రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర దాదాపు 12గంటలపాటు సాగుతుందని నిర్వహకులు వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం జరుగుతుందని నిర్వహకులు వెల్లడించారు.
ఖైరతాబాద్ భారీ గణనాధుడికి తెలంగాణ ప్రభుత్వం పుష్పాభిషేకం చేసింది. ఆకాశం నుంచి చార్టర్ విమానం ద్వారా మూడు టన్నుల పూలను వినాయకుడిపై చల్లారు. గణేష్ శోభాయాత్ర కార్యక్రమానికి ముందు ఖైరతాబాద్ వినాయకుడిని భారీ సంఖ్యలో దర్శించకున్నారు.