియబుల్ మెసేజ్ బోర్డుల ద్వారా వాహనచోదకులకు ఎప్పటికప్పుడు సమాచారం, సలహాలు, సూచనలు అందించాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, ఆయా మార్గాల్లో ఉన్న రద్దీని గూగుల్ మ్యాపుల్లోనూ కనిపించేలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, కె.బాబూరావు తదితర అధికారులు పాల్గొన్నారు. రూట్ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తదితరులు మద్యం విక్రయాలు బంద్ హనుమాన్ జయంతి ర్యాలీ నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు నగరంలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తదితరాలు మూసి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ క్లబ్బులు, స్టార్ హోటల్స్‌లో ఉన్న బార్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర
-
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
-
గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటిగంటలోపే గణపతి నిమజ్జనం పూర్తయింది. తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి నిమజ్జనం కోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ క్రేన్ వద్ద శోభాయాత్ర చేరుకుంది. నగరంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం అప్డేట్స్ ఇవి. టాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు హుస్సేన్ సాగర్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు బారులు తీరిన గణనాధుల శోభాయాత్ర రథాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 51,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఒక్క ట్యాంక్బండ్లోనే 16 వేల విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 29 క్రేన్లు, నెక్లెస్ రోడ్ మార్గంలో 9క్రేన్లు.. మొత్తం 38 క్రేన్ల ఏర్పాటు చేశాం. - దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడి విగ్రహాలు బారులు తీరాయి. నిర్విరామంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ సప్త ముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర.. ఇప్పటికే సెన్సేషన్ థియేటర్ దాటి వాసవీ అతిధిగృహం వరకు చేరుకున్న శోభా యాత్ర.. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావటం.. పెద్దగా భక్తులు రాకపోవటంతో నిమజ్జనం ఘాట్‌కు ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటలలోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం. నగరంలో వినాయక నిమజ్జనానికి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. నగరంలో సాగుతున్న వినాయక శోభాయాత్ర వీఆర్ డీవోటీ యాప్ తిలకించవచ్చు. ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న వెంకయ్యనాయుడు. ఆయన రాక సందర్భంగా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. -
కనుల పండువగా శోభాయాత్ర
-
పాతబస్తీలో శోభాయాత్ర: 20వేలమందితో బందోబస్తు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించే శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్రకు 20 వేలమంది పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. ధూల్‌పేట్ నుంచి మొదలైన శోభాయాత్ర గౌలిగూడ దగ్గర ముగుస్తుందని, శోభాయాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 9 గంటలకు శోభాయాత్ర పూర్తి అవుతుందని తెలిపారు. -
వేడుకగా హనుమాన్ శోభాయాత్ర
-
శ్రీరామనవమి శోభాయాత్ర వైభవం
-
ఎట్టకేలకు మొదలైన మహాగణేశుడి శోభాయాత్ర
ఖైరతాబాద్‌లో కొలువైన మహాగణపతి శోభాయాత్ర ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మొదలైంది. వాస్తవానికి ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుందని తొలుత భావించినా, ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో బాగా ఆలస్యమైంది. అంతకుముందు 59 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపైకి చేర్చి వెల్డింగ్ తదితర పనులు పూర్తి చేశారు. కాగా, ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంశు పాల్గొన్నాడు. ముందుగా ఖైరతాబాద్ గణపతికి పూజలు చేసిన హిమాంశు, తాను ప్రతిసారీ ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకుంటున్నాను గానీ, నిమజ్జనానికి వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాడు. తాత, నాయనమ్మలతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని పూజించినట్లు తెలిపాడు. -
తిరుమలలో ప్రారంభమైన శోభాయాత్ర
తిరుమల: తిరుమల నుంచి గోదావరి పుష్కరాలకు శోభయాత్ర గురువారం ప్రారంభమైంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రను టీటీడీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదగా ఈ యాతర్ కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ... ఈ సారెను గోదావరి తల్లికి సమర్పిస్తారు. -
హైదరాబాద్‌లో రాములోరి శోభాయాత్ర
-
ఖైరతాబాద్ గణేషు నిమజ్జనం
-
రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర దాదాపు 12గంటలపాటు సాగుతుందని నిర్వహకులు వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం జరుగుతుందని నిర్వహకులు వెల్లడించారు. ఖైరతాబాద్ భారీ గణనాధుడికి తెలంగాణ ప్రభుత్వం పుష్పాభిషేకం చేసింది. ఆకాశం నుంచి చార్టర్ విమానం ద్వారా మూడు టన్నుల పూలను వినాయకుడిపై చల్లారు. గణేష్ శోభాయాత్ర కార్యక్రమానికి ముందు ఖైరతాబాద్ వినాయకుడిని భారీ సంఖ్యలో దర్శించకున్నారు. -
బాలాపూర్ గణేష్ నిమజ్జన యాత్ర