
సాక్షి, హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించే శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశామని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్రకు 20 వేలమంది పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. ధూల్‌పేట్ నుంచి మొదలైన శోభాయాత్ర గౌలిగూడ దగ్గర ముగుస్తుందని, శోభాయాత్ర జరిగే ప్రాంతంలో సీసీటీవీలను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 9 గంటలకు శోభాయాత్ర పూర్తి అవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment