ram navami celebrations
-
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
భద్రాద్రిలో వైభవంగా మహా పట్టాభిషేక మహోత్సవం (ఫొటోలు)
-
కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం
-
అదిగో..అదిగో...భద్రగిరి
-
బెంగాల్‌ను నివేదిక కోరిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసపై నివేదిక సమర్పించాలని మమతా సర్కార్‌ను బుధవారం కేంద్రం కోరింది. రామనవమి ప్రదర్శనల్లో గత రెండురోజులు బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కోరినట్టు హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఇంకా అల్లర్లు కొనసాగుతూ ఉద్రిక్తత నెలకొనడంపై కేంద్రం ఆందోళన చెందుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అసన్సోల్ ఎంపీ, బీజేపీ నేత బాబుల్ సుప్రియో ఆరోపించారు. రామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలను వివరించేందుకు ఆయన బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో భేటీ అయ్యారు. రాణీగంజ్‌లో జరిగిన ఘర్షణలో ఓ వర్గం జరిపిన దాడిలో ఒకరు మరణించారని, బాంబు దాడిలో డీసీపీకి గాయాలయ్యాయని చెప్పారు. పలు షాపులు, గృహాలపై దాడులు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వివరించారు. కాగా పలు ప్రాంతాల్లో ఘర్షణలను నివారించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియోగించారు. -
ఒంటిమిట్ట రాముడికి ఏపీ సర్కారు తలంబ్రాలు
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఆరోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పుష్కరాలకు వెళితే పదవులు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని వివరించారు. ఈసారి గోదావరి పుష్కరాలకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తిరుమలలో రూ.300 దర్శనం టిక్కెట్లు, వసతి సదుపాయాన్నికూడా ఆన్లైన్ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌కు దేవాదాయశాఖ భూములు ఇంకా ఇవ్వలేదన్నారు. త్వరలోనే రైతులకు ఇచ్చినట్లుగానే పరిహారం తీసుకుని ప్రభుత్వానికి భూములు అప్పగిస్తామని వివరించారు.