Lord Ram
-
సరయూ నదీ తీరాన శ్రీరాముని సేవలో నటి సోనాలి బింద్రే (ఫోటోలు)
-
తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి
చెన్నై: రాముడు ఉత్తరభారతానికే దేవుడు అన్న భావనను తమిళనాడు ప్రజల్లో కల్పించారని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి అన్నారు. దీంతో తమిళనాడు ప్రజలకు రాముడి గురించి పెద్దగా తెలియదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువతకు భారత సంస్కృతి తెలియకుండా చేశారని ఆరోపించారు. ‘నిజానికి రాముడు తమిళనాడులో తిరగని చోటు లేదు. కానీ ఇక్కడి వారికి రాముడంటే తెలియదు. రాముడు ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను ప్రజల మనసుల్లోకి జొప్పించారు. రాష్ట్ర యువతకు భారత సంస్కృతి తెలియకుండా ఉండేందుకు సాంస్కృతిక హననం చేశారు’అని రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా రవి ఈ సందర్భంగా స్పందించారు.‘కొందరు గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియా వైరస్‌లతో పోల్చారు. వారికేమైందో తెలియదు కానీ ఆ అంశంపై ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఒక్కసారిగా మూగబోయారు’అని ఉదయనిధిని రవి పరోక్షంగా ఎద్దేవా చేశారు. కాగా, తమిళనాడులో డీంఎకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడులో ప్రభుత్వ స్కూళ్లలో విద్యా నాణ్యత అసలే లేదని, విద్యార్థులు కనీసం రెండంకెల సంఖ్యను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని గవర్నర్ విమర్శించారు. అయితే కేంద్రంలోని బీజేపీ గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి విశ్వనాథ గుడిని మసీదు అనడం దురదృష్టకరం: యోగి ఆదిత్యనాథ్ -
రాముడిపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యల దుమారం
చెన్నై: శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ వ్యాఖ్యానించారు. అరియలూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.చోళ రాజ వంశానికి చెందిన రాజేంద్ర-I వారసత్వాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. రాజేంద్ర చోళన్ జీవించాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు, ఆలయాలు ఉన్నాయి. అతని పేరు స్క్రిప్ట్‌లలో ప్రస్తావించారు. అతని శిల్పాలు ఉన్నాయి. కానీ రాముడు ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, చరిత్ర లేదు. రామడిని అవతార్ అని పిలుస్తారు. అవతార్ పుట్టదు. మనల్ని మభ్యపెట్టేందుకు ఇలా చేస్తారు. మన చరిత్రను దాచి మరో చరిత్రను పెద్దగా చూపించే ప్రయత్నమిది.అయితే డీఎంకే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై డిఎంకేపై మండిపడ్డారు.భగవంతుడు శ్రీరాముడిపై డీఎంకేకు ఉన్న ఆస్మిక అభిమానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. డీఎంకే నేతల జ్ఞాపకాలు ఇంత త్వరగా మసకబారుతున్నాయని ఎవరనుకుంటారు. వీరే కదా కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌లో చోళ రాజవంశం సెంగోల్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీని వ్యతిరేకించిన వారు? తమిళనాడు చరిత్ర 1967లో ప్రారంభమైందని భావించే డీఎంకే పార్టీ అకస్మాత్తుగా దేశ గొప్ప సంస్కృతి చరిత్రపై ప్రేమను చూపడం హాస్యాస్పదంగా ఉంది.రాముడిని ద్రావిడ మోడల్‌కు ఆద్యుడుగా పేర్కొన్న మరో మంత్రి రేగుపతిని ప్రస్తావిస్తూ.. తన సహోద్యోగితో (శివశంకర్) చర్చించి రాముడిపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నామలై కోరారు. భగవంతుడైన రాముడి గురించి కొన్ని విషయాలు తన సహచర మంత్రి నుంచి శివశంకర్ నేర్చుకోగలరనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భగవాన్ శ్రీరాముడు ఇప్పుడు బతికి ఉండి బీజేపీలో చేరకపోతే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి ఈడీ, సీబీఐలను పంపించేవారని అన్నారు. బీజేపీలో చేరుతావా? లేక జైలుకు వెళ్తావా? అంటూ బీజేపీ పెద్దలు బెదిరించేవారని చెప్పారు. బీజేపీలో చేరకపోతే రాముడికి కచి్చతంగా జైలుశిక్ష పడేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ శాసనసభలో 2024–25 బడ్జెట్‌ను ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సభలో శనివారం జరిగిన చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. -
అయోధ్య భక్తజన సంద్రం.. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రేపే
అయోధ్య.. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం. అది శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆందోళనలు..అవన్నీ సమసిపోయాయి. రాముడు పుట్టిందక్కడే అని బలంగా నమ్మే కోట్లాది భక్త హృదయాలు ఉప్పొంగేలా, భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శనభాగ్యం కలిగించబోతున్నాడు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో భక్తవత్సలుడు కొలువు దీరబోతున్నాడు. కనులారా బాలరాముడిని వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక, ఇతర రంగాల ప్రముఖులు, ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. రూ.1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టు కావటంతో ఆలయాన్ని మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం దిగువ అంతస్తు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సిద్ధం చేసిన బాల రాముడి విగ్రహానికి రేపు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. బాలరాముడిని ప్రతిష్ఠించే గర్భాలయం; 1947 నుంచి పూజలందుకుంటున్న విగ్రహం; ప్రాణప్రతిష్ఠ జరగనున్న బాలరాముడి విగ్రహం మొదటి అంతస్తులో రామదర్బార్ రావణవధ అనంతరం తిరిగి వచ్చిన సీతారాములకు అయోధ్యలో అంగరంగవైభవంగా పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత సోదర, ఆంజనేయ సమేతంగా అద్భుత పాలనతో సుభిక్ష రామరాజ్యం విలసిల్లిందన్నది పురాణగాధ. బాలరాముడితో దర్శనం సమాప్తమైతే.. సీతారాములను కనులారా వీక్షించాలని ఉబలాటపడే భక్తుల్లో కొంత అసంతృప్తి ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంతస్తులో ‘రామదర్బార్’ రూపంలో అద్భుత దర్శనభాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రులు లక్ష్మణ, భరత, శత్రఘ్న, ఆంజనేయ విగ్రహాలు సమేతంగా భక్తులకు మొదటి అంతస్తులో దర్శనమివ్వనున్నాయి. రామదర్బార్ విగ్రహాలను రాజస్థాన్ తెల్లరాతితో సిద్ధం చేయనున్నారు. వచ్చే సంవత్సరం ఆ విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఆ దివ్య మందిరంపై నిర్మించే రెండో అంతస్తులో ఎలాంటి దర్శన ఏర్పాట్లు చేయాలన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి మొదటి రెండు అంతస్తులను పూర్తి చేసి రామ దర్బార్ దర్శనం కలిగించనున్నారు. బాలరాముడి రూపునకు మూడు విగ్రహాల పరిశీలన బాలరాముడి రూపు కోసం మూడు విగ్రహాలను పరిశీలించారు. రాజస్థాన్ , కర్నాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు ఆరు నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్నాటక నుంచి మూడు కృష్ణ శిలలు, ఓంకారేశ్వర్పూజ్య అవధూత నర్మదానంద్జీ మహరాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన మూడు బాల రాముడి విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్టు సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే రేపు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మూల విరాట్‌గా కొత్త విగ్రహం... ఉత్సవమూర్తిగా పాత విగ్రహం దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభి రాముడు దర్శనం ఇవ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. రామజన్మభూమిలో 1947లో రాముడి విగ్రహం ఒకటి వెలుగు చూసింది. దాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోనే ఉంచి పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక మందిరంలో ఆ విగ్రహమే పూజలందుకుంటోంది. కొత్త ఆలయంలో ప్రాణప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన తరుణంలో, పాత విగ్రహాన్ని ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉద్భవించాయి. ఇటీవలే ట్రస్టు ఆ సందేహాలను నివృత్తి చేసింది. దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహం ముందే ఆ పాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాట్గానూ, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా మారుస్తున్నారు. ప్రత్యేక పూజాదికాల కోసం ఉత్సవ విగ్రహం వివిధ ప్రాంతాలకు తరలుతుందని, మూల విరాట్ గర్భాలయంలోనే స్థిరంగా ఉంటుందని ట్రస్టు స్పష్టం చేసింది. అయోధ్యలో సరయూ నదికి హారతి లేజర్ షో జటాయువు కంచు విగ్రహం కూడా... 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో జటాయువు కంచు విగ్రహాన్ని కూడా రూపొందిస్తున్నారు. అక్కడి కుబేర్టీలాపై ప్రతిష్ఠించే ఈ విగ్రహం మూలమూర్తి వైపు ధ్యానముద్రలో చూస్తూ వినమ్రంగా ఉండేలా దీనిని ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్రామ్ సుతార్ సిద్ధం చేస్తున్నారు. దక్షిణ భారతశైలిలో గాలిగోపురం దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామజన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు. అయితే నాగరశైలిలో గాలి గోపురాలకు చోటు లేదు. కానీ రామజన్మభూమి ఆలయ ప్రవేశం వద్ద మాత్రం భారీ గాలిగోపురం నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాముడు పుట్టిన చోటనే గర్భగుడి కట్టాలని అదనంగా స్థల సేకరణ సుప్రీంకోర్టు తీర్పుతో 72 ఎకరాలు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధీనంలోకి వచ్చాయి. అయితే రాముడు జన్మించినట్టుగా చెబుతున్న భాగంలోనే గర్భాలయం నిర్మించాలన్నది ప్రణాళిక. కానీ రాముడు పుట్టినట్టుగా పేర్కొంటున్న ఆ భూమి ఆగ్నేయ మూలలో ఉంది. అది గర్భాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో దాని వెనుకవైపు కొంత భూమిని ప్రైవేట్వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసి ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయ నమూనాకు వీలుగా సిద్ధం చేసింది. ఏఏఏ ఆలయ పునాదుల్లో నాలుగున్నర లక్షల ఇటుకలు రామ మందిర నిర్మాణంతో తమ చేయూత ఉండాలన్న సంకల్పంతో దేశంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఇటుకలు పంపారు. అలా నాలుగు లక్షల గ్రామాల నుంచి నాలుగున్నర లక్షల ఇటుకలు అయోధ్యకు చేరాయి. అయితే ఆలయాన్ని పూర్తి రాతి కట్టడంగా నిర్మిస్తున్నందున ఇటుకల వాడకం సాధ్యం కాదు. అలా అని మరోచోట ఈ ఇటుకలను వినియోగిస్తే.. భక్తులు అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. దీంతో వాటికి ప్రత్యేకస్థానం దక్కాల్సిందేని భావించిన ట్రస్టు, వాటిని ఆలయ పునాదుల్లో వినియోగించింది. ఇప్పుడు నాలుగున్నర లక్షల ఇటుకలు పునాది భాగంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. దిగువ అంతస్తులో బాలరాముడు ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. భూ ఉపరితలం నుంచి 20 అడుగుల ఎత్తుతో ప్రదక్షిణ పథ (పరిక్రమ్) నిర్మించారు. దాని మీద ప్రధాన ఆలయం దిగువ అంతస్తు ఉంటుంది. ఈ దిగువ అంతస్తులోనే బాల రాముడి విగ్రహం ఉంటుంది. రాముడు పుట్టినట్టుగా భావిస్తున్న చోటనే ఈ ఆలయం నిర్మిస్తున్నందున అక్కడే బాలరాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి రూపం 51 అంగుళాల విగ్రహంగా భక్తజనానికి దర్శనమివ్వనుంది. ఎన్నో ప్రత్యేకతలు రాముడి సుగుణాలు అనేకం..ప్రతిఒక్కోటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో న భవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతి పెద్ద దేవాలయం కూడా ఇదే. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ఆలయం, పరిసరాలన్నీ కలుపుకొని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు సంక్రమించినది 72 ఎకరాలు. మిగతా భూమిని ప్రైవేట్సంస్థలు, వ్యక్తుల నుంచి ట్రస్టు కొనుగోలు చేసింది. ఇందులో 2.7 ఎకరాల్లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం రూపుదిద్దుకుంటోంది. 2025 నాటికి మొత్తం ఆలయం సిద్ధం ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. మూడంతస్తులుగా ఉండే ఈ ఆలయంతోపాటు ఆ ప్రాంగణంలో పర్కోట (ప్రాకారం) ఆవల మరో ఎనిమిది మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్నవర్గాలకు చెందిన వారి ఆలయాలు నిర్మిస్తారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు..లాంటి వారితో కూడిన ఎనిమిది గుళ్లుంటాయి. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టి కోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన జరిగిందన్నది ట్రస్టు మాట. అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ట్రస్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభమైన వేడుకలు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 16 నుంచే మొదలయ్యాయి. హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతోపాటు బాలరాముడి విగ్రహానికి శోభాయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభాయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. వాస్తుశిల్పి ‘సోమ్‌పురా’ సారథ్యంలో నిర్మాణ పనులు దేవాలయ ఆర్కిటెక్ట్‌గా ప్రఖ్యాత ‘సోమ్‌పురా’ కుటుంబమే వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ కుటుంబం వందకుపైగా ఆలయాలను రూపొందించింది. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయానికి కూడా వాస్తుశిల్పిగా పనిచేసిన ఆ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉంది. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోమ్‌పురా చీఫ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షర్‌ధామ్‌ను రూపొందించారు. ఆయన ఇద్దరు కుమారులు నిఖిల్ సోమ్‌పురా, ఆశిష్ సోమ్పురాలు ఆర్కిటెక్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన ఆలయం 235 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పవచ్చు. ► ఆలయ నిర్మాణం ఆగమశాస్త్రం నాగర విధాన గుర్జర చాళుక్య శైలిలో రూపుదిద్దుకుంటోంది. ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఒక్కో అంతస్తులో నృత్య, రంగ, కుడు, కీర్తన, ప్రార్థన పేర్లతో ఐదు మండపాలుంటాయి. ► ప్రధాన ఆలయంలో 366 స్తంభాలుంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలు, ఇతర నగిషీలు ఉంటాయి. ► స్తంభాలపై శివుడు, వినాయకుడు, దశావతారాలు, యోగినులు, సరస్వతి ఇతర దేవతా రూపాలను చిత్రీకరించారు. ► గర్భాలయం అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ► దేవాలయాన్ని లేత గులాబీరంగు ఇసుక రాయితో నిర్మించారు. ఇందుకు రాజస్థాన్ లోని భరత్పూర్ జిల్లా బన్సీపహాడ్‌పూర్ క్వారీ నుంచి 5 లక్షల ఘనపుటడుగుల లేత గులాబీ రంగు రాయి, గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా నుంచి లక్ష ఘనపుటడుగుల తెలుపురంగు చలవరాతిని తెప్పించారు. ► రామ జన్మభూమికి సంబంధించి 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పు రాగా, 2020 ఫిబ్రవరిలో దేవాలయ కమిటీ ఏర్పాటైంది. ఆలయానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ► ఆలయ పనులు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 3500 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ► ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ కాగా, పనుల పర్యవేక్షణ బాధ్యత టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తోంది. ► శిల్పాలను తీర్చిదిద్దేందుకు ఒడిషా నుంచి ఎక్కువమంది శిల్పులు వచ్చారు. సిమెంట్ లాంటి బైండింగ్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. ఇందులో రాళ్లు జోడించటం అనేది క్లిష్టమైన ప్రక్రియ, ఈ ప్రక్రియలో విశేష అనుభవం ఉన్న రాజస్థాన్ నిపుణులకు ఆ బాధ్యత అప్పగించారు. కాపర్ క్లిప్స్ మాత్రమే వాడి రాళ్లను అనుసంధానిస్తున్నారు. ► ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సిబ్బంది పనుల్లో పాల్గొంటున్నారు. ఈ మందిరం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక ‘‘రాముడు జన్మించిన చోటే ఆయన దేవాలయం నిర్మితమవుతుందన్న విశ్వాసం పదేళ్ల క్రితం వరకు లేదు. కానీ అది సాధ్యమై ఇప్పుడు ఆ ఆదర్శ పురుషుడి దివ్య దర్శనానికి నోచుకోబోతున్నాం. అందుకే రామజన్మభూమి మందిరం నిర్మించాలన్న ఆకాంక్ష దైవ సంకల్పమని నేను నమ్ముతాను. అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య మందిరం ఓ సాధారణ దేవాలయం కాదు, అది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీక. అందరూ ఆ అద్భుతాన్ని దర్శించుకోవాలి. దేవుడి ముందు అంతా సమానులే, అందరిపట్లా ఆ రాముడిది సమభావనే. అందుకే ఈ నిర్మాణం సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ నలుమూలల ఆలయ నిర్మాణ సంప్రదాయాలను ప్రతిఫలిస్తుంది. దేశంలోని ప్రతి గ్రామ చొరవ అందులో కనిపిస్తుంది. దాదాపు రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆలయ ఖర్చులో ప్రభుత్వాలది నయా పైసా లేదు. అంతా భక్తుల విరాళమే. అందుకే మన దేవుడు, మన మందిరం.’’ – నృపేంద్ర మిశ్రా, శ్రీ రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ . ప్రధానమంత్రి కార్యాలయ మాజీ ముఖ్య కార్యదర్శి ఆ తలుపుల తయారీలో తెలుగువారు... ప్రధాన ఆలయానికి తలుపులు అమర్చే అవకాశం హైదరాబాద్‌కు చెందిన అనురాధా టింబర్ డిపోకు దక్కింది. డిపో నిర్వాహకుడు శరత్ బాబు చదలవాడ గతంలో యాదాద్రి మందిరానికి తలుపు చేయించారు. అయోధ్య రామ మందిరానికి తలుపుల నమూనా కావాలంటూ ట్రస్టు సభ్యుల నుంచి పిలుపు రావటంతో ఆయన టేకుతో దాన్ని సిద్ధం చేయించారు. ఆ పనితనానికి సంతృప్తి చెందిన కమిటీ ఆయనతో చర్చించి తలుపులు సిద్ధం చేసే బాధ్యత అప్పగించింది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన మేలిమి రకం టేకు చెక్కతో తలుపులు రూపొందిస్తున్నారు. శరత్ బాబు చదలవాడ అయోధ్యలోని కరసేవక్ పురంలోని కార్యశాలలో ఈ తలుపులను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అక్కడి ఇన్ చార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు వాటిని రూపొందిస్తున్నారు. మొత్తం 44 తలుపులకుగాను ప్రస్తుతానికి 18 సిద్ధమయ్యాయి. వీటిని దిగువ అంతస్తులో వినియోగిస్తారు. బాలరాముడు ఉండే గర్భాలయానికి సంబంధించి రెండు జతలు పూర్తి చేసి ఆలయానికి చేర్చారు. 9 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో ఇవి రూపొందాయి. నెమలి పురి విప్పుకున్నట్టు వీటిపై నగిషీలద్దారు. ఇక అంతస్తులోని ఇతర ప్రాంతాల్లో వాడే తలుపులకు ఏనుగు అర్చిస్తున్నట్టుగా.. పద్మాలు విచ్చుకున్నట్టుగా... ఇలా పలు చెక్కడాలతో అద్భుతంగా రూపొందించారు. వెయ్యేళ్లపాటు వర్థిల్లే దేవాలయానికి తలుపులు సిద్ధం చేసే అవకాశం రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చదలవాడ శరత్‌బాబు ‘సాక్షి’తో చెప్పారు. అన్నీ ఉచితమే... అందరూ సమానమే! రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 60 కిలోల బంగారంతో తాపడం ఆలయంలోని తలుపులకు బంగారంతో తాపడం చేయించనున్నారు. అన్ని తలుపులకు కలిపి 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. దిగువ అంతస్తు బాలరాముడి ఆలయ తలుపులకు తాపడం పనులు ప్రారంభించారు. అనంతరం తాపడం కోసం సిద్ధం చేశారు. తలుపులపై ఉన్న నగిషీల తరహాలోనే బంగారు తాపడంపై కూడా సిద్ధం చేస్తున్నారు. భారీ భూకంపాలను తట్టుకునేలా... రామమందిర ప్రత్యేకతల్లో పునాది కూడా ఒకటి. 161 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతున్న దివ్యభవ్య మందిరానికి 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. అయోధ్య పట్టణ శివారు నుంచి సరయూ నది ప్రవహిస్తోంది. అయితే 400 ఏళ్ల క్రితం సరయూ ప్రస్తుతం ఆలయం నిర్మిస్తున్న ప్రాంతానికి అతి చేరువగా ప్రవహించేది. దీంతో ఆ ప్రాంత భూగర్భం ఇసుక మేటలతో నిండి ఉంది. భారీ నిర్మాణానికి పునాది పడాలంటే ఆ ఇసుకనంతా తొలగించాలి. ఇందుకోసం ఐఐటీ, ఎన్ ఐటీ నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్ పరిశోధకులు కలిసి దీనికి ప్రత్యేక పునాది నిర్మాణానికి డిజైన్ చేశారు. 50 అడుగుల లోతు నుంచి ఇసుక, మట్టిని తొలగించి వాటికి రీయింజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు, 10 శాతం ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పారలుగా వేసి వాటిని కాంపాక్ట్‌గా మార్చి 47 పొరలుగా పైవరకు నిర్మించారు. ఆ ఇసుక, మట్టి భాగం పూర్తిగా గట్టిబడి 50 అడుగుల ఏకశిలగా మారింది. దాని మీద రెండున్నర మీటర్ల మందంతో రాఫ్ట్ నిర్మించారు. ఆ పైన ఒకటిన్నర మీటరు మందంతో గ్రానైట్ రాతిని పరిచి దాని మీద ప్రధాన నిర్మాణం జరిపారు. ఇప్పుడు భూ ఉపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 అడుగుల ఎత్తులో మొదలవుతుంది. అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పునాది డిజైన్ మార్చింది తెలుగు ఇంజినీరింగ్ నిపుణుడే..! అయోధ్య మందిరానికి ప్రస్తుతం ఏర్పాటు చేసిన పునాదికి డిజైన్ చేసింది తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుడే కావటం విశేషం. తొలుత ఐఐటీ మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంటు కాంక్రీట్ పైల్స్ డిజైన్ ఇచ్చారు. ఆలయ ట్రస్టు దానికి సమ్మతించి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్కోటి మీటర్ వ్యాసం, 40 మీటర్ల లోతుతో సిమెంట్కాంక్రీట్పైల్స్ను పునాదిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇలా 1200 పైల్స్ ఏర్పాటు చేసి దాని మీద ప్రధాన నిర్మాణం చేపట్టాలన్నది వారి ఆలోచన. కానీ, సిమెంటు కాంక్రీట్పైల్స్ వయసు కేవలం వందేళ్లలోపు మాత్రమే ఉంటుందని పేర్కొంటూ, వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాని బదులు కాకతీయులు అనుసరించిన శాండ్బాక్స్ టెక్నాలజీని వినియోగిస్తే వెయ్యేళ్ల జీవిత కాలం ఉంటుందని రామప్ప, వేయి స్తంభాల దేవాలయాలపై నిర్వహించిన పరిశోధన పత్రాలను జత చేశారు. దీంతో ఆయనకు ట్రస్టు నుంచి పిలుపు వచ్చింది. విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పాండురంగారావు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రతినిధులతో పునాది నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు. నిర్మాణ ప్రాంతం గుండా వందల ఏళ్ల కింద సరయూ నది ప్రవహించటంతో భూమి పొరల్లో ఇసుక మేటలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాది డిజైన్ ను తిరస్కరించింది. తర్వాత 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీయింజనీర్డ్ ఇసుక, దానికి కొన్ని రసాయనాలు, స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలు పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. అలా చేస్తేనే పునాది కనీసం వెయ్యేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. పాండురంగారావు సూచన మేరకే కొత్త పునాది ప్రణాళిక అమలు చేసి, వెయ్యేళ్లపాటు నిలిచే రీతిలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. మందిర పునాది ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు వేయేళ్లు ఉండేలా... అయోధ్య రామాలయం వేయి సంవత్సరాల వరకు పటిష్ఠంగా ఉండేలా నిర్మిస్తున్నారు. ఇది జరగాలంటే పెద్దపెద్ద భూకంపాలను కూడా తట్టుకుని నిలబడే నిర్మాణం అవసరం. ఇందుకోసం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు నిర్మాణ డిజైన్ లో పాలుపంచుకున్నారు. నేపాల్నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల తీవ్రతను పరిశీలించి వాటికి 50 రెట్లు పెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. వరదలను తట్టుకునేలా... అయోధ్య నగరం మీదుగా సరయూ నది ప్రవాహం గతంలో ఉండేది. ఇప్పుడు నగర శివారు గుండా ప్రవహిస్తోంది. ప్రతి వేయి సంవత్సరాల్లో నదీ ప్రవాహ గమనం మారడం సహజం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇప్పుడు గుడి నిర్మిస్తున్న ప్రాంతం మీదుగా వరద పోటెత్తినా, పెద్దపెద్ద వరదలు సంభవించినా నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలా దాని పునాది పైన పీఠం ప్లాన్ చేశారు. ఇందుకు సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సిఫారసులను అనుసరించారు. 25 వేల మంది సామర్థ్యంతో త్వరలో బస ఏర్పాట్లు... ఆలయానికి చేరువలో భక్తులకు వసతి మందిరం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీంట్లో 25 వేల మంది వరకూ ఉండొచ్చు. ఈ గదులను ఉచితంగా అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. లక్షమంది భక్తులకు వసతి ఉండేలా గదులు సిద్ధం చేయాలన్న ఆలోచనలో ట్రస్టు ఉంది. అయితే సొంతంగా ఏర్పాటు చేయాలా, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రతి శ్రీరామనవమీ ప్రత్యేకమే! ► నవమి నాడు బాలరాముడి నుదుటిపై సూర్య కిరణాలు ► ప్రధాని మోదీ కోరికకు తగ్గట్టుగా నిర్మాణం అయోధ్య రామమందిరంలో ప్రతి శ్రీరామనవమి ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆ రోజు సూర్యోదయ వేళ ఆలయ దిగువ అంతస్తు గర్భాలయంలోని బాల రాముడి విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఆకాంక్షను ట్రస్టు ముందర ఉంచారు. ఆ మేరకు నిర్మాణం జరుగుతోంది. కిరణాలు దిగువ అంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గర్భాలయం ద్వారం ఎత్తు, విగ్రహ ఎత్తును ఖరారు చేశారు. చాలా విశాలమైన దేవాలయం కావటంతో సహజసిద్ధంగా సూర్యకిరణాలు లోనికి వచ్చే వీలు ఉండదేమోనన్న ఉద్దేశంతో ప్రతిబింబం రూపంలో సూర్యకాంతి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పట్లో రోజుకు 2 వేల మంది.. ఇప్పుడు 50 వేల మంది.. రేపు లక్ష? అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. అయోధ్య రాముడి విరాళాలు రూ.3500 కోట్ల పైమాటే... ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. (అయోధ్య నుంచి ‘సాక్షి’ ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి) ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
రంగనాథుని సేవలో మోదీ
సాక్షి, చెన్నై/ తిరుచిరాపల్లి: కొద్దిరోజులుగా శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ అందులో భాగంగా శనివారం తమిళనాడులోని ద్వీప పట్టణం ‘శ్రీరంగం’లోని ప్రఖ్యాత శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శనివారం ఉదయం ధోతి, అంగవస్త్రం, రుద్రాక్షమాలతో తమిళ సంప్రదాయ ఆహార్యంలో ఆలయానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఆలయ నిర్వహణ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారికి వేదాలు పఠిస్తూ పండితులు తోడు వచ్చారు. మోదీ ఆ తర్వాత రంగనాథస్వామివారిని దర్శించుకున్నారు. రామానుజాచార్య, చక్రత్తాళ్వార్ సన్నిధాలను సందర్శించారు. ఆలయ ఏనుగు ఆండాళ్ ఆశీ్వరాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు మౌతార్గాన్ వాయిస్తూ ఆహ్వానం పలకడం విశేషం. భారత ప్రధాని రంగనాథ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే తొలిసారి. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి కంబ రచించిన కంబ రామాయణాన్ని ఈ సందర్భంగా మోదీ పారాయణం చేశారు. తమిళనాడులోని ప్రఖ్యాత వైష్ణవదేవాలయాల్లో రంగనాథాలయం ముఖ్యమైనది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రామేశ్వరం ఆలయంలోనూ... శనివారం మధ్యాహ్నం మోదీ రామేశ్వరం వెళ్లారు. అగ్నితీర్థం బీచ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. 22 పవిత్ర తీర్థాలలో స్నానం చేశారు. ప్రాచీన శివాలయమైన ప్రఖ్యాత రామనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. భక్తి, భజన కార్యక్రమాల్లో పాల్గొని భజన చేశారు. రామయణ గాథతో ఈ ఆలయానికి గాఢానుబంధం ఉంది. అనంతరం పట్టణంలోని బీజేపీ కార్యకర్తలు, స్థానికులతో మోదీ మాట్లాడారు. రాత్రి రామేశ్వరంలోని రామకృష్ణ మఠంలో బస చేశారు. ఆదివారం ఉదయం ఆయన మళ్లీ రామేశ్వరం అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేసి మరోమారు రామనాథస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సమీప గ్రామంలోని కోడండరామస్వామి దర్శనంతో మోదీ మూడు రోజుల తమిళనాడు పర్యటన పూర్తవుతుంది. తిరుచిరాపల్లిలో రోడ్ షో తిరుచిరాపల్లి పురవీధుల్లో జనం మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పూలవర్షం కురిపించారు. వారందరికీ వనక్కమ్ అంటూ మోదీ అభివాదం చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ మార్గమంతా మార్మోగిపోయింది. అక్కడి నుంచి శ్రీరంగం వైపుగా మోదీ రోడ్‌షో కొనసాగింది. -
రూ.500 నోటుపై గాంధీ స్థానంలో శ్రీరాముడు..?
-
అయోధ్యలో రామమందిరంలో.. ధనుర్ధారిగా రామయ్య విగ్రహం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం ధనుర్ధారిగానే ఉండనుంది. పవిత్ర కృష్ణశిలలో 5 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తొలుస్తారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజా భేటీలో విగ్రహం రూపురేఖలను ఖరారు చేశారు. రాముడు విల్లుబాణాలు చేబూని నిలబడినట్లుగా విగ్రహం ఉంటుందని ట్రస్టు సభ్యుడు స్వామి తీర్థ ప్రసన్నాచార్య బుధవారం చెప్పారు. వచ్చే సంక్రాంతి నాటికి మందిర నిర్మాణం పూర్తవుతుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. -
రామతీర్థం కోదండ రాముని విగ్రహం ధ్వంసం
సాక్షి, నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. (చదవండి: వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి) సమాచారం తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొంతమంది కావాలనే ఈ ఘటనకు పాల్ఫడ్డారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని రాజకీయ ఉన్మాదులు, అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. -
కర్ణాటకలో మరోసారి కలకలం
బెంగుళూరు : ఒక మతానికి వ్యతిరేకంగా పెట్టిన ఓ ఫేస్బుక్ పోస్టు వల్ల కర్ణాటకలో వారం రోజుల క్రితం జరిగిన హింసాకాండ మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఓ వాట్సాప్ గ్రూపులో శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 20 ఏళ్ల ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కర్ణాటకలో రాయచూర్‌లోని దేవదుర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాముడిని తీవ్రపదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. (డబ్బున్న యువతులే టార్గెట్) ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకముందే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని దేవదుర్గ పోలీసులు తెలిపారు. గతవారం ఓ వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి ప్రేరేపించింది. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాల పాలయ్యారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) -
రాముడి జన్మస్థలంపై మళ్లీ పేట్రేగిన నేపాల్ ప్రధాని
ఖట్మండు : నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరో వివాదానికి తెరలేపారు. శ్రీరాముడి జన్మస్థలం దక్షిణ నేపాల్‌లోని అయోధ్యాపురి అని, యూపీలోని అయోధ్య కాదని ఆయన పేర్కొన్నారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఇటీవల అత్యంత వైభవంగా భూమిపూజ జరిగిన నేపథ్యంలో ఓలి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మాడి మేయర్ ఠాకూర్ ప్రసాద్ ధకాల్ నేతృత్వంలో తనను కలిసిన ప్రతినిధి బృందంతో రాముడి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తన ప్రణాళికలను పంచుకున్నారు.అయోధ్యపురిని శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా ప్రచారం చేయాలని, అక్కడ రాముడి విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. మాడి మున్సిపాలిటీ పేరును అయోధ్యపురిగా మార్చాలని సూచించారు. చదవండి : ఐక్యరాజ్యసమితికి నేపాల్ కొత్త మ్యాప్ కాగా, నేపాల్ ప్రధాని ఓలి గత నెలలోనూ ఇవే వ్యాఖ్యలు చేయగా పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. నేపాల్ ప్రధాని భారత వ్యతిరేక వ్యాఖ్యలను ఆయన పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాముడి జన్మస్థలంపై ఓలి ప్రచారాన్ని జానకి ఆలయ పూజారులు సహా నేపాల్‌కు చెందిన మత నేతలు ఖండిస్తున్నారు. అయోధ్య భూమిపూజలో పాల్గొన్న నేపాల్ మత బోధకుడు ఆచార్య దుర్గా ప్రసాద్ గౌతమ్ ప్రధాని ఓలి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. మరోవైపు నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ఓలికి వ్యతిరేకంగా అంతర్గత పోరు తీవ్రతరమైంది. పార్టీ అగ్రనేత పుష్ప కమల్ దహల్‌తో పాటు మాజీ ప్రధానులు మాధవ్ నేపాల్, జల్నాథ్ ఖనల్‌లు ఓలి తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఆయన ప్రేమకు ప్రతిరూపం’
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపమని ప్రస్తుతించారు. రాహుల్ తన ట్వీట్లో ఎక్కడా బీజేపీని ప్రస్తావించలేదు. ‘మర్యాద పురుషోత్తముడైన రాముడు ఉత్తమ మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అతను మన మనస్సు లోతుల్లో ఉన్న మానవత్వానికి ప్రతీక.. ప్రేమను చాటే రాముడు ఎన్నడూ ద్వేషాన్ని వ్యక్తపరచరు. కరుణామయుడైన రాముడిలో ఎప్పుడూ క్రూరత్వం కనిపించదు. న్యాయానికి ప్రతిరూపమైన రాముడు ఎన్నడూ అన్యాయం వ్యక్తీకరించర’ని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా అయోధ్యలో జరిగే భూమిపూజ కార్యక్రమం జాతి ఐక్యతకు సంకేతంగా నిలిచే సాంస్కృతిక సమ్మేళనం కావాలని ఆకాంక్షిస్తూ రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యంత వైభవంగా జరిగిన భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం లభించలేదు. రామాలయ నిర్మాణం ప్రారంభ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకను అమర్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా దాదాపు 150 మంది పాల్గొన్నారు. చదవండి : డిగ్గీ రాజా సలహా : కాంగ్రెస్‌లో గగ్గోలు -
రాముడి వారసులున్నారా?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం–బాబ్రీమసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీరాముడి సంతతికి చెందిన రఘువంశం వారు అయోధ్యలో ఎవరైనా ఉన్నారా? అని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్‌ను ప్రశ్నించింది. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని పరాశరన్ వాదించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పందిస్తూ..‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. రోజువారీ విచారణ సాగుతుంది అయోధ్య భూ వివాదం కేసులో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు రోజువారీ విచారణ చేపట్టడంపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. ఇంతవేగంగా విచారణ జరపడం వల్ల సంబంధిత పత్రాలను అధ్యయనం చేసి విచారణకు సిద్ధం కావడం కష్టంగా ఉందని కోర్టుకు విన్నవించారు. -
అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్ నిర్ణయం
లక్నో : అయోధ్యను పర్యాటకంగా, మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలో అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం యూపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అయోధ్యను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయోధ్యలోని సరయూ నది తీరాన వంద ఎకరాల భూమిలో 251 మీటర్ల అతి పెద్ద రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అతిత్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సర్వే కోసం ఐఐటీ కాన్పూర్, నాగ్‌పూర్ బేస్డ్ నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారం తీసుకుంటామన్నారు. అయోధ్యలో విగ్రహంతో పాటు డిజిటల్ మ్యూజియం, లైబ్రెరీ, ఫుడ్‌ఫ్లాజాలు, మైదానం, గోశాలలు నిర్మించాలని సమావేశంలో తీర్మానించినట్లు సీఎం తెలిపారు. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే అయోధ్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొయ్యతో తయారు చేసిన ఏడడుగుల రాముడి విగ్రహాన్ని అవిష్కరించారు. గతేడాది గుజరాత్లో ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) పేరిట 183 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
‘పీఎంఏవై కింద రాముడికి ఇల్లు ఇవ్వండి’
లక్నో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీరాముడికి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ అయోధ్య జిల్లా మేజస్ట్రేట్కు లేఖ రాశారు. రాముడు ప్రస్తుతం టెంట్లో ఉంటున్నారని యూపీ ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు.కాగా అయోధ్యలో రామమందిరం ఎప్పుడు నిర్మించినా అది తమ హయాంలోనే జరుగుతుందని, మరొకరితో సాధ్యం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ సంస్కృతే భారత సంస్కృతని అన్నారు. మరోవైపు అయోధ్యలో మందిర నిర్మాణానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. మందిర్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాదని పేర్కొన్నారు. -
‘అత్యాచారాలను శ్రీరాముడు కూడా ఆపలేడు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరిగే అత్యాచారాలను శ్రీ రాముడు కూడా ఆపలేడని, అది చాలా సహజం’ అని పేర్కొన్నారు. రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరు మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలం’ అంటూ వ్యాఖ్యానించారు. సురేందర్ సింగ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ అధికారుల కంటే ప్రాస్టిట్యూట్లు (వేశ్యలు) నయమని గతంలో ఓ కార్యాక్రమంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం వల్లనే యువత అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ కేసులో నిందితుడిగా ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌కు సురేందర్ సింగ్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. Main daawe ke saath keh sakta hoon ki Bhagwan Ram bhi aa jaenge to bhi ye ghatna pe niyantran kar pana sambhav nahi hai. Ye samaj ka svabhavik pradooshan hai, jisse koi bhi vanchit rehne wala nahi hai: Surendra Singh, BJP MLA on incidents of rape pic.twitter.com/dgjA7QoCtz — ANI UP (@ANINewsUP) July 7, 2018 -
రాముడికి ఆ పార్టీ 21 ఏళ్ల వనవాసమిచ్చింది!
న్యూఢిల్లీ: శ్రీరాముడికి బీజేపీ 21 ఏళ్ల వనవాసాన్ని ప్రసాదించిందని, 21 ఏళ్లుగా ఆ పార్టీ యూపీలో రామమందిరం కడతామని తన మ్యానిఫెస్టోలో చెపుతూనే ఉందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం పేర్కొంది. '1996 నుంచి శ్రీరాముడికి బీజేపీ 21 ఏళ్ల వనవాసాన్ని ఇచ్చింది. ఆఖరికీ రాముడికి కూడా బీజేపీపై విశ్వాసం సన్నగిల్లి ఉండాలి. 21 ఏళ్లు ఎవరు ఎదురుచూస్తారు. చాలా ఏళ్లుగా వాళ్లు రామమందిరం కడతామని మ్యానిఫెస్టోలో చెప్తూనే ఉన్నారు' అని కాంగ్రెస్ నాయకుడు టామ్ వడక్కన్ పేర్కొన్నారు. రామమందిరం కడతామంటూ బీజేపీ ప్రజలకు హామీలు ఇస్తూనే ఉందని, ఆ పార్టీకే కాదు రాముడికి సైతం ఇది నినాదంగా మారిందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరాన్ని 'రాజ్యాంగానికి లోబడి' నిర్మిస్తామని బీజేపీ శనివారం తన మ్యానిఫెస్టలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రామమందిరం విషయంలో బీజేపీ తన వైఖరికి కట్టుబడి ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.