Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు.
శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే..
ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట.
రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది.
నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు.
రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం.
ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం.
రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట.
Comments
Please login to add a commentAdd a comment