ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసపై నివేదిక సమర్పించాలని మమతా సర్కార్‌ను బుధవారం కేంద్రం కోరింది. రామనవమి ప్రదర్శనల్లో గత రెండురోజులు బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కోరినట్టు హోంమంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఇంకా అల్లర్లు కొనసాగుతూ ఉద్రిక్తత నెలకొనడంపై కేంద్రం ఆందోళన చెందుతోంది.
మమతా బెనర్జీ ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అసన్‌సోల్ ఎంపీ, బీజేపీ నేత బాబుల్ సుప్రియో ఆరోపించారు. రామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలను వివరించేందుకు ఆయన బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో భేటీ అయ్యారు. రాణీగంజ్‌లో జరిగిన ఘర్షణలో ఓ వర్గం జరిపిన దాడిలో ఒకరు మరణించారని, బాంబు దాడిలో డీసీపీకి గాయాలయ్యాయని చెప్పారు. పలు షాపులు, గృహాలపై దాడులు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వివరించారు. కాగా పలు ప్రాంతాల్లో ఘర్షణలను నివారించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియోగించారు.
Comments
Please login to add a commentAdd a comment